Mohan Lal: మోహన్‌లాల్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో వచ్చిన “L2: ఎంపురాన్”, భారీ అంచనాలతో విడుదలై రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తూ 2025లో అత్యంత వేగంగా ₹200 కోట్ల క్లబ్ లో చేరిన మలయాళ చిత్రం గా నిలిచింది.
బాక్సాఫీస్ వసూళ్లు
ఓపెనింగ్ వీకెండ్ (4 రోజులు)
సినిమా విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹170-175 కోట్లు వసూలు చేసి, మలయాళ సినిమా చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లు సాధించింది.
ఐదు రోజుల్లో ₹200 కోట్ల గ్రాస్
సినిమా ఐదు రోజుల్లో ₹200 కోట్ల మార్క్‌ను దాటి, 2025లో అత్యంత వేగంగా 200 కోట్ల క్లబ్ లో చేరిన మలయాళ సినిమాగా నిలిచింది.
ఇండియన్ బాక్సాఫీస్
భారతదేశంలో ఐదు రోజుల్లో ₹70 కోట్ల పైగా వసూలు చేసి, మలయాళ సినిమాల కొత్త రికార్డును క్రియేట్ చేసింది.
రీజనల్ బ్రేక్‌డౌన్ (Net Collections):
ఓవర్సీస్ వసూళ్లు
సినిమా విదేశాలలో నాలుగు రోజుల్లోనే ₹100 కోట్ల మార్క్ దాటి, 2025లో అత్యధిక ఓవర్సీస్ వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.
వివాదాలు & సెన్సార్ కట్స్
ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే కొన్ని సీన్స్ పై ఆడియన్స్ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మొత్తం ఓపెనింగ్ సీక్వెన్స్, పాత్రల పేర్లు, కొన్ని మత పరమైన సీన్స్ ఆడియన్స్ ని బాగా ఇబ్బంది పెట్టాయి. ఈ కారణంగా ఎంపురాన్ సినిమాపై రోజు రోజుకీ విమర్శలు పెరిగాయి. వివాదాలు ఎక్కువ అయ్యి సినిమా కలెక్షన్స్ కి ఇబ్బంది పెట్టే పరిస్థితి నెలకొంది. దీంతో మోహన్ లాల్ ట్వీట్ చేస్తూ సారీ చెప్పాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 కట్స్ వేసారు.
ఇప్పుడు థియేటర్స్ లో సినిమా చూసే వాళ్లకి ఎంపురాన్ ఆ కట్స్ తోనే ప్లే అవుతోంది. ఈ జాగ్రత్త ముందే తీసుకోని ఉంటే సినిమా మరింత ఎక్కువ కలెక్షన్స్ ని రాబట్టేది. లూసిఫర్ వరల్డ్ నుంచి పార్ట్ 3 కూడా రానుందని డైరెక్టర్ పృథ్వీరాజ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసాడు. ఆ పార్ట్ రిలీజయ్యే సమయంలో పెట్టే మీడియా ఇంటరాక్షన్ లో పృథ్వీరాజ్ కి ఇబ్బందులు తప్పవు.