OTT Movie : సైకో థ్రిల్లర్ సినిమాలలో, ఎక్కువగా భయంతో కూడిన సన్నివేశాలు ఉంటాయి. సైకోలు పొందే రాక్షస ఆనందానికి, అమాయకులు బలి అవుతూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో చెవిటి, మూగ ఉన్న ఒక అమ్మాయిని సైకో హింసించి చంపాలనుకుంటాడు. హీరోయిన్ ఆ సైకో నుంచి తప్పించుకునే సన్నివేశాలతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సైకో థ్రిల్లర్ మూవీ పేరు ‘హుష్‘ (Hush). ఈ అమెరికన్ సైకో థ్రిల్లర్ మూవీకి మైక్ ఫ్లానాగన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కేట్ సీగెల్, జాన్ గల్లఘర్ జూనియర్, మైఖేల్ ట్రుకో, సమంతా స్లోయన్ నటించారు. ఈ మూవీ విమర్శకుల నుండి ప్రశంసలు కూడా అందుకుంది. ఈ మూవీని హిందీలో ఖామోషి పేరుతో, తమిల్ లో కొలైయుతిర్ పేరుతో, చక్రి తోలేటి దర్శకత్వం వహించారు. ఈ సైకో థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
హీరోయిన్ ఒంటరిగా ఉంటూ స్టోరీలు రాస్తూ ఉంటుంది. అయితే ఈమెకు మూగ, చెవుడు ఉండడంతో, లిప్స్ కదలికలతో ఎదుటి వాళ్లు ఏం చెబుతున్నారో అర్థం చేసుకుంటుంది. ఒకరోజు హీరోయిన్ ఫ్రెండ్, ఆమె రాసిన నవలలను అభినందించి వెళ్తుంది. అలా ఆరోజు ఇంట్లో స్టోరీలు రాసుకుంటూ ఉండగా, తన ఫ్రెండ్ తలుపులు బాదుతూ డోర్ తీయమని అరుస్తూ ఉంటుంది. హీరోయిన్ కి చెవుడు ఉండటంతో, ఆమె మాటలు వినలేక పోతుంది. అక్కడికి వచ్చిన ఒక సైకో, ఆమెను దారుణంగా చంపేస్తాడు. ఎంత అరిచినా హీరోయిన్ తలుపు తీయకపోవడంతో, ఆమెకు చెడు ఉందని గ్రహిస్తాడు సైకో. ఆమెను కూడా చంపాలని ట్రై చేస్తాడు. ఈ సైకోకి ఎవరినైనా చంపుతున్నప్పుడు, వాళ్లలో కనిపించే భయం చూసి ఆనంద పడుతూ ఉంటాడు. ఆ ఫీలింగ్ కోసమే చాలామందిని చంపుతూ ఉంటాడు. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తనని ఫాలో అవుతున్నాడని గుర్తించి, హీరోయిన్ తలుపులు గట్టిగా వేసుకుంటుంది.
అప్పుడు ఆ సైకో ఇదివరకే చంపేసిన ఆ అమ్మాయిని, బయటినుంచి హీరోయిన్ కి చూపిస్తాడు. హీరోయిన్ బాగా భయపడి ఏడుస్తుంది. హీరోయిన్ ఫోన్ తో సహా, నెట్ కనెక్షన్ కూడా లేకుండా చేస్తాడు ఆ సైకో. హీరోయిన్ ఇంటికి సైకో చేతిలో చనిపోయిన ఆమె భర్త వస్తాడు. అక్కడ ఉన్న సైకో పోలీసునని పరిచయం చేసుకుంటాడు. చివరికి ఆ సైకో చేతిలో అతను కూడా చనిపోతాడు. ఇక్కడి నుంచి ఆ సైకో నుండి తప్పించుకోవడం అసాధ్యమని అనుకుంటుంది హీరోయిన్. ఆ సైకోని చంపాలని నిర్ణయించుకుంటుంది. చివరికి హీరోయిన్ ఆ సైకోని చంపుతుందా? హీరోయిన్ చేతిలో ఆ సైకో చనిపోతాడా? ఎవరైనా హీరోయిన్ కి సాయం చేస్తారా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘హుష్‘ (Hush) మూవీని మిస్ కాకుండా చూడండి.