BigTV English

OTT Movie : భర్త మెడలో తాళి కట్టే భార్య… ప్రియురాలి కోసం కాల్ బాయ్ అవతారం ఎత్తే ప్రియుడు… ఈ లవ్ స్టోరీస్ చాలా హాట్ గురూ

OTT Movie : భర్త మెడలో తాళి కట్టే భార్య… ప్రియురాలి కోసం కాల్ బాయ్ అవతారం ఎత్తే ప్రియుడు… ఈ లవ్ స్టోరీస్ చాలా హాట్ గురూ

OTT Movie : ఓటీటీ లోకి రకరకాల కథలతో సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. వీటిలో రియాల్టీ కి దగ్గరగా ఉండే సినిమాలు కూడా ఉన్నాయి. వీటిని చూస్తున్నంత సేపు మన లైఫ్ లో జరిగే సన్నివేశాలు కూడా గుర్తుకు వస్తాయి. ఈ మూవీ నాలుగు స్టోరీలతో తెరకెక్కింది. ఈ నాలుగు స్టోరీలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రిమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ఆహా(aha) లో

ఈ తమిళ్ మూవీ పేరు ‘హాట్ స్పాట్’ (Hotspot). 29 మార్చి. 2024 లో రిలీజ్ అయిన ఈ మూవీకి విఘ్నేష్ కార్తీక్ దర్శకత్వం వహించారు. కలైయరసన్, సోఫియా, శాండీ, అమ్ము అభిరామి, జనని, గౌరీ జి. కిషన్, సుభాష్, ఆదిత్య భాస్కర్ ఇందులో నటించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా(aha) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

సినిమా దర్శకుడికి స్టోరీ చెప్పడానికి ఒక రచయిత వెళ్తాడు. ఆ రచయిత ఈ దర్శకుడు కూతురుని లవ్ చేస్తుంటాడు. స్టోరీ చెప్పి అతన్ని ఇంప్రెస్ చేయాలనుకుంటాడు రచయిత. ఇతడు 4 స్టోరీలను ఓకే సినిమాగా స్క్రిప్ట్ రెడీ చేస్తాడు. దర్శకుడికి చెప్పడం మొదలుపెడతాడు.

మొదటి స్టోరీలో : విజయ్, ధన్య ప్రేమించుకుంటూ ఉంటారు. ధన్య తన పేరెంట్స్ తో విజయ్ ఇంటికి పెళ్లిచూపులకు వస్తుంది. అలాగే విజయ్ కూడా వాళ్లకు కాఫీ టీలు అందిస్తాడు. విజయ్ ని ఉద్యోగం చేయకూడదని, ఇంట్లోనే పని చేయాలని చెప్తారు. అలా ధన్య, విజయ్ మెడలో తాళి కడుతుంది. ఇలా రివర్స్లో వీళ్ళ పెళ్లి జరుగుతుంది. అప్పటినుంచి విజయ్ కి అత్తమామలతో కష్టాలు మొదలవుతాయి. ఒకరోజు అత్తమామలపై తిరగబడతాడు విజయ్. అది చూసి ధన్య అతనిపై చేయి చేసుకుంటుంది. ఇలా జరుగుతూ ఉండగా వెంటనే విజయ్ మెలకువలోకి వస్తాడు. ఇదంతా అతను కలకంటాడు. ఒక అమ్మాయి పడే ఇబ్బందిని కలలో కల్లారా చూస్తాడు. ఆ తర్వాత ధన్య తో పెళ్లి తర్వాత నీ జీవితం ఎలా ఆనందంగా ఉంటుందో అలా గడపమని చెప్తాడు. మొదటి స్టోరీ ఇలా ముగుస్తుంది.

రెండవ స్టోరీలో : దీప్తి, సిద్ధార్థ ప్రేమించుకునీ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. ఈ విషయం ఇంట్లో చెప్పడానికి సిద్ధార్థని తీసుకెళ్తుంది దీప్తి. సిద్ధార్థ తల్లిదండ్రులు దీప్తి వివరాలు అడిగి తెలుసుకుంటారు. ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. దీప్తి, సిద్ధార్థ కి చెల్లెలి వరుస అవుతుంది. ఈ విషయం తెలియక వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఇక ఒకరిని వదిలి ఒకరు ఉండలేక ఆత్మహత్య కూడా చేసుకుంటారు. ఈ స్టోరీ ఇలా ముగుస్తుంది.

మూడో స్టోరీలోకి వెళ్తే : ఇందులో కూడా ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అనిత, వెట్రి ప్రేమించుకుంటారు. అయితే అనిత బాగా ప్రొఫెషనల్ జాబ్ చేస్తుంది. వెట్రికి కూడా ఒక జాబ్ వస్తుంది. అతడు నీలి చిత్రాలకు అలవాటు పడటంతో, విషయం తెలిసి యాజమాన్యం అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తుంది. అప్పటినుంచి మరో దారి లేక కాల్ బాయ్ అవతారం ఎత్తుతాడు వెట్రీ. ఈ విషయం తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ కి కూడా తెలిసిపోతుంది. అయితే అనిత నేను కూడా నీ ఫ్రెండ్ తో గడపాలనుకుంటున్నాను అని చెప్తుంది. అలా జరగకపోతే నీ గురించి అందరికీ చెప్పేస్తానని బెదిరిస్తుంది. చివరికి లేక తన ఫ్రెండ్ ని తీసుకొస్తాడు. వాళ్ళిద్దరూ రొమాన్స్ చేయడం మొదలు పెడతారు. నా ముందర ఇలా చేయొద్దని అడ్డుపడతాడు వెట్రి. అతనికి బుద్ధి రావాలని ఆమె అలా చేస్తుంది. ఆ తర్వాత వెట్రి తన తప్పు తెలుసుకుని మారిపోతాడు. మూడవ కథ కూడా ఇలా ముగుస్తుంది.

నాలుగవ కథలోకి వెళితే : అప్పుడప్పుడే టీనేజ్ కి వస్తున్న రక్షిత కి యాక్టింగ్ స్కిల్స్ బాగా ఉండటంతో తొందర్లోనే ఫేమస్ అవుతుంది. స్టేజ్ షోలు చేసి సినిమాలో అవకాశాలు కూడా దక్కించుకుంటుంది. అయితే ఆ పిల్ల చేత బూతు మాటలు కూడా మాట్లాడిస్తుంటారు. ఒకసారి ఆమె పర్ఫామెన్స్ బాగాలేదని ఒక షోలో చెప్పడంతో బాధపడుతుంది. ఆ బూతు షోలు చేసి, వరుసకి తన కజిన్ తో ఇంటిమేట్ అవుతుంది. అది వీడియో గా రావడంతో, అవమానం భరించలేక చనిపోతుంది. ఈ స్టోరీ కూడా ఇలా ముగుస్తుంది. చివరికి ఈ స్టోరీలు చెప్పిన దర్శకుడు తన కూతుర్ని రచయితకి ఇచ్చి పెళ్లి చేస్తాడా ? ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే, ‘హాట్ స్పాట్’ (hotspot) అనే ఈ మూవీని చూడండి.

Tags

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×