E-Paper
Advertisement

‘విశ్వనగరాన్ని విషాద నగరంగా మార్చారు’.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై రామచందర్ రావు ఫైర్!

‘విశ్వనగరాన్ని విషాద నగరంగా మార్చారు’.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై రామచందర్ రావు ఫైర్!
Advertisement

Ramchander Rao: హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని గొప్పలు చెప్పి గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ విషాద నగరంగా మార్చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ధ్వజమెత్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో సరైన మౌలిక వసతులు లేక, అధ్వానపు రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత, ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యంతో భాగ్యనగర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి ఒక్క భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని నగర ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

రాబోయే 3 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో ప్రజలు బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ మూడు కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అత్యంత పారదర్శకంగా నేరుగా ప్రజల వద్దకు చేరుతాయని రాంచందర్ రావు స్పష్టం చేశారు.

Advertisement

అంతకుముందు మహిళా మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రక్షా బంధన్ వేడుకల్లో రామచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా నేతలు రామచందర్ రావుకు రాఖీలు కట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నా-చెల్లెలు, అక్కా-తమ్ముళ్ల పవిత్ర అనుబంధానికి రక్షాబంధన్ ప్రతీక అని పేర్కొన్నారు. మోదీప్రధాని అయిన తర్వాత మహిళా సంక్షేమం, సాధికారతకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చారని కొనియాడారు.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రాత్మక ‘నారీ శక్తి’ చట్టాన్ని పార్లమెంటులో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. అయితే ఈ చారిత్రాత్మక బిల్లును కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలు అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించాయని మండిపడ్డారు. మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం దక్కకుండా అడ్డంకులు సృష్టించిన కాంగ్రెస్, ఇండి కూటమి పార్టీలు పచ్చి మహిళా వ్యతిరేక పార్టీలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Advertisement

Also Read: రోబో వ్యాక్యూమ్‌తో భార్య ఎఫైర్ బట్టబయలు.. రూ.15 లక్షలు గెలిచి.. చివరికి జైలు పాలైన భర్త!

మరోవైపు నేపాల్ వరద విపత్తుపై రామచందర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నేపాల్‌లో ఆకస్మిక వరదల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడం, వందలాది మంది గల్లంతు కావడం తీవ్ర విచారకరమన్నారు. గల్లంతైన వారిలో 288 మంది భారతీయులు ఉండటం బాధాకరమని, వారి ఆచూకీ కనుగొనేందుకు కేంద్ర విదేశాంగ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఈ విపత్కర సమయంలో నేపాల్ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు భారత ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని స్పష్టంచేశారు.

Also Read: మీ సాయం మాకొద్దు.. ఆ ఒక్కటీ చేయండి చాలు.. నేపాల్ స్టేట్మెంట్!

Tags

Related News

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ భహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

Big Stories

Advertisement
×