Gangavva : గంగవ్వ.. ఈ పేరు తెలియని వాళ్లు అసలు ఉండరేమో.. కల్మషం లేని మనస్తత్వం, అందరినీ తన వాళ్లు అనే ఆత్మీయత.. ఎప్పుడు నవ్విస్తూ నవ్వుతూ పల్లెతనాన్ని తన చిరునవ్వులో అందరికీ పరిచయం చేసింది గంగవ్వ. ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఈమె యూట్యూబ్లో ప్రభంజనాన్ని సృష్టించింది. తన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బిగ్ బాస్ షోలో అవకాశాన్ని సంపాదించుకునే రేంజ్‌కి గంగవ్వ ఎదిగిందంటే అది మామూలు విషయం కాదు. వయస్సు మీద పడినా సోసైటీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు.
యువకుల ప్రోత్సాహం, తన నిజమైన వ్యక్తిత్వాన్ని యూట్యూబ్ వీడియోల ద్వారా వ్యక్తం చేస్తూ మొదట పల్లె ప్రజల ప్రశంసలు అందుకుంది. అలా మొదలై అంచెలంచెలుగా ఎదిగింది. బిగ్ బాస్ కు ముందు ఒక లెక్క.. తర్వాత ఇంకో లెక్క అన్నట్లు ఎదిగింది. ఇక ఆమె రెమ్యూనరేషన్ గురించి తెలుసుకోవాలని చాలామంది గూగుల్ లో తెగ వెతికిస్తున్నారు. ఇంతకీ గంగవ్వ ఒక్క రోజుకి ఎన్ని వేలు రెమ్యూనరేషన్ తీసుకుంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
Also Read:పవన్ కళ్యాణ్ వల్ల చనిపోవాలనుకున్న.. నేను చేసిన అతి పెద్ద మిస్టేక్..
గంగవ్వ రెమ్యూనరేషన్..
ఈ గంగవ్వ’ మై విలేజ్ షో’ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. నటనపై ఎలాంటి అనుభవం లేకున్నా.. కంటెంట్, డైలాగ్ డెలివరీ, ఎమోషన్స్ ను పలికించడంలో సక్సెస్ అయ్యింది. దాంతో గంగవ్వ అతి తక్కువ కాలంలోనే జిల్లా వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకుంది.. ఆ ఛానల్ కామే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచి అందరి మన్ననలు పొందింది.. ఆ తర్వాత రియాల్టీ షోలో కూడా చేస్తూ వచ్చింది. పలు ఇంటర్వ్యూ చానల్స్ కి హోస్టుగా కూడా వ్యవహరించింది. ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉంది.
ఇంత క్రేజీ ఉన్నందకు నా గంగవ్వ ఒక రోజుకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో అని తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తారున్నారు. నిజానికి ఆమె ఒక రోజుకు 35 వేల నుంచి 50 వేల వరకు తీసుకుంటుందని తెలుస్తుంది. అంటే సినిమాకి పది నుంచి 15 లక్షల వరకు ఆమె తీసుకుంటుందట.. ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా కొనసాగుతున్న నటులు కూడా ఇంతగా తీసుకోవడం లేదు.. బిగ్ బాస్ షో ద్వారా ఆమెకొచ్చిన పాపులారీటితో ఇలా ఇప్పుడు ఆమెపై కాసులు వర్షం కురిపిస్తుందని చెప్పాలి. ఇటీవల బాపు అనే సినిమాలో నటించిన గంగవ్వ ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టులలో నటిస్తుందని సమాచారం.
గంగవ్వ జీవితం..
గంగవ్వ జీవితం గురించి అతి కొద్ది మందికే తెలుసు. ఎన్నో కష్టాలని ఎదుర్కొని ఇప్పుడు అందరి మొహాల్లో నవ్వుని తెప్పిస్తుంది. ఈమె లాంబాడిపల్లిలో నివసిస్తున్న గంగవ్వ 1961లో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయస్సు 62 ఏళ్లు ఉంటుంది. ఏమి చదువుకోని గంగవ్వ పల్లె పాఠాలను మాత్రం నేర్చుకుంది. స్వచ్ఛమైన మనస్సు, సాయం చేసే గుణం, ముక్కుసూటితనం, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే తత్వం, అందరూ నా వాళ్లే అని ఆత్మీయంగా పలకరిస్తుంది. చిన్న వయస్సులోనే వివాహామైంది. ఆమెకు మొత్తం నలుగురు సంతానం. ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. ఒక కూతురు దురదృష్టవశాత్తు చనిపోవడం బాధాకరం. ఆ బాధలను గుండెల్లో దాచుకొని ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.