E-Paper
Advertisement

అమ్మాయిని వెంటాడే టైర్… స్పైన్ చిల్లింగ్ థ్రిల్లర్

అమ్మాయిని వెంటాడే టైర్… స్పైన్ చిల్లింగ్ థ్రిల్లర్
Advertisement

Horror Comedy: హాలీవుడ్ సినిమాలు ఎంత విభిన్నంగా, విచిత్రంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అఫ్ కోర్స్ అందుకే చాలామంది ఈ ఇంగ్షీషు సినిమాలను చూస్తూ ఉంటారు. కానీ సినిమా ప్రపంచ చరిత్రలోనే విడ్డూరం అనిపించే సినిమాను ఎప్పుడైనా చూశారా ? చూడకపోతే ఇప్పుడు చూద్దాం పదండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ కల్ట్ సైన్స్ ఫిక్షన్ హారర్-కామెడీ చిత్రం ‘Rubber’ను చూస్తే మీరు కూడా ఇదే మాట అంటారు. మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అన్నది ఇప్పడూ తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ కాలిఫోర్నియా ఎడారిలో సాగుతుంది. అక్కడ ఉపయోగం లేదని పారేసిన ఒక పాత కారు టైర్ ఉంటుంది. దీనికి సినిమాలో ‘రాబర్ట్’ అని పేరు పెట్టారు. అది హఠాత్తుగా ఎటువంటి కారణం లేకుండా ప్రాణం పోసుకుని లేచి నిలబడటంతో సినిమా స్టార్ట్ అవుతుంది..ఆ టైర్ ఎడారిలో దొర్లుకుంటూ వెళ్తుండగా, దానికి ఒక వింత శక్తి ఉందనే విషయం తెలుస్తుంది. ఎదురుగా ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్, పక్షులు, కుందేళ్ల వైపు చూసి అది ఒక రకమైన ప్రకంపనలు సృష్టిస్తుంది. అంతే సెకండ్స్ లో అవి ముక్కలై పేలిపోతాయి.

Advertisement

ఒక మనిషి ఆ టైర్‌ను తొక్కేయడానికి ప్రయత్నించగా, తీవ్ర కోపానికి గురైన టైర్ తన శక్తులను ఉపయోగించి ఆ మనిషి తల పేల్చేసి చంపేస్తుంది. అలా మొదలైన టైర్ ప్రయాణం, దారిలో అడ్డమొచ్చిన ప్రతి ఒక్కరి తలలను పేల్చేస్తూ ఒక హంతకుడిలా మారుతుంది. ఎడారి గుండా వెళ్తున్న ఒక అందమైన అమ్మాయిని చూసి ఆ టైర్ అట్రాక్ట్ అవుతుంది. టైర్ కు అమ్మాయి నచ్చడం ఏంటో మరి. ఆమెను ఫాలో అవుతూ, ఒక లోకల్ మోటెల్ కు చేరుకుంటుంది. అక్కడితో ఊరుకోకుండా పక్క రూమ్‌లో ఉంటూ వింత పనులు చేస్తుంది.

ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ వస్తుంది. ఈ టైర్ చేసే పనులన్నింటినీ ఎడారిలో కొంతమంది ప్రేక్షకులు బైనాక్యులర్స్ పట్టుకుని ఒక సినిమా చూసినట్లు చూస్తూ ఉంటారు. ఒక పోలీస్ ఆఫీసర్ వీరందరికీ కథను వివరిస్తూ ఉంటాడు. కథ చివర్లో ఇచ్చే ట్విస్ట్ మామూలుగా ఉండదు. పోలీసులు చివరికి ఆ టైర్ ను ఏం చేశారు ? టైర్లను గుంపుగా చేసుకుని హాలీవుడ్ నాశనం చేయడానికి ఆ టైర్ చేసిన ప్లాన్ ఏంటి ? అన్నది తెలియాలంటే సినిమాను వీక్షించాల్సిందే.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ ?

Advertisement

‘రబ్బర్’ అనే ఈ సినిమా కథలో ఏ విషయానికి కూడా నిర్దిష్టమైన కారణం అంటూ ఉండదు. వినోదం, విచిత్రమైన కాన్సెప్ట్‌లని ఇష్టపడే సినీ ప్రియుల కోసం ఈ ప్రయోగాత్మక సినిమాను రూపొందించారు. ఈ చిత్రం చూస్తుంటే సినిమా ఎందుకు తీస్తారు ? ప్రేక్షకులు ఎందుకు చూస్తారు ? అనే ప్రశ్నలు మనసులో మెదులుతాయి. జోనాథన్ డుపియక్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్రెంచ్ ఇండిపెండెంట్ మూవీ ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యంత వింతైన ఐడియాలతో తెరకెక్కింది. ప్రస్తుతం Amazon Prime Videoలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో మాత్రం లేదు.

Read Also : ప్రేమించిన వాడు పోయాడని కొడుకుతో… ఒంటరిగా చూడాల్సిన మూవీ

Related News

ఓటీటీలోకి వచ్చేస్తున్న కొరియన్ కనకరాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

మోగ్లీని రక్షించడానికి వచ్చిన విచిత్ర మృగం… కట్ చేస్తే 20 ఏళ్ల సీక్రెట్ బట్టబయలు… తెలుగులోనే స్ట్రీమింగ్

మొగుడు పెళ్లాల మధ్యలోకి వచ్చి ముంచేశాడు… క్లైమాక్స్‌లో ఊహించని డ్రామా… తెలుగులో ఇంగ్లీష్ సిరీస్

మహిళల ఇళ్లకు వచ్చే విచిత్రమైన బాక్సులు… కట్ చేస్తే వరుస హత్యలు… ప్రతి కేసు వెనుక ఒకే మైండ్

మ్యాచ్ ఆడుతుంటే స్టేడియంలో పదే పదే వినిపించే సీక్రెట్ విజిల్… శబ్దంతో కోచ్ కొంపముంచిన లేడీ

రాత్రికి రాత్రే రాక్ స్టార్ శవంగా… తీరా శవం దగ్గరకు వెళ్తే ఊహించని షాక్… డార్క్ హారర్ థ్రిల్లర్

కూతురి సీక్రెట్ డైరీతో స్టేజ్‌పై జోకులు… నిజం తెలిసి నిలదీసిన కూతురికి షాకింగ్ ట్విస్ట్… తెలుగులోనే ఈ సిరీస్

Big Stories

Advertisement
×