BigTV English

Horror Movie OTT : గుండెల్లో వణుకు పుట్టించే హారర్ సీన్లు.. ఒంటరిగా చూస్తే అంతేసంగతి..

Horror Movie OTT : గుండెల్లో వణుకు పుట్టించే హారర్ సీన్లు.. ఒంటరిగా చూస్తే అంతేసంగతి..

Horror Movie OTT : థియేటర్లలో కంటే ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలకు డిమాండ్ ఎక్కువే.. అందుకే రిలీజ్ అయ్యిన కొన్ని నెలల తర్వాత కూడా ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల ఎన్నో సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో  వరుసగా రిలీజ్ అవుతున్న సినిమాలు అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి. హారర్ సినిమాల్లో అదిరిపోయే ట్విస్ట్ లు ఉండటంతో ప్రేక్షకులకు ఎక్కువగా వాటిని చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మరో మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రాబోతుంది. ఆ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో చూడొచ్చునో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..


మూవీ & ఓటీటీ.. 

మలయాళం లో రిలీజ్ అయిన హారర్ మూవీ హంట్.. థియేటర్లలో రిలీజైన ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. మనోరమా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.. అతి త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. మార్చి 28న ఈ మూవీ మనోరమా మ్యాక్స్‌లోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.. గత ఏడాది ఆగస్ట్ 29న థియేటర్లలో రిలీజైన హంట్ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.. కథ కాస్తా రొటీన్ గా ఉండడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. సినిమా యావరేజ్ గా మారింది. ఈ మూవీ యావరేజ్ గా ఆడిన కూడా భావన నటన అందరిని ఆకట్టుకుంది..


Also Read: నాకు ఇష్టం లేకుండానే ఆ పని చేశాను.. తప్పు చేశానని ఎప్పుడు బాధపలేదు..

స్టోరీ విషయానికొస్తే.. 

హీరోయిన్ భావన ఇందులో ఒక పోరన్సిక్ డాక్టర్ గా కనిపిస్తుంది. మహిళ ఆత్మ హత్య కేసు పై విచారణ జరుపుతుంది. వృత్తిలో భాగంగా ఓ మహిళా హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తుంది. చాలా ఏళ్ల క్రితం చనిపోయిన డాక్టర్ సారా డెడ్‌బాడీ అదని కీర్తి కనిపెడుతుంది. అప్పటినుంచే కీర్తి జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. సారా ఆత్మ ఆమెను వెంటాడటం మొదలుపెడుతుంది. అప్పటి నుంచి కీర్తి జీవితలోకి అనుకోని సంఘటనలు ఎదురువుతున్నాయి. నిజానికి సారా ఆత్మ తనను వెంటాడుతుంది. తన మరణంపై కీర్తి సాయంతో సారా ఎలా రివేంజ్ తీర్చుకున్నది అనే అంశాలతో హంట్ మూవీ రూపొందింది.. ఆత్మ రివేంజ్ కామన్ అవ్వడంతో పెద్దగా మెప్పించలేక పోయింది.. హీరోయిన్ భావన గత కొన్నేళ్లుగా ఇలాంటి హారర్ థ్రిల్లర్ మూవీల పైనే ఫోకస్ పెడుతుంది.. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ పెద్దగా మెప్పించ లేకపోయినా ఆమె నటనకు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి దాంతో ఇలాంటి సినిమాలు తో ఎలాగైనా సక్సెస్ అవుతానని గ్యారెంటీగా ఫిక్స్ అయింది. ఈ మూవీ ఓటిటిలో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.. హారర్ సినిమాలకు ఓటీటీలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ మధ్య మలయాళ సినిమాలు ఎక్కువగా ఓటీటీలో సందడి చేస్తున్నాయి..  ప్రతి మూవీ భారీ సక్సెస్ ను అందుకుంటుంది.

Tags

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×