Korean Reality Show OTT : పెళ్లి చేసుకోవడానికి సరైన పార్ట్‌నర్ దొరకడం అంత ఈజీ కాదు. మరి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఉన్న సింగిల్స్ అందరినీ ఒకే చోటికి తీసుకొచ్చి… వాళ్లకే నచ్చిన వ్యక్తిని వాళ్లే సెలెక్ట్ చేసుకోమంటే ? మొదట్లో అంతా సరదాగానే ఉంటుంది. కానీ ఒకరికి నచ్చిన వ్యక్తి ఇంకొకరికి కూడా నచ్చితే ? ఇక అక్కడ మొదలయ్యే రొమాన్స్, గొడవలు, అసూయ మామూలుగా ఉండవు. ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన కొరియన్ డేటింగ్ రియాలిటీ షో ‘I Am Solo’. మరి ఈ షోలో ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత పాపులర్ అయింది? అన్నది తెలుసుకుందాం పదండి.
‘ఐయామ్ సోలో’ అనేది రెగ్యులర్ స్క్రిప్టెడ్ సిరీస్ కాదు. పెళ్లి చేసుకోవడానికి పార్ట్‌నర్ ను వెతుక్కుంటున్న సింగిల్ అబ్బాయిలు, అమ్మాయిలను ఒకే చోటికి తీసుకొచ్చి… వాళ్ల మధ్య జరిగే పరిచయాలు, డేట్స్, నిర్ణయాలు, రిలేషన్ షిప్స్ ను చూపించే రియాలిటీ షో. షోలోకి వచ్చిన వాళ్లు మొదట ఒకరినొకరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎవరి వయసు ఎంత ? ఏం చేస్తారు ? ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు ? అనే విషయాలు ఒకొక్కటిగా తెలుసుకుంటారు.
ఆ తర్వాత తమకు నచ్చిన వాళ్లతో మాట్లాడటం, డేట్స్ కు వెళ్లడం మొదలవుతుంది. ఇక అక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక అమ్మాయికి నచ్చిన అబ్బాయినే మరో అమ్మాయి కూడా ఇష్టపడొచ్చు. ఒక అబ్బాయి మొదట ఓ అమ్మాయితో క్లోజ్ గా ఉండి, తర్వాత ఇంకొకరిపై ఇంట్రెస్ట్ చూపించొచ్చు. దాంతో రిలేషన్ షిప్స్ లో మార్పులు వస్తుంటాయి. ఎవరికి ఎవరు నచ్చుతున్నారు ? ఎవరు నిజంగా సీరియస్ గా ఉన్నారు ? చివరికి ఎవరితో ఎవరికి పెళ్లి ఫిక్స్ అవుతుంది ? అన్నదే ఇందులో చూడాల్సిన ఇంట్రెస్టింగ్ విషయం.
‘బిగ్ బాస్’లో ఉండే రొమాన్స్, గొడవలు, గ్రూప్ డైనమిక్స్ లాంటివి ఇక్కడ కూడా కనిపిస్తాయి. కానీ ఇక్కడ గేమ్ గెలవడం కంటే… నిజంగా జీవిత భాగస్వామిని వెతుక్కోవడమే ముఖ్యం. అందుకే ఎవరు మొదట ఎవరిని ఇష్టపడ్డారు అనే దానికంటే… చివరి వరకు ఎవరి నిర్ణయం మారకుండా ఉంటుంది ? ఎవరి మధ్య నిజమైన కనెక్షన్ ఏర్పడుతుంది ? అనేదే చూడాలనిపిస్తుంది.
ఇదొక కొరియన్ డేటింగ్ రియాలిటీ షో. 2021లో ప్రారంభమైంది. ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉన్న ఎపిసోడ్స్ ద్వారా చూడొచ్చు. షోలో ప్రతి సీజన్ వచ్చే పార్టిసిపెంట్స్ మారుతుంటారు కాబట్టి ఇక్కడ సినిమాల్లా ఒకే హీరో, హీరోయిన్ అనే కాన్సెప్ట్ ఉండదు. ప్రేమ, పెళ్లి, రిలేషన్‌షిప్స్‌పై రియల్ పీపుల్ నిర్ణయాలు చూడాలని అనుకునే వాళ్లకు ఇది బాగా కనెక్ట్ అవుతుంది. కాకపోతే ఈ సిరీస్ తెలుగులో మాత్రం అందుబాటులో లేదు. ఇంగ్షీషులోనే చూడాల్సి ఉంటుంది. కానీ రిలేషన్షిప్ వంటి అంశాల వల్ల ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.