BigTV English

OTT Movie : బుల్లెట్ ట్రైన్‌లో బాంబ్.. ఆపితే పేలుడే, నరాలు తెంపేసే ఓటీటీ మూవీ

OTT Movie : బుల్లెట్ ట్రైన్‌లో బాంబ్.. ఆపితే పేలుడే, నరాలు తెంపేసే ఓటీటీ మూవీ

OTT Movie : థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు కొద్దిరోజుల్లోనే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. థియేటర్లలో చూడకపోయినా, మరోసారి చూడాలనుకున్నా, ఓటిటి ప్లాట్ ఫామ్ ఇప్పుడు అందుబాటులో ఉంది. భాషతో సంబంధం లేకుండా వీటిలో సినిమాలను చూస్తూ, ఎంటర్టైన్ అవుతున్నారు ప్రేక్షకులు. రీసెంట్ గా థియేటర్లలో సూపర్ హిట్ కొట్టిన ఒక జపాన్ మూవీ ఓటీటీ లోకి రాబోతోంది. ఈ మూవీ ఒక బుల్లెట్ ట్రైన్ తో మొదలవుతుంది. ఇక ఆ ట్రైన్ లో జరిగే సన్నివేశాలు టెన్షన్ తో, గుండె జారిపోయే విధంగా ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో

ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోషన్’ (Bullet Train Explosion). ఈ మూవీ 1975 లో విడుదలైన జపాన్ సినిమా ‘The Bullet Train’కు రీమేక్ చేశారు. దీనికి షిన్జీ హిగుచి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో ఏప్రిల్ 23, 2025 నుంచి విడుదల కానుంది. రెండు వారాలు ఓపిక పడితే, ఒక అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్ మీముందు ఉంటుంది. ఈ మూవీ స్టోరీ ఒక హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ చుట్టూ తిరుగుతుంది. అందులో ఒక బాంబు ఉండటంతో స్టోరీ ఉత్కంఠంగా సాగుతుంది.


స్టోరీలోకి వెళితే

టోక్యోకు బయలుదేరిన హయబుసా నం. 60 అనే బుల్లెట్ ట్రైన్లో, ఒక బాంబును గుర్తుతెలియని ఆగంతకులు అమరుస్తారు. ఈ బాంబు ట్రైన్ వేగం గంటకు 100 కిలోమీటర్ల కంటే తగ్గితే పేలిపోయే విధంగా సెట్ చేసి ఉంటారు. బాంబర్ 100 బిలియన్ యెన్ (సుమారు 6o0 మిలియన్ డాలర్లు) లను డిమాండ్ చేస్తాడు. లేకపోతే బాంబును డిఫ్యూజ్ ఎలా చెయ్యాలో చెప్పనని బాంబర్ సంకేతాలు ఇస్తాడు. అధికారులకు ఈ విషయం తెలియడంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అవుతుంది.  ఆ తరువాత ట్రైన్ కండక్టర్ తకైచి, అసిస్టంట్ కండక్టర్ ఫుజీ, డ్రైవర్ మాట్సుమోటో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కంట్రోల్ సెంటర్‌లోని జనరల్ కమాండర్ కసాగి నేతృత్వంలోని అధికారులు బాంబర్‌ను కనిపెట్టడానికి ప్రయత్నిస్తూ, బాంబును నిర్వీర్యం చేయడానికి పోరాడుతారు.

Read Also :పోలీసే ఎగ్జామ్ కాపీ కొడితే… కడుపుబ్బా నవ్వించే మలయాళ కామెడీ థ్రిల్లర్

ఈ సమయంలో ట్రైన్‌లోని ప్రయాణీకులలో ఒక పార్లమెంటు సభ్యురాలు, ఒక యూట్యూబర్, స్కూల్ విద్యార్థిని ఈ ప్రమాదకర పరిస్థితిలో చిక్కుకుంటారు. ట్రైన్ వేగాన్ని కాపాడుకుంటూ, రాబోయే ట్రాఫిక్‌ను నివారిస్తూ, బాంబును కనిపెట్టడం వంటివి కనురెప్ప వాల్చనీయకుండా చేస్తుంది. ఎక్కడ ఏమిజరుగుతుందో అని అంతటా టెన్షన్ పడుతుంటారు.  చివరికి ఈ ట్రైన్ లో ఉన్న బాంబు ను కనిపెడతారా ? ఆ క్రిమినల్ ని పట్టుకుంటారా ? ప్రయాణికులు సేఫ్ గా వస్తారా ? ఈ విషయాలు తెలుసుకోవాలంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. జపాన్ రైల్వే కంపెనీ సహకారంతో నిజమైన బుల్లెట్ ట్రైన్‌లు, రైల్వే సౌకర్యాలను ఉపయోగించి షూటింగ్ జరిగింది. దీనివల్ల విజువల్స్ లో రియాలిటీ కనిపిస్తుంది. ఈ మూవీ మొదటి నుండి చివరి వరకు ప్రేక్షకులను కార్నర్ ఎడ్జ్ లో ఉంచుతుంది.

Related News

OTT Movie : భర్తను కంట్రోల్ చేయడానికి మాస్టర్ ప్లాన్… సైకో భార్యకు దిమాక్ కరాబ్ అయ్యే ట్విస్ట్

OTT Movie : ఈ సైకో చేతికి అమ్మాయి దొరికితే అరాచకమే… వదలకుండా అదే పని… గూస్ బంప్స్ తెప్పించే కథ

OTT Movie : దొంగతనం చేసే పిల్లి… థ్రిల్లింగ్ ట్విస్టులు… ఊహించని సర్ప్రైజ్ లతో థ్రిల్ ఇచ్చే మలయాళ మూవీ

OTT Movie : పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్… చదువుకోవాల్సిన ఏజ్ లో వేషాలేస్తే ఇదే గతి

OTT Movie : మిస్టీరియస్ ప్లేస్ లో అమ్మాయి ట్రాప్… ఒక్కో ట్విస్ట్ కు మతి పోవాల్సిందే

OTT Movie : హెయిర్ కట్ కోసం ఇదెక్కడి అరాచకం సామీ… మనసును కదిలించే కన్నడ మూవీ

Big Stories

×