Yash: ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకోవాలంటే ఎన్నో సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. వారికి నచ్చే విధంగా ఒక్క సినిమా చేసినా చాలు.. ఇది కరెక్టే అని చెప్పడానికి ఇప్పటికీ ఎన్నో చిత్రాలు, ఎంతోమంది నటీనటులు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒకడు కన్నడ స్టార్ యశ్. ఒక సీరియల్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన యశ్.. ఎన్నో కష్టాల తర్వాత హీరోగా మారాడు. అలా హీరోగా తను ఎన్నో సినిమాల్లో నటించినా కూడా ‘కేజీఎఫ్’ అనేది పూర్తిగా తన కెరీర్‌నే మార్చేసింది. తనను పాన్ ఇండియా హీరోను చేసింది. ఇప్పుడు దానివల్లే శాండిల్‌వుడ్‌లో ఏ స్టార్ హీరోకు దక్కని ఘనత యశ్‌కు దక్కింది.
క్రేజ్ తగ్గలేదు
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ (Yash).. ‘కేజీఎఫ్ చాప్టర్ 1, ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ల్లో నటించాడు. ఆ తర్వాత తను ఇంకే ఇతర సినిమాల్లో కనిపించలేదు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తను ‘టాక్సిక్’ అనే మూవీ చేస్తున్నట్టుగా యశ్ ప్రకటించి చాలాకాలమే అయ్యింది. కానీ ఇప్పటివరకు అసలు ఈ సినిమా షూటింగ్ ఎక్కడ వరకు వచ్చింది, దీని కథ ఏంటి, ఇది ఏ జోనర్‌లో తెరకెక్కుతోంది.. లాంటి విషయాలు ఏవీ మేకర్స్ అస్సలు క్లారిటీ ఇవ్వలేదు. ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజ్ తర్వాత యశ్ మరొక సినిమాలో నటించకపోయినా.. తన క్రేజ్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. దానికి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెరిగిన ఫాలోవర్సే ఉదాహరణ.
Also Read: బన్నీ- త్రివిక్రమ్ అనౌన్స్ మెంట్.. ఆ వీడియోతో వస్తుందంట..?
స్టార్లకు ధీటుగా
‘కేజీఎఫ్’ టైమ్ నుండి యశ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి షేర్ చేసుకోవడానికి పెద్దగా విషయాలు ఏమీ లేకపోవడంతో ఎక్కువగా పర్సనల్ లైఫ్ గురించే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ వస్తున్నాడు రాకీ భాయ్. తన భార్యతో, పిల్లలతో ఉండే హ్యాపీ మూమెంట్స్‌ను ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌తో పంచుకుంటాడు. అలా ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో యశ్ ఫాలోవర్స్ 14 మిలియన్ మార్క్‌ను టచ్ చేశారు. ఇప్పటివరకు ఏ కన్నడ హీరోకు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ రేంజ్‌లో ఫాలోయింగ్ లేదు. దీంతో ఎంతోమంది స్టార్ హీరోలను దాటేసి యశ్ ఈ ఘనత దక్కించుకున్నాడంటూ తన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
ఫ్యాన్స్ డిసప్పాయింట్
మరోవైపు యశ్ ఫ్యాన్స్‌లో అసహనం పెరిగిపోతోంది. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ విడుదలయ్యి దాదాపు మూడేళ్లు అవుతోంది. అయినా ఇప్పటికీ తన తరువాతి మూవీ నుండి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో చాలామంది ‘టాక్సిక్’ అప్డేట్ కావాలంటూ చాలాసార్లు సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేశారు. అయినా కూడా మేకర్స్ దగ్గర నుండి ఎలాంటి స్పందన లేదు. తాజాగా యశ్ పుట్టినరోజు సందర్భంగా మొదటిసారి ఈ మూవీ నుండి ఒక స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. కానీ ‘టాక్సిక్’ నుండి ప్రేక్షకులు ఏదైతే ఊహించారో.. ఈ గ్లింప్స్ మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. అయినా మూవీ హిట్ అవుతుందని ఇంకా కొందరు ఫ్యాన్స్ నమ్ముతున్నారు.