E-Paper
Advertisement

Biopic web series OTT : ఓటీటీలో ఆకట్టుకుంటున్న ఫిజిక్స్ టీచర్ రియల్ స్టోరీ… ఐయండిబిలో 8.2 రేటింగ్

Biopic web series OTT : ఓటీటీలో ఆకట్టుకుంటున్న ఫిజిక్స్ టీచర్ రియల్ స్టోరీ… ఐయండిబిలో 8.2 రేటింగ్
Advertisement

Biopic web series OTT : ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్టార్టప్ లవర్స్ అందరూ చూడాల్సిన సిరీస్ ఓటీటీలోకి వచ్చింది. ఇది మరేమిటో కాదు, ఫిజిక్స్ వాలా ఫౌండర్ అలఖ్ పాండే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘హలో బచ్చో’. అలఖ్ పాండే ఇంజనీరింగ్ చదువు మధ్యలో ఆపేసి భౌతిక శాస్త్రం బోధించడం మొదలుపెట్టాక, అతను ఎంతో మందికి స్పూర్తిగా నిలిచాడు. ఇతని బయోపిక్ ఇప్పుడు ఓటీటీలో ఆకట్టుకుంటోంది. ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోంది ఈ సిరీస్. ఇక దీనికి IMDbలో 8.2 రేటింగ్ ఉండటం విశేషం.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘హలో బచ్చోన్’ (Hello Bachhon) బయోపిక్ వెబ్ సిరీస్ 2026 మార్చి 6న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇది ప్రముఖ ఎడ్-టెక్ సంస్థ ‘ఫిజిక్స్ వాలా’ వ్యవస్థాపకుడు అలఖ్ పాండే జీవితం ఆధారంగా రూపొందింది. అలఖ్ పాండే పాత్రలో వినీత్ కుమార్ సింగ్ అద్భుతంగా నటించారు. ఇతను ‘ఛావా’ సినిమాలో కవిరాజ్ కలాష్ పాత్రతో ప్రశంసలు పొందిన నటుడు. ఇక ఇతర ప్రధాన పాత్రల్లో విక్రమ్ కొచ్చర్, గిరిజా ఓక్ నటించారు. దీనిని ప్రముఖ కంటెంట్ క్రియేషన్ సంస్థ The Viral Fever (TVF) నిర్మించింది. అలఖ్ పాండే తన టీచింగ్ స్టైల్‌తో యూట్యూబ్‌లో గుర్తింపు పొందాడు. ఇప్పుడు 152 నగరాల్లో అతని సెంటర్లు ఉన్నాయి. ఈ సంస్థ విలువ ముప్పై వేల కోట్లకి పైనే ఉందని తెలుస్తోంది. ఇక మొదటి సీజన్‌లో మొత్తం 5 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతీ ఎపిసోడ్ అతను పాఠాలు చెప్తూ ఎలా సక్సెస్ అయ్యాడో చూపిస్తుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అలఖ్ పాండే అనే ఒక మామూలు ఫిజిక్స్ టీచర్, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, చదువు మీద ఉన్న పిచ్చితో కోచింగ్ సెంటర్లలో పాఠాలు చెప్పడం మొదలుపెడతాడు. కానీ అక్కడ పెద్ద పెద్ద ఇనిస్టిట్యూట్లు పిల్లల దగ్గర వేలల్లో ఫీజులు వసూలు చేయడం చూసి అతనికి నచ్చదు. డబ్బు లేని పేద పిల్లాడికి కూడా నాణ్యమైన చదువు అందాలనుకునే మొండి పట్టుదలతో, తనకున్న ఉద్యోగాన్ని వదిలేసి యూట్యూబ్‌లో వీడియోలు చేయడం స్టార్ట్ చేస్తాడు.

మొదట్లో కెమెరా ముందు సరిగ్గా మాట్లాడలేక, వ్యూస్ రాక చాలా ఇబ్బంది పడతాడు. సొంతంగా యాప్ తయారు చేయాలని ప్రయత్నించినప్పుడు సర్వర్లు డౌన్ అయిపోయి, వేల మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. అయినా సరే వెనకడుగు వేయకుండా, తనదైన స్టైల్లో హలో బచ్చోన్ అంటూ పిలుస్తూ పిల్లలకి అర్థమయ్యేలా పాఠాలు చెప్తూ అందరికీ ఫేవరెట్ టీచర్ అయిపోతాడు.

Advertisement

చివరిగా ఒక చిన్న గదిలో మొదలైన ఆయన ప్రయాణం, ఈరోజు వేల కోట్ల విలువైన ‘ఫిజిక్స్ వాలా’ కంపెనీగా ఎలా ఎదిగిందనేది ఈ సిరీస్ క్లైమాక్స్. కార్పొరేట్ కంపెనీలు తనను తొక్కేయాలని చూసినా, తన స్టూడెంట్స్ ఇచ్చిన సపోర్ట్‌తో వాటన్నింటినీ ఎదురించి నిలబడతాడు. చదువు అనేది కేవలం వ్యాపారం కాదు, అదొక సేవ అని నిరూపించిన ఒక సామాన్యుడి గెలుపే ఈ కథ.

Read Also : తల్లి కోసం సీరియల్ కిల్లర్ గా… 57 మందిని దారుణంగా… గుండె ధైర్యం ఉన్నోళ్లకే ఈ మూవీ

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×