E-Paper
Advertisement

ఇరుముడి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

ఇరుముడి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!
Advertisement

Irumudi Ott:ప్రముఖ డైరెక్టర్ శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా ప్రియా భవాని శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్ గా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఇరుముడి. బేబీ నక్షత్ర (baby Nakshatra) మనెమ్మ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఇకపోతే థియేటర్లలో వరుస కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతున్న నేపథ్యంలో సడన్గా టాక్సిక్ సినిమా రావడంతో థియేటర్ ఒప్పందం మేరకు ఈ సినిమాను చాలా థియేటర్ల నుంచి తొలగించారు. కానీ అటు టాక్సిక్ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడం గమనార్హం.

డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతున్న ఇరుముడి..

ఇకపోతే ఈ సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులతో దూసుకుపోతుంటే.. మరొకవైపు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూసే అభిమానులు కూడా లేకపోలేదు. ఈ సినిమా విడుదలై ఇంకా పది రోజుల్లో కూడా కాలేదు. అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్ ఏంటి అని మరికొంతమంది కామెంట్లు చేస్తుంటే.. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక డేట్ తెగ వైరల్ గా మారుతోంది..ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 18 నుండి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతోంది అంటూ ఒక పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇది నెట్ ఫ్లిక్స్ నుంచి అధికారికంగా వెలువడకపోయినా.. ఈ డేట్ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు.

Advertisement

ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇకపోతే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి రానుంది. మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి. సాధారణంగా సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత 4 లేదా 8 వారాలు లేదా థియేటర్ రన్ ను బట్టి ఆ సినిమా ఓటిటి డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను డిసైడ్ చేస్తారు . మరి నిజంగానే ఈ సినిమా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు సెప్టెంబర్ 18న థియేటర్లలోకి వస్తుందా లేక థియేటర్ రన్ పూర్తి చేసుకొని అక్టోబర్లో స్ట్రీమింగ్ కి వస్తుందా అన్న విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

also read:ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన లోకేష్ కనగరాజ్ డీ.సీ.మూవీ.. ఎప్పుడంటే?

ఇరుముడి మూవీ రివ్యూ..

సీలేరు పరిసరాల్లోని ఒక ప్రశాంతమైన పల్లెటూరి నేపథ్యంలో ఈ కథ మొదలవుతుంది. అరటిపండ్ల వ్యాపారం చేసుకుంటూ భార్య కావేరి (ప్రియా భవాని శంకర్) , కూతురు మణికంఠ (బేబీ నక్షత్ర)తో సంతోషంగా జీవించే వ్యక్తి త్రినాథ్ (రవితేజ). అయ్యప్ప భక్తుడిగా క్రమశిక్షణతో ఉండే అతనికి కుటుంబమే సర్వస్వం. అయితే ఆ ప్రాంతంలో స్కూల్ కి వెళ్లే కొందరు బాలికలు అనుమానాస్పద స్థితుల్లో ప్రాణాలు కోల్పోతుండడం కలకలం రేపుతుంది. ఈ సంఘటనలకు సంబంధించిన ఒక కీలక విషయం త్రినాథ్ కూతురికి తెలియడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. ఆ తర్వాత తన బిడ్డతో పాటు గ్రామంలోని ఆడపిల్లలకు అండగా నిలిచేందుకు త్రినాథ్ చేసిన పోరాటమే ఈ సినిమా కథ. మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈమె వారం ముగిసేలోపు ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

Related News

ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

కూరగాయల కోసం కొంటె కుందేలు పోరాటం… పిల్లలతో కలిసి ఎంచక్కా చూడదగ్గ యానిమేషన్ కామెడీ

పెళ్ళైనట్టు నటిస్తూ ఇవేం మెంటల్ మాస్ పనులు భయ్యా… యాక్షన్, రొమాన్స్‌తో అదరగొట్టే కామెడీ సిరీస్

అపార్ట్‌మెంట్‌లో అపరిచిత శవం… ప్రైమ్ వీడియోలోకి డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్

భర్త, ప్రాణ స్నేహితురాలు కలిసి చంపేశారు… గతంలోకి వెళ్ళిన భార్య వాళ్లకే పెళ్లి చేయాలనుకుంటే ? అదిరిపోయే కొరియన్ రివెంజ్ డ్రామా

దెయ్యాలనే నమ్మని యువతికి దడుచుకునే ట్విస్ట్… మస్ట్ వాచ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

హత్య వెనకున్న మతిపోగొట్టే మిస్టరీ… ఉత్కంఠ రేపుతున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ సీజన్ 24

Big Stories

Advertisement
×