OTT Movie : ఓటీటీలోకి వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. వీటిని చూసి ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతూనే ఉన్నారు. అయితే కొన్ని సినిమాలు థియేటర్ లలో అంతగా ఆడకపోయినా, ఓటీటీలో మాత్రం మంచి వ్యూస్ దక్కించుకుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా అటువంటిదే. ఇందులో రెడ్ కలర్ డ్రస్ వేసుకున్న అమ్మాయిలు మిస్ అవుతుంటారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రేక్షకుల మతి పోగొడుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీల్ వెళితే
హైదరాబాద్ నగరంలో అమ్మాయిలు మిస్సింగ్ ఘటనలు పోలీసు శాఖను కలవరపరుస్తాయి. ఈ కేసును పరిష్కరించేందుకు ఐపీఎస్ అధికారి ఆద్య (నందితా శ్వేతా) నియమితురాలవుతుంది. ఆమెతో పాటు ఆమె మాజీ ప్రేమికుడు అయిన ఏసీపీ అభయ్ (అశ్విన్ బాబు) కూడా ఈ దర్యాప్తులో భాగస్వామి అవుతాడు. వీరిద్దరూ కలిసి కేసును పరిశీలిస్తూ, అదృశ్యమైన అమ్మాయిలందరూ ఎరుపు రంగు దుస్తులు ధరించినవారని గుర్తిస్తారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ, కేరళలోని అడవుల్లో గతంలో ఇటువంటి సంఘటనలు జరిగాయని తెలుసుకుంటారు. అక్కడ జరుగుతున్న వాటికీ, ఇప్పుడు జరుగుతున్న వాటికీ సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసు వెనుక హిడింబా అనే ఆదివాసీ తెగ ఉన్నట్లు బయటపడుతుంది. ఈ తెగ బ్రిటిష్ కాలంనుంచి మనిషి మాంసాన్ని తినేవాళ్ళని తెలుస్తుంది.
కథ మరింత లోతుగా వెళుతున్నప్పుడు, ఈ తెగతో సంబంధం ఉన్న బోయా అనే క్రూరమైన క్రిమినల్ గురించి తెలుస్తుంది. అయితే క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్‌తో అభయ్ గురించి ఒక షాకింగ్ నిజం బయట పడుతుంది. చివరికి అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంది ఎవరు ? అభయ్ గురించి తెలిసిన షాకింగ్ నిజం ఏంటి ? బోయా క్రిమినల్ కి వీటితో సంబంధం ఉందా ? ఎరుపు రంగు దుస్తులు ధరించిన అమ్మాయిలనే ఎందుకు టార్గెట్ అవుతున్నారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : కూతురి కళ్ల ముందే తండ్రి దారుణం… ప్రేమించిన అమ్మాయి కోసం ఊహించని పని చేసే హీరో
జియో హాట్ స్టార్ (Jio hotstar) లో
ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘హిడింబా’ (Hidambha). 2023 లో వచ్చిన ఈ మూవీకి అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీవిఘ్నేష్ సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో అశ్విన్ బాబు, నందితా శ్వేతా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ స్టోరీ హైదరాబాద్‌లో జరిగే అమ్మాయిల మిస్సింగ్ ఘటనల చుట్టూ తిరుగుతుంది. జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.