E-Paper
Advertisement

సీమంతంకు వెళ్తే సస్పెండ్… ఈ లేడీ సింగం గట్స్ కు దండం పెట్టాలి మావా… తెలుగులోనూ హిందీ క్రైమ్ థ్రిల్లర్

సీమంతంకు వెళ్తే సస్పెండ్… ఈ లేడీ సింగం గట్స్ కు దండం పెట్టాలి మావా… తెలుగులోనూ హిందీ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller on OTT: పోలీస్ ఆఫీసర్ అంటే డ్యూటీకి డ్యూటీ, పర్సనల్ లైఫ్‌కు పర్సనల్ లైఫ్ అని చాలామంది అనుకుంటారు. కానీ ఓ మహిళా పోలీస్ ఆఫీసర్‌కు మాత్రం ఈ రెండింటి మధ్య గీతే చెరిగిపోతే? సొంత కుటుంబంలో జరుగుతున్న సమస్యలు ఒకవైపు, తన ముందుకొచ్చిన మర్డర్ మిస్టరీ మరోవైపు ఉంటే? పైగా డ్యూటీలో చేసిన ఓ పని కారణంగా సస్పెండ్ అయితే? అయినా వెనక్కి తగ్గకుండా అసలు నిజాన్ని బయటకు తీసేందుకు పోరాడే మహిళా పోలీస్ కథే ‘Babita Singh Reporting’. నిమిషా సజయన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హిందీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డ్రామా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. మరి బబితా సింగ్ ఎదుర్కొన్న కేసేంటి? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే..

బబితా సింగ్ ఓ పోలీస్ ఆఫీసర్. కొన్ని కారణాల వల్ల ఆమె సస్పెన్షన్‌లో ఉంటుంది. అయితే తన చిన్ననాటి స్నేహితురాలు హత్యకు గురైన విషయం తెలిసిన తర్వాత ఈ కేసును పర్సనల్ గా తీసుకుంటుంది. మొదట స్నేహితురాలి మరణం వెనుక ఉన్న అసలు నిందితుడిని పట్టుకోవడమే ఆమె లక్ష్యంగా ఉంటుంది. కానీ దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత కేసు అనుకున్నంత సింపుల్ కాదని అర్థమవుతుంది.

Advertisement

ఒక్కో క్లూ వెనుక మరో ప్రశ్న, ఒక్కో సమాధానం వెనుక మరో అనుమానం ఎదురవుతుంటాయి. ఆధారాలను వెతుక్కుంటూ ముందుకు వెళ్లే కొద్దీ హత్య కేసుకు తన వ్యక్తిగత జీవితానికి కూడా సంబంధం ఉందని ఆమెకు అనిపిస్తుంది. అప్పటికే సస్పెండ్ ఆర్డర్ కూడా మరో సమస్యగా మారుతుంది. అయినా నిజం బయటపడే వరకు వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకుంటుంది.

కానీ బబితా వెతుకుతున్న నిజం అసలు ఏంటి? తన స్నేహితురాలి హత్య వెనుక ఎవరు ఉన్నారు? కేసు దర్యాప్తు చేస్తూ తన సొంత గతం, సంబంధాలు, వివాహ జీవితం గురించి ఆమెకు ఎలాంటి నిజాలు తెలుస్తాయి? చివరికి న్యాయం కోసం ఆమె చేసిన పోరాటం ఎక్కడికి దారి తీస్తుంది? అనేదే సినిమాలో చూడాల్సిన అసలు మిస్టరీ.

తెలుగులో అందుబాటులో ఉందా?

Advertisement

అంబీకా పండిట్ దర్శకత్వం వహించిన ‘Babita Singh Reporting’లో నిమిషా సజయన్, బరుణ్ సోబ్తి, అన్షుమాన్ పుష్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అమితా వ్యాస్ కథ, స్క్రీన్‌ప్లే అందించగా, ‘పాతాళ్ లోక్’ క్రియేటర్ సుదీప్ శర్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా ఆగస్టు 28, 2026 నుంచి Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ ఆడియోతో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ లో కూడా దీనిని చూడవచ్చు. మర్డర్ మిస్టరీ, పోలీస్ ఇన్వెస్టిగేషన్, పర్సనల్ ఎమోషన్స్ కలిసిన క్రైమ్ డ్రామాలు ఇష్టపడేవారికి ‘Babita Singh Reporting’ మంచి ఛాయిస్.

Read Also: దొంగను పట్టుకోబోయిన ఏజెంట్‌కి చుక్కలు… అడుగడుగునా ట్విస్టులు… ఇదేం కామెడీ భయ్యా

Related News

జేబులో చిల్లిగవ్వలేదు… కానీ ఆ ఒక్కటీ కావాల్సిందే… నేటితరం యూత్ కు కనెక్టయ్యే కామెడీ కథ

ఆకలితో మొదలైన గేమ్… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగులు… ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ తెలుగులోనే

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన న్యూటన్స్ థర్డ్ లా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

స్టేజ్‌పై ర్యాప్ షో… తెరవెనుక ఊహించని ట్విస్ట్… గెలవడానికి ఏం చేశారో తెలిస్తే షాక్

అంగీకారం లేకుండా ఆ పని… ప్రియురాలి కంప్లైంట్ తో రాత్రికి రాత్రే హీరో అరెస్ట్… ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

మూడేళ్ల క్రితం అదృశ్యమైన మహిళ… ఇప్పుడు మరో పేరుతో… సీను సీనుకో ట్విస్ట్

విలన్ ను అల్లాడించే ఆల్ఫా అమ్మాయిలు… ఓటీటీలోకి అలియా భట్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×