Dry Skin Tips: వేసవి కాలంలో చర్మాన్ని సరిగ్గా చూసుకోవడం చాలా ముఖ్యం. జాగ్రత్త తీసుకోకపోతే, మొటిమలు, అనేక ఇతర రకాల సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఇప్పుడు.. వేడిగాలులు ప్రారంభం కావడం వల్ల మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ తమ చర్మ రకాన్ని బట్టి చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
నిజానికి.. పొడి చర్మం ఉన్నవారు వేసవిలో పెద్దగా జాగ్రత్త తీసుకోవలసిన అవసరం లేదని అనుకుంటారు, కానీ అది అలా కాదు. డ్రై స్కిన్‌తో ఉన్నవారు తప్పకుండా సమ్మర్ లో కొన్ని రకాల టిప్స్ ఫాలో అవ్వాలి.
మాయిశ్చరైజర్ తప్పనిసరి:
సమ్మర్‌లో ముఖం చెమట పడుతుంది. కాబట్టి మాయిశ్చరైజర్ రాసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటారు. కానీ ఇలా అనుకుంటే పొరపాటే.. పొడి చర్మం ఉన్నవారు వేసవిలో నూనె లేని మాయిశ్చరైజర్ వాడాలి. షియా బటర్, కలబంద, హైలురానిక్ యాసిడ్ ఉన్న మాయిశ్చరైజర్లు మీ చర్మాన్ని తేమగా ఉంచుతాయి. మాయిశ్చరైజర్లు చర్మానికి తగిన పోషణను అందిస్తాయి. వీటిలోని లక్షణాలు సమ్మర్ లోనూ చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. అందుకే సమ్మర్ లో మాయిశ్చరైజర్ వాడటం తప్పనిసరి అని గుర్తించాలి.
మీ ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోండి:
పొడి చర్మం ఉన్నవారు రోజుకు కనీసం రెండుసార్లు ముఖం కడుక్కోవాలి. మీరు మీ ముఖాన్ని సరిగ్గా కడుక్కుంటే.. ముఖం మీద పేరుకుపోయిన మురికి శుభ్రమవుతుంది. ఆ తర్వాత మీ చర్మం మొటిమల వంటి సమస్యలకు గురవుతుంది. అందుకే.. మీరు తరచుగా ముఖం కడుక్కోవడం ముఖ్యం.
సన్‌స్క్రీన్ అవసరం:
మీకు పొడి చర్మం ఉంటే.. ఖచ్చితంగా మీ చర్మంపై సన్‌స్క్రీన్‌ను ఉపయోగించండి. ఈ మండే వేసవి కాలంలో కనీసం SPF 40 ఉన్న సన్‌స్క్రీన్‌ను ఉపయోగించండం మంచిది. మీరు ఇలా చేయకపోతే, సూర్యుని హానికరమైన కిరణాల వల్ల మీ చర్మం మరింత దెబ్బతింటుంది. అందుకే సన్ స్క్రీన్ వాడటం మంచిది. ముఖ్యంగా సమ్మర్ లో ఎక్కువగా బయట తిరిగే వారు డ్రై స్కిన్ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడతారు.
ఫేస్ మాస్క్ :
వేసవి కాలంలో.. మీ ముఖాన్ని హైడ్రేట్ గా ఉంచే ఫేస్ మాస్క్ ఉపయోగించండి. ఈ మాస్క్ తయారు చేసుకోవడానికి, కలబంద జెల్ , తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అంతే కాకుండా స్కిన్ పొడిబారడాన్ని తొలగిస్తుంది. అలోవెరా జెల్ లోని పోషకాలు చర్మానికి తగిన పోషణను అందిస్తాయి.అంతే కాకుండా ఇవి గ్లోయింగ్ స్కిన్ కోసం ఉపయోగపడతాయి.
Also Read: ఖాళీ కడుపుతో చెరుకు రసం తాగితే.. ఏమవుతుంది ?
సరైన సీరం ముఖ్యం:
వేసవి కాలంలో ముఖం మీద సరైన సీరం వాడటం ముఖ్యం . దీని కోసం.. ఎల్లప్పుడూ హైడ్రేటింగ్ సీరం ఉపయోగించండి. హైడ్రేటింగ్ సీరం వాడటం వల్ల మీ చర్మానికి మరింత తేమ లభిస్తుంది. ఫేస్ సీరం గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సమ్మర్ లో వచ్చే డ్రై స్కిన్ సమస్యను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది.