OTT Movie : గ్రామీణ పంజాబ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా జగ్గి అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. అతనికి వయసులో వచ్చే ఫీలింగ్స్ రాకపోవడంతో అసలు స్టోరీ మొదలవుతుంది. ఈ సినిమా అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో అవార్డులను కూడా గెలుచుకుంది. దాని కథాంశం, రామనీష్ చౌదరి (జగ్గి) అద్భుతమైన నటనకు ప్రశంసలు కూడా వచ్చాయి. దీనిని రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే …
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ పంజాబీ డ్రామా సినిమా పేరు ‘జగ్గి’ (Jaggi). 2021లో విడుదలైన ఈ సినిమా అన్మోల్ సిధు దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రంలో రామనీష్ చౌదరి, హర్మన్‌దీప్ సింగ్, గౌరవ్ కుమార్, షివమ్ కాంబోజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఒక హృదయవిదారక బో*ల్డ్ సినిమా. ఇది ప్రస్తుతం MUBI, Amazon Prime Video లలో స్ట్రీమింగ్ అవుతుంది. 117 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 7.6/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
జగ్గి కథ పంజాబ్‌లోని ఒక గ్రామీణ ప్రాంతంలో జరుగుతుంది. ఇక్కడ జగ్గి (రామనీష్ చౌదరి) ఒక స్కూల్ కి వెళ్లే కుర్రాడు. తన జీవితంలో ఎన్నో భయంకరమైన బాధలను ఎదుర్కొంటాడు. తన కుటుంబానికి చెందిన 12 ఎకరాల వ్యవసాయ భూమిని చూసుకుంటూ ఉంటాడు. అతని తండ్రి ఒక తాగుబోతు పోలీసు ఆఫీసర్. అతని తల్లి తన బావతో (తండ్రి బావమరిది) ఎఫైర్‌లో ఉంటుంది. అయితే ఇది గ్రామంలో అందరికీ తెలిసిన విషయమే. ఈ విషాదకరమైన కుటుంబ వాతావరణంలో, జగ్గి ఒంటరిగా, మానసికంగా బలహీనంగా ఉంటాడు. అంతేకాకుండా జగ్గి మరో సమస్యతో కూడా బాధపడుతుంటాడు.
అతను యవ్వనంలో కి అడుగుపెట్టినా, కోరికలు కలగట్లేదని భయపడతాడు. ఈ సమస్యను అతను తన స్కూల్‌లోని ఒక స్నేహితుడితో పంచుకుంటాడు. కానీ ఈ నమ్మకం అతని జీవితాన్ని నాశనం చేస్తుంది. అతని స్నేహితుడు ఈ విషయాన్ని స్కూల్‌లో అందరికీ చెప్పేస్తాడు. ఇక అందరూ జగ్గిని స్వలింగ సంపర్కి (gay) అని పిలుస్తూ వేధించడం మొదలుపెడతారు. ఈ వేధింపులు కేవలం మాటలతో ఆగవు. స్కూల్‌లోని సీనియర్లు, ఒక టీచర్ కూడా జగ్గితో అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఒక సన్నివేశంలో ఇద్దరు సీనియర్లు అతన్ని ఒక వంతెన కిందకు తీసుకెళ్లి, అతనిపై దాడి చేస్తారు. ఈ దౌర్జన్యం ఒక్కసారితో ఆగదు. ఇది పదేపదే జరుగుతుంటుంది. జగ్గిని మానసికంగా, శారీరకంగా కుంగిపోయేలా చేస్తుంది. జగ్గి తన సమస్యను ఎవరితోనూ పంచుకోలేడు. ఎందుకంటే తన గ్రామంలో ఎవరూ అర్థం చేసుకోరనే భయం.
Read Also : సండే ఆఫీస్ పేరుతో బాస్ నిర్వాకం… భర్త దగ్గర ప్రైవేట్ వీడియో లీక్… హీరోయిన్ చేసే పనికి మైండ్ బ్లాక్
అతని తల్లి తన ఎఫైర్‌లో మునిగిపోయి ఉంటుంది. తండ్రి తాగుడులో మునిగిపోయి ఉంటాడు. జగ్గి స్కూల్‌ను వదిలేసి, తన కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిలో పని చేసుకుంటూ ఉండగా, అక్కడ కూడా అతని భూమిలో పనిచేసే కార్మికుడు అతన్ని బలవంతం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ నిరంతర దౌర్జన్యం జగ్గిని పూర్తిగా ఒంటరిగా నిస్సహాయంగా చేస్తుంది. అతను తన అసమర్థతను అధిగమించడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. సమాజం అతన్ని మగతనం లేని వ్యక్తిగా చూస్తుంది. కథ క్లైమాక్స్‌లో జగ్గి ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. జగ్గి పెళ్ళి చేసుకుంటాడా ? అతని సీక్రెట్ బయటపడుతుందా ? క్లైమాక్స్ ఎలాంటి మలుపు తిరుగుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ పంజాబీ సినిమాను మిస్ కాకుండా చుడండి.