OTT Movie : విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఒక మూవీ రీసెంట్ గా థియేటర్లలో సందడి చేస్తోంది. యోగి బాబు కూడా ఇందులో లీడ్ రోల్ పోషించారు. వీళ్లిద్దరి కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తొందర్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
బోల్ట్ కాశీ (విజయ్ సేతుపతి) అనే వ్యక్తి తన గత జీవితాన్ని వదిలి, కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మలేషియాకు వస్తాడు. అక్కడ అతను జ్ఞానం (యోగి బాబు) అనే ఒక వ్యక్తిని కలుస్తాడు. అతను అక్కడే ఉన్న ఒక హోటల్ యజమాని కల్పన (దివ్యా పిళ్ళై)ని ఆకట్టుకోవడానికి వ్యాపారవేత్తగా నటిస్తుంటాడు. ఇతని పాత్ర కామెడీతో ఆకట్టుకుంటుంది. కాశీ ఒక హోటల్‌లో పరోటా మాస్టర్‌గా ఉద్యోగం సంపాదిస్తాడు. ఈ క్రమంలో అతను రుక్మిణి (రుక్మిణి వసంత్) అనే యువతిని కలుస్తాడు. ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. అయితే ఆమె ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటుంది. రుక్మిణి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు సహాయం చేయాలనే ఉద్దేశంతో, కాశీ త్వరగా డబ్బు సంపాదించడానికి పేకాట ఆడాలని నిర్ణయించుకుంటాడు. అయితే అతని ప్రత్యర్థి ధర్మ ఈ ఆటలో కాశీని మోసం చేస్తాడు. దీంతో కాశీ అతనికి పెద్ద మొత్తంలో అప్పు పడతాడు.
ఈ అప్పును తిరిగి చెల్లించడానికి కాశీ ఒక బ్యాంక్ దోపిడీకి ప్లాన్ చేస్తాడు. కానీ ఈ దోపిడీ ప్లాన్ ను అమలు చేయలేకపోతాడు. అతడు మరింత ప్రమాదకరమైన క్రైమ్ ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది.. మరొవైపు రుక్మిణి సవతి తండ్రి రాజదురై ఒక నైతిక విలువలు పాటించని ఒక పోలీసు అధికారిగా ఉంటాడు. అతడు రుక్మిణి కళ్ళముందే నీచమైన పనులు చేస్తుంటాడు. రాజదురై, ధర్మ వంటి కరడుగట్టిన మనుషులనుండి బయటపడటానికి, కాశీ తన తెలివితేటలను ఉపయోగించి పోరాడుతాడు. చివరికి కాశీ తన అప్పులను తీరుస్తాడా ? అతను ఎటువంటి ఉచ్చులో ఇరుక్కుంటాడు ? రాజదురై, ధర్మలను ఎలా ఎదుర్కుంటాడు ? అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ క్రైమ్ కామెడీ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : అడ్వెంచర్ ని మించి పోయే ఆఖరి కోరిక … హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని సినిమా
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ తమిళ క్రైమ్ కామెడీ మూవీ పేరు ‘ఏస్’ (Ace). 2025 మే 23న థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాకి అరుముగ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్, యోగి బాబు, బి.ఎస్. అవినాష్, దివ్యా పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించారు. జస్టిన్ ప్రభాకరన్ దీనికి సంగీతం అందించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లోకి త్వరలో రానుంది.