E-Paper
Advertisement

Horror Movie OTT : ఈ ట్రైన్ ఎక్కితే పోతారు భయ్యో… రాత్రి పూట ఒంటరిగా చూడకూడని మూవీ

Horror Movie OTT : ఈ ట్రైన్ ఎక్కితే పోతారు భయ్యో… రాత్రి పూట ఒంటరిగా చూడకూడని మూవీ
Advertisement

Horror Movie OTT : ఇండోనేషియా నుంచి ఎక్కువగా హారర్ థ్రిల్లర్ సినిమాలు వస్తుంటాయి. ఈ సినిమాలలో భయపెట్టే సీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా ఊహించని ట్విస్టులతో ఆడియన్స్ ని బాగానే భయపెట్టింది. ఈ మూవీ ఒక ట్రైన్ జర్నీ చుట్టూ తిరుగుతుంది. ఇక ఆ ట్రైన్ లో వచ్చే సీన్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తాయి. ఎందుకంటే అక్కడ దెయ్యాలు హల్చల్ చేస్తాయి కాబట్టి. ఈ సినిమాని ఒంటరిగా చూస్తే ఇక అంతే సంగతులు. ఈ స్టోరీ ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ 

2024లో విడుదలైన ఈ ఇండోనేషియా హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది ట్రైన్ ఆఫ్ డెత్’ (The Train of Death). ఇండోనేషియా భాషలో దీని అసలు పేరు ‘కెరెటా బెర్దారా’ (Kereta Berdarah). దీనికి రిజాల్ మంటోవాని దర్శకత్వం వహించారు. ఇందులో హనా మలాసన్, జారా లియోలా, పుత్రి ఆయుద్య లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా ఇండోనేషియాలో 2024 ఫిబ్రవరి 1 న విడుదలైంది. ప్రస్తుతం Netflix లో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : 25 ఏళ్లుగా క్రైమ్ అంటే ఏంటో తెలియని గ్రామం… బైక్‌ మిససవ్వడంతో గడబిడ… కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైనర్

స్టోరీ ఏమిటంటే

పూర్ణిమ అనే యువతి ప్రాణాంతకమైన క్యాన్సర్ నుండి కొలుకుంటూ ఉంటుంది. ఈ ఆనందాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి తన చెల్లెలు కెంబంగ్ తో కలిసి సంకారా అనే కొత్త రిసార్ట్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంది. ఆ రిసార్ట్‌కు చేరుకోవడానికి వీళ్ళు సంకారా ఎక్స్‌ప్రెస్ అనే ఒక విలాసవంతమైన ట్రైన్ ఎక్కుతారు. ఈ రైలు మార్గం దట్టమైన అడవుల గుండా వెళ్తుంది. మధ్యలో ఐదు చీకటి సొరంగాలు కూడా వస్తాయి. ఇక ప్రయాణం మొదలైన కొంతసేపటికే వింత సంఘటనలు మొదలవుతాయి. రైలు ఒక్కో సొరంగం దాటుతున్న ప్రతిసారీ, చివరిలో ఉన్న ఒక బోగీ పూర్తిగా మాయమైపోతుంటుంది. ఆ బోగీలో ఉన్న ప్రయాణికులు ఏమయ్యారో ఎవరికీ తెలియదు.

Advertisement

ఇక సొరంగంలోకి ప్రవేశించినప్పుడు చీకట్లో భయంకరమైన ఆకారాలు, దయ్యాలు ప్రయాణికులపై దాడి చేయడం మొదలుపెడతాయి. ఐదు సొరంగాలు దాటేలోపు రైలులోని వారందరూ చనిపోతారని తెలుసుకున్న పూర్ణిమ, తన చెల్లెలిని కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడుతుంది. చివరికి పూర్ణిమ తన చెల్లితో పాటు ఈ ప్రమాదం నుంచి బయట పడుతుందా ? రైలు బోగీలు ఎలా మాయమవుతున్నాయి ? అనే విషయాలను ఈ ఇండోనేషియా హారర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×