BigTV English

HIT 3 Movie : ‘హిట్ 3’ మూవీకి భారీ ధరకు ఓటీటీ డీల్ ఫిక్స్.. ఆ ఓటీటీలోనే..?

HIT 3 Movie : ‘హిట్ 3’ మూవీకి భారీ ధరకు ఓటీటీ డీల్ ఫిక్స్.. ఆ ఓటీటీలోనే..?

Hit 3 Movie : టాలీవుడ్ యంగ్ హీరో న్యాచురల్ స్టార్ నాని సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈరోజు మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. హీరోగా చెయ్యడం మాత్రమే కాదు సినిమాలను నిర్మిస్తు సక్సెస్ అవుతున్నాడు. ఇటీవల కోర్ట్ అనే సినిమాను నిర్మించాడు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను అందుకోవడంతో పాటుగా భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికి అదే టాక్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ తర్వాత అందరి దృష్టి హిట్ 3 పై పడింది.భారీ యాక్షన్ మూవీ.. డిఫరెంట్ రోల్ లో నాని కనిపిస్తున్నాడు.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.. ఏ ఓటీటీ సంస్థ ఈ మూవీ హక్కులను సొంతం చేసుకుందో ఒకసారి చూసేద్దాం..


గతంలో వచ్చి భారీ విజయాన్ని అందుకున్న హిట్ మూవీ కి సీక్వెల్ గా ఈ మూవీ వస్తుంది. ఈ మూవీలో అర్జున్ సర్కార్గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నాని కనిపించనున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ సమ్మర్ స్పెషల్గా మే 1న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో మూవీ ఓటిటి హక్కుల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.54 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.. మరోవైపు నాని నిర్మించిన కోర్ట్ మూవీకి డిజిటల్ రైట్స్ కూడా ఈ ఓటీటీ సంస్థనే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే..

అదే విధంగా నాని, దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతోన్న మూవీ ‘ది ప్యారడైజ్’. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది. ఇంకా షూటింగ్ మొదలు కాకపోయినా ఈ సినిమా ఓటీటీ డీల్ మాత్రం ఇప్పటికే జరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. హిట్ ఫ్రాంచైజీలో భాగంగా ఇంతకు ముందు విడుదలైన హిట్, హిట్ 2 బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. శైలేష్ కొలను దర్శకత్వం లో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్స్కు సీక్వెల్ గానే నాని హిట్ 3 రాబోతుంది. సినిమాలో నాని సరసన కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. గతేడాది ‘సరిపోదా శనివారం’తో హిట్ను తన ఖాతాలో వేసుకున్న నాని.. ‘హిట్ 3’తో మరో బ్లాక్ బస్టర్ను కొట్టాలని చూస్తున్నారు.. ఇటీవల నాని వరుసగా బ్లాక్ బాస్టర్ మూవీలలో నటిస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు అవ్వడంతో ఈ మూవీ కూడా హిట్ పక్కా అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..  నాని స్టోరీలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండు మూవీలు కూడా బ్లాక్ బాస్టర్ పక్కా అనే టాక్ వినిపిస్తుంది..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×