E-Paper
Advertisement

ఫోన్ కూడా ఫింగర్‌ప్రింట్ గుర్తుపట్టకపోతే… ఇంట్లోనే పరాయివాడైపోయిన రచయిత… క్రేజీ ట్విస్టులున్న కొరియన్ సిరీస్

ఫోన్ కూడా ఫింగర్‌ప్రింట్ గుర్తుపట్టకపోతే… ఇంట్లోనే పరాయివాడైపోయిన రచయిత… క్రేజీ ట్విస్టులున్న కొరియన్ సిరీస్
Advertisement

Korean Psychological Thriller: ఒక్కరోజు ఉదయం నిద్రలేచాక మీ ఫోన్ మీ ఫింగర్‌ప్రింట్‌ను గుర్తుపట్టకపోతే ? పాస్‌వర్డ్‌లు పని చేయకపోతే ? మీ పేరుతో ఉన్న డబ్బు, గుర్తింపు, ఆస్తి అన్నీ మరొకరి చేతుల్లోకి వెళ్లిపోయాయని తెలిస్తే ? అసలు మీరు మీరేనని నిరూపించుకోవడానికి ఒక్క ఆధారం కూడా లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది ? ఇలాంటి మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్‌తో వచ్చిన కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ‘Mousetrap’ తాజాగా ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఒక రచయిత జీవితాన్ని ఎవరో పూర్తిగా దొంగిలించి, అతడినే పరాయివాడిగా మార్చేస్తే ఏం జరుగుతుందనే ఆసక్తికరమైన పాయింట్ చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. మరి అతని జీవితాన్ని దొంగిలించింది ఎవరు ? ‘ది ర్యాట్’ అసలు ఎవరు? తన గుర్తింపును తిరిగి ఎలా సంపాదించుకున్నాడు? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

మూన్-జే ఓ రచయిత. బయట ప్రపంచానికి దూరంగా, చాలా కాలంగా ఒంటరిగా జీవిస్తుంటాడు. అతని జీవితం ఒకే రొటీన్‌ లో సాగిపోతుంటుంది. కానీ ఒకరోజు అనుకోకుండా అతని ఫోన్ ఫింగర్‌ ప్రింట్‌ను గుర్తుపట్టదు. మొదట చిన్న టెక్నికల్ సమస్య అనుకుంటాడు. కానీ ఆ తర్వాత పాస్‌వర్డ్‌లు కూడా పని చేయవు. తనకు సంబంధించిన ఒక్కో విషయం తన చేతుల్లోంచి జారిపోతూ ఉంటుంది. ఇంతలో తన పనులన్నింటిలో సహాయం చేసే ఏకైక వ్యక్తి కూడా కనిపించకుండా పోతాడు. తన పేరు, గుర్తింపు, డబ్బు, ఆస్తి అన్నీ ఎవరో దొంగిలించారని మూన్-జే తెలుసుకుంటాడు. అంతేకాదు, తన స్థానంలో మరో వ్యక్తి తన జీవితాన్ని జీవిస్తున్నాడని అర్థమవుతుంది. ఇక తానే అసలైన మూన్-జే అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

Advertisement

ఈ గందరగోళం వెనుక ‘ది ర్యాట్’ అనే మిస్టీరియస్ వ్యక్తి ఉన్నాడని అతడికి తెలుస్తుంది. అతడిని పట్టుకోవడానికి మూన్-జే తనను ఇంతకాలం వెంబడించిన లోన్ షార్క్ నోజాతోనే చేతులు కలపాల్సి వస్తుంది. డబ్బు తిరిగి కావాలనే నోజా, తన గుర్తింపును తిరిగి పొందాలనే మూన్-జే కలిసి ఈ వింత మిస్టరీని ఛేదించడం మొదలుపెడతారు. అయితే ‘ది ర్యాట్’ అసలు ఎవరు ? మూన్-జే జీవితాన్ని ఎందుకు దొంగిలించాడు ? అతడి గురించి శత్రువుకు ఇంత సమాచారం ఎలా తెలుసు ? నిజంగా మనం చూస్తున్న వ్యక్తులే వాళ్లా ? లేక వాళ్ల వెనుక ఇంకెవరైనా ఉన్నారా ? అనేదే సిరీస్‌లో చూడాల్సిన అసలైన థ్రిల్.

తెలుగులో ఏ ఓటీటీలో ఉంది ?

కిమ్ హాంగ్-సన్ దర్శకత్వం వహించిన ‘మౌస్ ట్రాప్’లో ర్యూ జూన్-యోల్ మూన్-జేగా, సుల్ క్యుంగ్-గు నోజాగా, లీ క్యూ-హ్యుంగ్ సూన్-యోంగ్‌గా నటించారు. ఈ సిరీస్ ‘Field Mouse’ అనే కొరియన్ వెబ్‌టూన్ ఆధారంగా రూపొందింది. మొత్తం 10 ఎపిసోడ్లతో వచ్చిన ఈ సిరీస్ ఆగస్టు 28 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కొరియన్ మిస్టరీ, క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్… ఇంగ్లీష్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక్కో ఎపిసోడ్‌లో కొత్త అనుమానాలు రేకెత్తించే బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది.

Advertisement

Read Also: ఓటీటీలోకి షాకింగ్ మర్డర్ మిస్టరీ… భర్తను చంపిందని భార్య అరెస్ట్… క్లైమాక్స్ లో పిచ్చెక్కించే ట్విస్ట్

Tags

Related News

ప్రేమ కోసం అలాంటి పని… ఇంట్లో పెద్ద గందరగోళంతో ఫుల్ ఫన్… మస్ట్ వాచ్ రొమాంటిక్ కామెడీ డ్రామా

జేబులో చిల్లిగవ్వలేదు… కానీ ఆ ఒక్కటీ కావాల్సిందే… నేటితరం యూత్ కు కనెక్టయ్యే కామెడీ కథ

ఆకలితో మొదలైన గేమ్… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగులు… ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ తెలుగులోనే

సీమంతంకు వెళ్తే సస్పెండ్… ఈ లేడీ సింగం గట్స్ కు దండం పెట్టాలి మావా… తెలుగులోనూ హిందీ క్రైమ్ థ్రిల్లర్

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన న్యూటన్స్ థర్డ్ లా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

స్టేజ్‌పై ర్యాప్ షో… తెరవెనుక ఊహించని ట్విస్ట్… గెలవడానికి ఏం చేశారో తెలిస్తే షాక్

అంగీకారం లేకుండా ఆ పని… ప్రియురాలి కంప్లైంట్ తో రాత్రికి రాత్రే హీరో అరెస్ట్… ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×