King 100 Movie: టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ప్రస్తుతం కింగ్ 100 అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా నాగార్జున సినీ కెరియర్ లో 100వ సినిమా కావటం విశేషం . ఇలా నాగార్జున సినీ కెరియర్ లోనే మైలురాయిగా ఈ సినిమా ఉండబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా చిత్ర నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ విడుదల చేశారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్టు ఒక వీడియో ద్వారా నిర్మాతలు తెలియజేశారు.
తాజాగా విడుదల చేసిన ఈ టీజర్ గ్లింప్స్ చూస్తుంటే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. దట్టమైన చీకటిలో అత్యంత వేగంగా కారు దూసుకెల్లడం దారి మధ్యలో కోబ్రా (నాగుపాము) వార్నింగ్ సైన్ బోర్డ్ కనిపించడం ఆడియన్స్‌లో గూస్‌బంప్స్ పెంచేస్తోంది. ఈ నేపథ్యంలోనే కింగ్ కోబ్రాకు ఈ సినిమా టైటిల్ కు ఏదైనా సంబంధం ఉందా? అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఈ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి టైటిల్ గ్లింప్స్ రేపు(శనివారం) ఉదయం 9 గంటలకు విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు. రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పక్కా హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతోందని తెస్తుంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు. ఇక ఇందులో సీనియర్ నటి టబు(Tabu) కీలక పాత్రలో నటించబోతున్నారు. ఈ సినిమా కథను మలుపు తిప్పే పాత్రలో ఈమె కనిపించనున్నారు. సుస్మితా భట్, విజయేంద్ర లాంటి నటీనటులు ఈ సినిమాలో భాగమయ్యారు.
TEASE IS OUT NOW 🔥
Fasten your seatbelts… because from tomorrow, the KING'S REIGN BEGINS 👑💥
BIRTHDAY GLIMPSE
9 AM | AUG 29 ❤️🔥#KING100
King @iamnagarjuna @Rakarthik_dir @ThisIsDSP @rajamahadhevan @NavinNooli @ArtSathees #SupriyaYarlagadda @CVRao74 @TSeriesSouth… pic.twitter.com/7oHclN27xv— Annapurna Studios (@AnnapurnaStdios) August 28, 2026
నాగార్జున తన కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలవబోతున్న తన 100 వ చిత్రాన్ని స్వయంగా నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల కాలంలో నాగార్జున హీరోగా నటించిన సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. బంగార్రాజు సినిమా తర్వాత నాగార్జున పలు సినిమాలలో నటించినప్పటికీ అభిమానులు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే తన 100వ సినిమా పై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా నాగార్జునకు ఏ విధమైనటువంటి సక్సెస్ అందిస్తుందనేది తెలియాల్సి ఉంది.ఇక నాగార్జున ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. అదేవిధంగా బిగ్ బాస్ తెలుగు కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.
Also Read: రాఖీ స్పెషల్.. ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్పెషల్ గిఫ్ట్స్..