OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ వైపు చూస్తున్నారు మూవీ లవర్స్. కొత్త కొత్త స్టోరీలతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి ఈ ఫ్లాట్ ఫామ్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక అమ్మాయి మరో అమ్మాయిని ప్రేమిస్తుంది. అమ్మాయి చుట్టూ అబ్బాయి తిరగడం సహజమే. అలా తిరగకపోతేనే ఈ రోజుల్లో తేడాగా చూస్తూ ఉంటారు. అయితే కూతురు మరో అమ్మాయిని ప్రేమించే ఈ రిలేషన్ ను తల్లిదండ్రులు ఒప్పుకోలేక పోతారు. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు ఆలోచనలో పడేస్తాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
టెంట్కొట్టా (Tentkotta) లో
ఈ తమిళ్ రొమాంటిక్ మూవీ పేరు ‘కాదల్ ఎన్బదు పొదు ఉడమై’ (Kaadhal Enbadhu podhu Udamai). 2025 లో విడుదలైన ఈ తమిళ రొమాంటిక్ మూవీకి జయప్రకాష్ రాధాకృష్ణన్ రచించి, దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వినీత్, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించగా, లిజోమోల్ జోస్, అనూష ప్రభు, కాలేష్, దీప సహాయక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ టెంట్కొట్టా (Tentkotta) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
సామ్ తను ప్రేమించిన వ్యక్తిని తల్లిదండ్రులకు పరిచయం చేయాలనుకుంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నా, ప్రేమించింది ఒక అమ్మాయిని కాబట్టి ఇంట్లో చెప్పడానికి భయపడుతూ ఉంటుంది. ఈ విషయం తల్లి గమనించి నువ్వు ప్రేమించిన వ్యక్తిని పరిచయం చేయమని అడుగుతుంది. సామ్ కూడా ధైర్యం చేసి నందినీని ఇంటికి లంచ్ కి పిలుస్తుంది. ఆమెతోపాటు రవీంద్ర అనే ఫ్రెండ్ కూడా వస్తాడు. ఇంటికి వచ్చిన రవీంద్రని చూసి శ్యామ్ తల్లి తన అల్లుడు అందంగా ఉన్నాడని సంతోషపడుతుంది. ఈ విషయం తన భర్తకి ఫోన్ చేసి చెప్తుంది. అయితే ఇక్కడే అసలు విషయం తల్లికి చెప్తుంది సామ్. నేను ప్రేమిస్తుంది రవీంద్రను కాదని, నందినీని అని తల్లికి చెప్తుంది. ఈ షాక్ తో ఆమె తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఈమె భర్త కూడా వేరొక మహిళతో రిలేషన్ లో ఉంటాడు. భర్తను ఇంటికి పిలిపించి అసలు విషయం చెప్తుంది. తల్లిదండ్రులు ఇద్దరూ సామ్ కి చాలా వరకు నచ్చచెప్తారు.
అయితే నాకు అబ్బాయిల మీద ఫీలింగ్స్ రావట్లేదని చెప్తుంది సామ్. వాళ్ళ ఎదురుగానే నందినికి ముద్దు కూడా పెడుతుంది. అది చూసి సామ్ చంప పగలగొడుతుంది తల్లి. దీనికి ఒప్పుకుంటే సమాజంలో తల ఎత్తుకుని తిరగలేమని బాధపడతారు తల్లి దండ్రులు. నందిని పై బాగా కోపం పెంచుకుంటారు. ఆమె వల్లే తమ కూతురు ఇలా తయ్యారైందని అనుమానిస్తారు. చివరికి సామ్, నందినిల ప్రేమను పెద్దలు ఒప్పుకుంటారా? సమాజానికి భయపడి అడ్డుకుంటారా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ టెంట్కొట్టా (Tentkotta) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘కాదల్ ఎన్బదు పొదు ఉడమై’ (Kaadhal Enbadhu podhu Udamai) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.