E-Paper
Advertisement

ఆకలితో మొదలైన గేమ్… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగులు… ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ తెలుగులోనే

ఆకలితో మొదలైన గేమ్… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగులు… ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ తెలుగులోనే
Advertisement

Survival Thriller on OTT: హాలిడే ట్రిప్‌కు వెళ్లిన కొందరు టూరిస్టులు… అడ్వెంచర్ కోసం లూసియానా స్వాంప్‌ల్యాండ్స్‌లోకి బోట్ జర్నీకి బయలుదేరితే ? సరదాగా మొదలైన ఆ ప్రయాణం మధ్యలో దారి తప్పి, బయటకు వచ్చే మార్గం లేకుండా పోతే ? అంతలో నీళ్ల కింద దాక్కున్న ఓ భారీ, క్రూరమైన హిప్పో వాళ్లను వేటాడటం మొదలుపెడితే ? ఇక అక్కడి నుంచి టూరిస్ట్ ట్రిప్ కాస్తా ప్రాణాల కోసం జరిగే సర్వైవల్ గేమ్‌గా మారిపోతుంది. హారర్, సస్పెన్స్, యానిమల్ అటాక్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ‘Hungry’ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ టూరిస్టులు ఆ ప్రమాదకరమైన అడవిలోకి ఎందుకు వెళ్లారు? ఆ హిప్పో నుంచి వాళ్లు ఎలా తప్పించుకున్నారు ? చివరికి ఎవరు బయటపడ్డారు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ కొంతమంది టూరిస్టుల రివర్‌ బోట్ అడ్వెంచర్‌ తో మొదలవుతుంది. లూసియానాలోని ప్రమాదకరమైన స్వాంప్ ప్రాంతాల్లోకి వాళ్లు ఓ ప్రత్యేకమైన అడ్వెంచర్ కోసం వెళ్తారు. మొదట అంతా సరదాగానే ఉంటుంది. చుట్టూ నీరు, దట్టమైన అడవి, కొత్త అనుభవం అంటూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ వాళ్లు అనుకున్న మార్గం నుంచి దారి తప్పడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. అసలు ప్రమాదం అక్కడే మొదలవుతుంది. నీళ్లలో దాక్కుని ఉన్న ఓ భారీ హిప్పో వాళ్లపై దాడి చేయడంతో బోట్ ప్రమాదానికి గురవుతుంది. ప్రాణాలతో బయటపడిన వాళ్లు ఇప్పుడు అడవిలో ఒంటరిగా చిక్కుకుపోతారు.

Advertisement

ఫోన్ సిగ్నల్ లేదు, సహాయం వచ్చే పరిస్థితి లేదు. చుట్టూ నీళ్లు, అడవే, ఎప్పుడు ఎక్కడి నుంచి దాడి జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రాణాల కోసం పరుగులు తీస్తున్న వాళ్లను ఆ హిప్పో వదిలిపెట్టదు. నీళ్లలోకి వెళ్లినా ప్రమాదమే, ఒడ్డున ఉన్నా ప్రమాదమే. ఒకవైపు ఆకలి, దాహం, అలసట… మరోవైపు ఎప్పుడైనా దాడి చేయగల క్రూరమైన జంతువు. దీంతో వాళ్ల మధ్య కూడా టెన్షన్ పెరుగుతుంది. ఎవరిని నమ్మాలి? ఎక్కడ దాక్కోవాలి? ఎలా బయటపడాలి? అనే ప్రశ్నలు ప్రతి క్షణం వెంటాడుతుంటాయి. అసలు ఈ హిప్పో నుంచి వాళ్లు తప్పించుకోగలరా ? అడవిలో చిక్కుకున్న వాళ్లలో ఎంత మంది ప్రాణాలతో బయట పడతారు ? చివరికి ఆ క్రూరమైన జంతువును ఎలా ఎదుర్కొంటారు ? అనేదే సినిమాలో చూడాల్సిన అసలు సర్వైవల్ థ్రిల్.

తెలుగులో అందుబాటులో ఉందా?

జేమ్స్ నన్ దర్శకత్వం వహించిన ‘హంగ్రీ’లో మ్యాడిసన్ డావెన్‌పోర్ట్, ట్రేసీ బోన్నర్, జోక్విమ్ డి అల్మెయిడా, మైకెల్ క్యూరియల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమా రన్‌టైమ్ సుమారు 1 గంట 33 నిమిషాలు ఉంటుంది. హారర్, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 28 నుంచి Lionsgate Playలో అందుబాటులోకి వచ్చింది. అలాగే Prime Videoలో కూడా ఉంది. మంచి విషయం ఏమిటంటే ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. యానిమల్ అటాక్, అడవిలో సర్వైవల్, సీట్ ఎడ్జ్ టెన్షన్ తో ఈ మూవీ మంచి వీకెండ్ థ్రిల్లర్ అవుతుంది.

Advertisement

Read Also: రాత్రికి రాత్రే స్టార్‌డమ్… ఫుట్‌బాల్ లెజెండ్ విన్స్ యంగ్ జీవితం ఎలా నాశనం అయ్యిందో కళ్ళకు కట్టిన సినిమా

Related News

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్

రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 2 సినిమాలు, 1 వెబ్‌సిరీస్, మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో… అన్నీ తెలుగులోనే

ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

కూరగాయల కోసం కొంటె కుందేలు పోరాటం… పిల్లలతో కలిసి ఎంచక్కా చూడదగ్గ యానిమేషన్ కామెడీ

పెళ్ళైనట్టు నటిస్తూ ఇవేం మెంటల్ మాస్ పనులు భయ్యా… యాక్షన్, రొమాన్స్‌తో అదరగొట్టే కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×