E-Paper
Advertisement

OTT Movies : సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movies : సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసిన  ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Advertisement

OTT Movies : ఇటీవల కొన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చిన కొద్దిరోజులకే సడన్గా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ముందుగా డేట్ ని అనౌన్స్ చేసుకున్నా కూడా అందరికీ షాక్ ఇస్తూ ఓటీటీలో దర్శనమిస్తుంటాయి. తాజాగా మరో మూవీ సడన్గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. తమిళ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా.. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి యూత్ ని బాగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఏ ఓటీటీలో ఈ సినిమాను చూడొచ్చో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

ఓటీటీ డీటెయిల్స్..

Advertisement

కొలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా సినిమాలు చెయ్యడంతో పాటుగా.. కొన్ని సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాదు కొన్ని సినిమాలను తానే స్వయంగా నిర్మిస్తున్నారు. అయితే ఆయన దర్శకత్వంలో తాజాగా వచ్చిన మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా.. ‘నిలవుక్కు ఎన్‌ మేల్‌ ఎన్నడి కోబం ‘ అనే పేరుతో తమిళ్ళో రిలీజ్ అయ్యింది. పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్‌ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్‌ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్‌ ప్రధాన పాత్రల్లో ఇందులో నటించారు. ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌లో తమిళ్‌ వర్షన్‌ అందుబాటులో ఉంది.. అయితే తాజాగా తెలుగులో ఎటువంటి ప్రకటన లేకుండా సడన్గా ఎంట్రీ ఇచ్చేసింది. మూవీ స్క్రీనింగ్ రావడంతో చాలామంది అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు.

Also Read :గంగవ్వ ఒక్క రోజుకు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Advertisement

స్టోరీ విషయానికొస్తే..

ఓ భిన్నమైన రొమాంటిక్‌ కామెడీ కథతో ధనుష్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఈ మూవీ ఉంటుంది. ఆర్కే ప్రోడక్షన్స్‌ తో కలిసి ధనుష్‌ సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్‌ ఫిల్మ్స్‌ పథాకంపై ఈ సినిమాను నిర్మించారు.. ఛెఫ్‌గా పనిచేసే యువకుడు ప్రభు కునీలాతోబ్రేకప్ జరుగుతుంది. అయితే ఏడాది తర్వాత కొడుకు బాధ చూడలేక పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఫిక్స్ అవుతారు. దాంతో పెళ్లిచూపులు ఏర్పాటు చేయగా అక్కడ అమ్మాయిని చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత వారిద్దరూ ఒకరి మనసును మరొకరు తెలుసుకొనేందుకు జర్నీని ప్రారంభిస్తారు. ఆ క్రమంలో వారిద్దరి జీవితంలో జరిగిన బ్రేకప్స్ గురించి చెప్పుకొంటారు. ఆ క్రమంలో నీలా పంపిన శుభలేఖను చూసి షాక్ అవుతాడు. తన మాజీ ప్రేయసి పెళ్లికి తన ప్రాణ స్నేహితుడు రవితో కలిసి వెళ్తాడు.. ఆ తర్వాత స్టోరీ ఎన్ని మలుపులు తిరిగిందో అన్నది సినిమాలోనే చూడాలి.. ఫిబ్రవరి 21 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అయితే అందుకుంది. మరి ఓటిటిలో ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

ఇక ధనుష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నాగార్జునతో కలిసి కుబేర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ ఏడాది జూన్ 20న థియేటర్లలోకి రాబోతుందని అనౌన్స్ చేశారు.

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×