E-Paper
Advertisement

జేబులో చిల్లిగవ్వలేదు… కానీ ఆ ఒక్కటీ కావాల్సిందే… నేటితరం యూత్ కు కనెక్టయ్యే కామెడీ కథ

జేబులో చిల్లిగవ్వలేదు… కానీ ఆ ఒక్కటీ కావాల్సిందే… నేటితరం యూత్ కు కనెక్టయ్యే కామెడీ కథ
Advertisement

Youth Comedy Web Series on OTT: డిగ్రీ చేతిలో ఉన్నా ఉద్యోగం మాత్రం లేదు. సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టేసి జీవితాన్ని మార్చుకోవాలనే ఆశతో హైదరాబాద్‌కు వచ్చే యువతకు ఎదురయ్యే అసలు కష్టాలు ఏంటి? ఇంటర్వ్యూలకు తిరిగి తిరిగి చివరికి జేబులో డబ్బులు కూడా లేకుండా పోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పేలా వచ్చిన యూత్ ఫుల్ కామెడీ వెబ్ సిరీస్ ‘ఆకలి రాజ్యం’ (Aakali Rajyam). పాత సినిమా టైటిల్‌ను తీసుకున్నప్పటికీ… కథ మాత్రం పూర్తిగా నేటి తరం యువత సమస్యల చుట్టూనే తిరుగుతుంది. ఈ సిరీస్ తాజాగా ఓటిటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 1981లో కమల్ హాసన్, శ్రీదేవి నటించిన ‘ఆకలి రాజ్యం’ అప్పటి నిరుద్యోగం, ఆకలి, సామాజిక పరిస్థితులను చూపించింది. ఇప్పుడు అదే పేరుతో వచ్చిన ఈ కొత్త సిరీస్… ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చే యువత ఎదుర్కొంటున్న సమస్యలను టచ్ చేసింది.

కథలోకి వెళ్తే…

రమేష్, అక్షయ్, అరుణ్… ముగ్గురు స్నేహితులు. ఇంజినీరింగ్ చదువు పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో సెటిల్ అవ్వాలనే కలతో హైదరాబాద్ చేరుకుంటారు. వారి గమ్యం అమీర్‌పేట్. అక్కడ కోచింగ్ తీసుకుని సాఫ్ట్‌వేర్ జాబ్ సాధించాలనేది ప్లాన్. కానీ నగరంలో అడుగు పెట్టిన తర్వాత వాళ్లకు అసలు పరిస్థితి అర్థమవుతుంది. కోచింగ్ పూర్తవుతున్నా ఉద్యోగం మాత్రం రాదు. ఒక ఇంటర్వ్యూ తర్వాత మరో ఇంటర్వ్యూ… ప్రతిసారీ కొత్త ఆశ… చివరికి రిజెక్షన్. ఇలా రోజులు గడిచే కొద్దీ రూమ్ రెంట్, మెస్ ఖర్చులు, ఇతర అవసరాలు వారి మీద భారంగా మారతాయి.

Advertisement

ఇంట్లో వాళ్లను డబ్బులు అడగలేని పరిస్థితి. బయట సమాజం నుంచి వచ్చే ప్రశ్నలు. మరోవైపు ఉద్యోగం దొరకడం లేదనే ఫ్రస్ట్రేషన్. ఈ ఒత్తిడి ముగ్గురి స్నేహాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ఇక్కడే కథ మరో మలుపు తీసుకుంటుంది. తమకు ఎదురైన రిజెక్షన్లను చూసి నిరాశలో కూరుకుపోవడం కాకుండా… వాటినే కొత్త ఆలోచనలకు పునాదిగా మార్చుకోవాలని నిర్ణయించుకుంటారు. టెక్నాలజీ, తమ క్రియేటివిటీతో నిరుద్యోగ యువత సమస్యలపై ఒక కొత్త ప్రయత్నం మొదలుపెడతారు. ఆ ప్రయత్నం చివరకు ఎలాంటి మార్పుకు దారి తీసింది? ముగ్గురు స్నేహితులు తమ కలలను నిజం చేసుకున్నారా? అనేది సిరీస్‌లో చూడాలి.

తెలుగులోనే స్ట్రీమింగ్

‘ఆకలి రాజ్యం’ (Aakali Rajyam)కు నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించారు. వికాస్ వశిష్ట, గీత్ సైనీ, రాజేష్ ఖన్నా కీలక పాత్రల్లో కనిపించారు. యువత, స్నేహం, ఉద్యోగ వేట, నిరుద్యోగం వంటి అంశాలతో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. ఆహా వీడియో (Aha Video)లో ఆగస్టు 28 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్… ఉద్యోగం కోసం అమీర్‌పేట్, హైదరాబాద్ వంటి నగరాలకు వచ్చిన యువతకు తమ అనుభవాలను గుర్తు చేస్తుంది. ముఖ్యంగా జాబ్ సెర్చ్‌లో రిజెక్షన్స్ ఎదుర్కొన్న వారికి ఇందులోని పరిస్థితులు మరింత రిలేట్ అయ్యేలా ఉంటాయి.

Tags

Related News

లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్

రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 2 సినిమాలు, 1 వెబ్‌సిరీస్, మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో… అన్నీ తెలుగులోనే

ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

కూరగాయల కోసం కొంటె కుందేలు పోరాటం… పిల్లలతో కలిసి ఎంచక్కా చూడదగ్గ యానిమేషన్ కామెడీ

పెళ్ళైనట్టు నటిస్తూ ఇవేం మెంటల్ మాస్ పనులు భయ్యా… యాక్షన్, రొమాన్స్‌తో అదరగొట్టే కామెడీ సిరీస్

అపార్ట్‌మెంట్‌లో అపరిచిత శవం… ప్రైమ్ వీడియోలోకి డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్

భర్త, ప్రాణ స్నేహితురాలు కలిసి చంపేశారు… గతంలోకి వెళ్ళిన భార్య వాళ్లకే పెళ్లి చేయాలనుకుంటే ? అదిరిపోయే కొరియన్ రివెంజ్ డ్రామా

Big Stories

Advertisement
×