E-Paper
Advertisement

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన లోకేష్ కనగరాజ్ డీ.సీ.మూవీ.. ఎప్పుడంటే?

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన లోకేష్ కనగరాజ్ డీ.సీ.మూవీ.. ఎప్పుడంటే?
Advertisement

DC Movie OTT: ఇటీవల కాలంలో హీరోలు.. దర్శకులుగా, నిర్మాతలుగా మారి సినిమాలను నిర్మిస్తుంటే.. అటు మేమేమి తక్కువ కాదు అంటూ దర్శకులు.. హీరోలుగా మారుతూ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా హీరోలకు మించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతున్నారు. అలాంటి చిత్రాలలో డీ.సీ.కూడా ఒకటి. కూలీ, విక్రమ్, లియో వంటి పాన్ ఇండియా చిత్రాలతో స్టార్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్న ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh kanagaraj) తొలిసారి హీరోగా మారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఇది. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా 2026 ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది .

డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతున్న డీ.సీ. మూవీ..

రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాకు పోటీగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన ‘కొరియన్ కనకరాజు’ మూవీ కూడా విడుదలైంది . అయితే ఈ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే అందుకోలేదు. కానీ డైరెక్టర్ హీరోగా తొలిసారి చేసిన సినిమా రూ.100 కోట్లు రాబట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు నెలలోపే ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రాబోతోంది.

ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Advertisement

లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ డీ.సీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ సన్ నెక్స్ట్, అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికలుగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది . థియేటర్ రన్ ముగియడంతో ఈ సినిమాను 2026 సెప్టెంబర్ 4 నుండి డిజిటల్ వేదికపై స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సన్ నెక్స్ట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మెగా బ్లాక్ బస్టర్ డీసీ మూవీ సెప్టెంబర్ 4న తెలుగు , తమిళ్, మలయాళం భాషలలో అందుబాటులోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్లో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.

ALSO READ:మంగ్లీ కేసులో కేంద్ర మంత్రి.. నిజాలు బయటపెట్టిన లాయర్ సుబ్బారావు!

హీరోగా తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్..

Advertisement

ఇకపోతే ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించగా.. వామికా గబ్బి హీరోయిన్ గా నటించింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రానికి.. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ సంగీతాన్ని అందించారు. దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న లోకేష్ కనగరాజ్ ఈ సినిమాతో నటుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పటివరకు కెమెరా వెనుక ఉండి యాక్షన్ సినిమాలను తెరకెక్కించిన ఈయన.. తొలిసారి కెమెరా ముందు ప్రధాన పాత్రలో కనిపించడం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. అటు డైరెక్టర్ అరుణ్ కూడా తనదైన రఫ్, ఇంటెన్స్ టేకింగ్ తో సినిమాను తెరకెక్కించారు.. ఇందులో వామికా గబ్బి తన పాత్రకు పూర్తిస్థాయి ప్రాణం పోసింది. అలా ఎట్టకేలకు ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతోంది. మరి థియేటర్లలో 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా.. ఇటు ఓటీటీ లో ఎలాంటి స్థాయిలో రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related News

ఇరుముడి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

పిల్లలను ఎత్తుకెళ్లే సీరియల్ కిల్లర్… 25 ఏళ్ల తర్వాత రీఎంట్రీ… తెలుగులో సైకో థ్రిల్లర్ స్ట్రీమింగ్

ప్రేమ కోసం అలాంటి పని… ఇంట్లో పెద్ద గందరగోళంతో ఫుల్ ఫన్… మస్ట్ వాచ్ రొమాంటిక్ కామెడీ డ్రామా

ఫోన్ కూడా ఫింగర్‌ప్రింట్ గుర్తుపట్టకపోతే… ఇంట్లోనే పరాయివాడైపోయిన రచయిత… క్రేజీ ట్విస్టులున్న కొరియన్ సిరీస్

జేబులో చిల్లిగవ్వలేదు… కానీ ఆ ఒక్కటీ కావాల్సిందే… నేటితరం యూత్ కు కనెక్టయ్యే కామెడీ కథ

ఆకలితో మొదలైన గేమ్… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగులు… ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ తెలుగులోనే

సీమంతంకు వెళ్తే సస్పెండ్… ఈ లేడీ సింగం గట్స్ కు దండం పెట్టాలి మావా… తెలుగులోనూ హిందీ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×