E-Paper
Advertisement

పిల్లలను ఎత్తుకెళ్లే సీరియల్ కిల్లర్… 25 ఏళ్ల తర్వాత రీఎంట్రీ… తెలుగులో సైకో థ్రిల్లర్ స్ట్రీమింగ్

పిల్లలను ఎత్తుకెళ్లే సీరియల్ కిల్లర్… 25 ఏళ్ల తర్వాత రీఎంట్రీ… తెలుగులో సైకో థ్రిల్లర్ స్ట్రీమింగ్
Advertisement

Psychological Crime Thriller: చిన్న పిల్లలను టార్గెట్ చేసే ఓ సీరియల్ కిల్లర్… అతని పేరు వింటేనే తల్లిదండ్రులు వణికిపోయేంత భయం. కానీ అతని నేరాలు బయటపడిన 25 ఏళ్ల తర్వాత, అదే తరహాలో మరో బాలుడు కనిపించకుండా పోతే ? ఇంతకాలం జైలులో ఉన్న కిల్లర్ మళ్లీ బయటకు వచ్చాడా ? లేక అతని పాత నేరాలను ఎవరో కాపీ చేస్తున్నారా ? తండ్రి తన కొడుకును వెతుక్కుంటూ వెళ్లిన కొద్దీ, పాత కేసు వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజాలు బయటపడే సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘The Whisper Man’. మరి పాత సీరియల్ కిల్లర్ కథ మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చింది ? చిన్నారి అదృశ్యానికి దానికున్న సంబంధం ఏంటి ? అనే వివరాలను కథలో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

టామ్ కెన్నెడీ తన భార్యను కోల్పోయిన తర్వాత తన ఎనిమిదేళ్ల కొడుకు జేక్‌ తో కలిసి కొత్త ఇంటికి మారతాడు. కొడుకుతో కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్న సమయంలోనే జేక్ అనూహ్యంగా కనిపించకుండా పోతాడు. మొదట ఇది సాధారణ కిడ్నాప్ కేసులా అనిపించినా, దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ 25 ఏళ్ల క్రితం జరిగిన ఓ సీరియల్ కిల్లర్ కేసుతో ఉన్న లింక్ బయట పడుతుంది. ఆ కిల్లర్‌ను ‘ది విస్పర్ మ్యాన్’ అని పిలుస్తారు. పిల్లలను అపహరించి, వారి కుటుంబాలకు భయంకరమైన పరిస్థితులు సృష్టించడం అతని నేరాల పద్ధతి. అప్పట్లో ఈ కేసును ఛేదించిన మాజీ పోలీస్ అధికారి పీట్ విల్లిస్ ఇప్పుడు రిటైర్ అయి ఉంటాడు. కానీ జేక్ అదృశ్యం కావడంతో పాత కేసు మళ్లీ అతని ముందుకొస్తుంది.

Advertisement

జేక్ కోసం వెతుకుతున్న టామ్, తన తండ్రితో ఉన్న పాత విభేదాలను పక్కన పెట్టి అతని సహాయం కోరాల్సి వస్తుంది. అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. పాత కిల్లర్ నిజంగానే ఈ ఘటన వెనుక ఉన్నాడా ? లేక అతని నేరాలను ఎవరో కాపీ చేస్తున్నారా ? జేక్ అదృశ్యానికి, పాత కేసులోని రహస్యాలకు ఏదైనా లింక్ ఉందా ? కొడుకును వెతుక్కుంటూ వెళ్లిన టామ్‌ కు తన కుటుంబం గురించి కూడా ఊహించని నిజాలు బయటపడతాయి. చివరికి అసలు ‘విస్పర్ మ్యాన్’ ఎవరు? అతని భయంకరమైన ఆట మళ్లీ ఎందుకు మొదలైంది ? అనేదే సినిమాలో చూడాల్సిన అసలు ట్విస్ట్.

తెలుగులో ఉందా ?

జేమ్స్ ఆష్‌క్రాఫ్ట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అలెక్స్ నార్త్ రాసిన 2019 బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా రూపొందింది. రాబర్ట్ డి నిరో పీట్ విల్లిస్‌గా, ఆడమ్ స్కాట్ టామ్ కెన్నెడీగా, మిషెల్ మోనగన్ డిటెక్టివ్ అమాండా బెక్‌గా, మైఖేల్ కీటన్ కీలక పాత్రలో నటించారు. ఆగస్టు 28 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులో ఉంది. పిల్లల మిస్సింగ్ కేసులు, సీరియల్ కిల్లర్ మిస్టరీలు, డార్క్ క్రైమ్ థ్రిల్లర్స్ వంటి అంశాలతో సాగే ఈ సినిమా మంచి సీట్ ఎడ్జ్ వాచ్ అని చెప్పొచ్చు.

Advertisement

Read Also: దొంగను పట్టుకోబోయిన ఏజెంట్‌కి చుక్కలు… అడుగడుగునా ట్విస్టులు… ఇదేం కామెడీ భయ్యా

Tags

Related News

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్

రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 2 సినిమాలు, 1 వెబ్‌సిరీస్, మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో… అన్నీ తెలుగులోనే

ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

Big Stories

Advertisement
×