E-Paper
Advertisement

శ్రీముఖి నిజంగానే లవ్ లో ఫెయిల్ అయ్యారా?.. మరి ఆ మాటకు అర్థం?

శ్రీముఖి నిజంగానే లవ్ లో ఫెయిల్ అయ్యారా?.. మరి ఆ మాటకు అర్థం?
Advertisement

Sree Mukhi: శ్రీముఖి (Sree Mukhi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్‌గా, నటిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ సినిమాతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న శ్రీముఖి పేరు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈసారి ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ కామెంట్‌ చర్చకు దారితీసింది.

‘ఎక్స్’ గురించి శ్రీముఖి కామెంట్:

ప్రస్తుతం శ్రీముఖి ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తనదైన స్టైల్‌, రైమింగ్ డైలాగ్స్‌తో షోను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తోంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో శ్రీముఖి చేసిన ఓ కామెంట్‌ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

ప్రోమోలో జబర్దస్త్ అవినాష్ కామెడీ స్కిట్ చేస్తుండగా.. శ్రీముఖి పేరుతో తలపై టాటూ వేయించుకుంటావా? అంటూ బాలు ను అడుగుతాడు. ఆ సమయంలో శ్రీముఖి సిగ్గుపడుతూ కనిపిస్తుంది. ఆమెను గమనించిన హరి.. ‘ఎందుకు సిగ్గుపడుతున్నావు?’ అని అడుగుతాడు. అందుకు శ్రీముఖి నవ్వుతూ.. ‘నాకు నా ఎక్స్ గుర్తొచ్చాడు’ అని సమాధానం ఇస్తుంది. దీంతో అక్కడున్నవారంతా అరుపులు, కేకలతో సందడి చేస్తారు.

నిజంగానే లవ్ ఫెయిల్యూరా? :

శ్రీముఖి ‘నా ఎక్స్’ అని చెప్పడంతో ఆమెకు గతంలో బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా? బ్రేకప్ జరిగిందా? అనే చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఆమెకు నిజంగానే లవ్ ఫెయిల్యూర్ అయిందని, అందుకే మాజీ ప్రేమికుడిని గుర్తు చేసుకున్నారని కామెంట్లు చేస్తున్నారు. గతంలోనూ శ్రీముఖి ప్రేమ, పెళ్లికి సంబంధించిన పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పటివరకు శ్రీముఖి తన వ్యక్తిగత ప్రేమ జీవితం గురించి అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఆమె చేసిన ఒక్క కామెంట్ ఆధారంగా నిజంగానే ఆమెకు బ్రేకప్ జరిగిందని నిర్ధారించడం కూడా సరైంది కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

also read:ఇరుముడి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

షో ప్రమోషన్‌లో భాగమేనా? :

మరోవైపు, మరికొందరు మాత్రం ఇదంతా కేవలం షో ప్రమోషన్‌లో భాగమేనని అభిప్రాయపడుతున్నారు. ప్రోమోను ఆసక్తికరంగా మార్చేందుకు ఇలాంటి కామెంట్లు, సరదా సన్నివేశాలను జోడించి ఉండొచ్చని అంటున్నారు. శ్రీముఖి గతంలోనూ టీవీ షోల ప్రమోషన్స్‌లో భాగంగా సరదాగా చేసిన కామెంట్లు వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి.అసలు శ్రీముఖి ‘ఎక్స్’ అని ఎవరిని ఉద్దేశించి చెప్పింది? నిజంగానే ఆమెకు గతంలో ప్రేమకథ ఉందా? లేక ఇది కేవలం ప్రోమో కోసం చేసిన సరదా కామెంటా? అనే విషయాలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. దీనిపై క్లారిటీ రావాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×