OTT Movie : సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలు చూస్తున్నప్పుడు మరో ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఈ సినిమా నిజంగానే మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అవును నిజమే! ఇందులో ఓకే అద్దం ద్వారా వేరే విశ్వానికి ట్రావెల్ చేయవచ్చు. మన టైమ్ కి అక్కడ ఉండే టైమ్ కి చాలా తేడాఉంటుంది. ఈ సినిమా ఒక మల్టీవర్స్ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ ఒక అద్దం ద్వారా వేరే వేరే విశ్వాలకు (parallel universes) ప్రయాణించవచ్చు. కానీ దీని వినియోగం ఊహించని, ప్రమాదకరమైన పరిణామాలను తెస్తుంది. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ అభిమానులకు ఒక మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమాపేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …
మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘పారలల్’ (Parallel) 2018లో విడుదలైన కెనడియన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా. ఇది ఇసాక్ ఎజ్బన్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రంలో అమ్ల్ అమీన్ (డెవిన్), మార్టిన్ వాల్‌స్ట్రోమ్ (నోయెల్), జార్జియా కింగ్ (లీనా), మార్క్ ఓ’బ్రయన్ (జోష్), అలిస్సా డయాజ్ (కార్మెన్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆహా, ప్రైమ్ వీడియో, ట్యూబీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. 1 గంట 44 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 5.9/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ సినిమా ఒక ఆసక్తికరమైన సన్నివేశంతో మొదలవుతుంది. ఒక వృద్ధ దంపతులు రాత్రి నిద్రపోతుంటారు. ఒక కుక్క కేకలు విని వృద్ధురాలు మేల్కొని, కుక్కను చూడటానికి బయటకు వెళ్తుంది. కుక్క సురక్షితంగా ఉన్నప్పటికీ, ఒక ముసుగు ధరించిన వ్యక్తి ఆమెను చంపేస్తుంది. ఆ ముసుగు తీస్తే, ఆ వ్యక్తి ఆమె కాపీ (డూప్లికేట్)గా కనిపిస్తుంది. ఈ డూప్లికేట్ ఆమె దుస్తులు ధరించి, భర్త పక్కన తిరిగి పడుకుంటుంది. ఈ సన్నివేశం కథ మల్టీవర్స్ థీమ్‌ను చూపిస్తుంది.
ఈ సీన్ తర్వాత స్టోరీ నలుగురు స్నేహితులైన డెవిన్, నోయెల్, లీనా, జోష్‌ల చుట్టూ తిరుగుతుంది. వీరు కలిసి ఒక సాఫ్ట్‌వేర్ స్టార్టప్‌ను నడుపుతూ, ఒక పార్కింగ్ యాప్‌ను డెవలప్ చేస్తూ ఉంటారు. వీరు ఇన్వెస్టర్లకు తమ యాప్ గురించి పిచ్ చేస్తారు. కానీ వీరి ఐడియాను సేథ్ అనే మాజీ ప్రోగ్రామర్ దొంగిలించడంతో, ఇన్వెస్టర్లు వీరికి డెడ్ లైన్ ఇస్తారు. నిరాశతో వీళ్ళు ఒక బార్‌లో సమావేశమై, తమ ఇంటి గురించి ఒక రూమర్‌ను తెలుసుకుంటారు. ఆ ఇల్లు హాంటెడ్ అని, మునుపటి యజమాని రహస్యంగా అదృశ్యమయ్యాడని తెలుసుకుని షాక్ అవుతారు.
ఇంటికి తిరిగి వచ్చిన నలుగురు స్నేహితులు, తమ యాప్‌ను సమయానికి పూర్తి చేయడం అసాధ్యమని వాదిస్తారు. ఈ వాదనలో జోష్, డెవిన్ మధ్య గొడవ జరుగుతుంది, దీనిలో ఒక గోడ దెబ్బతింటుంది. ఈ గోడ వెనుక ఒక సీక్రెట్ గది బయటపడుతుంది. ఇందులో ఒక వింత అద్దం ఉంటుంది. జోష్ ఈ అద్దంలోకి అడుగుపెట్టి, అది సమాంతర విశ్వాలకు ఒక పోర్టల్ అని కనుగొంటాడు. అతను కొన్ని సెకన్లలో తిరిగి వస్తాడు. కానీ అతను ఆ విశ్వంలో 15 నిమిషాలు గడిపినట్లు చెబుతాడు. నోయెల్ ఈ అద్దం నియమాలను కనిపెడతాడు. అద్దం ఒక నిర్దిష్ట కోణంలో ఉండాలి. ఒకసారి అద్దంలోకి వెళితే, మరొక సమాంతర విశ్వంలోకి చేరుతారు. అక్కడ గడిపిన సమయం ఈ ప్రపంచంలో కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.
Read Also : ఊళ్ళో వరుస హత్యలు… పౌర్ణమి వచ్చిందా గ్రామం వల్లకాడే… ఆస్కార్ విన్నింగ్ హర్రర్ మూవీ
నలుగురూ ఈ అద్దాన్ని తమ యాప్‌ను పూర్తి చేయడానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే మరో విశ్వంలో ఎక్కువ సమయం గడపవచ్చు. ఈ సమయాన్ని వయోగించి వారు యాప్‌ను పూర్తి చేసి, ఇన్వెస్టర్లకు అందిస్తారు. కానీ ఈ అద్దం యొక్క శక్తిని వారు తమ వ్యక్తిగత కోరికల కోసం ఉపయోగించడం మొదలవుతారు. లీనా ఇతర విశ్వాల నుండి కళాకృతులను దొంగిలిస్తుంది. డెవిన్ తన తండ్రిని కనుగొనడానికి ఒక సమాంతర విశ్వంలోకి వెళ్తాడు. నోయెల్ ఇతర విశ్వాల నుండి టెక్నాలజీని దొంగిలించి, స్టార్టప్‌ను మరింత లాభదాయకంగా చేయాలనుకుంటాడు. జోష్ ఒక అమ్మాయితో సంబంధం కోసం విశ్వాలను మారుతాడు.
కానీ ఈ అద్దం ఉపయోగం ప్రమాదకరమైన పరిణామాలను తెస్తుంది. నోయెల్ రహస్యంగా డెవిన్, లీనాలను గమనిస్తుంటారు. వారి మధ్య విశ్వాసం దెబ్బతింటుంది. ఒక రోజు డెవిన్ కొనిపించకుండా పోతాడు. తన తండ్రిని వెతకడానికి వెళ్లినట్లు నోయెల్ చెబుతాడు. కానీ లీనా డెవిన్ ఫోన్‌ను చెత్తలో గుర్తించి, అతని కదలికలను ట్రాక్ చేస్తుంది. ఒక సరస్సు ఒడ్డున ఉన్న క్యాబిన్‌కు చేరుకుంటుంది. అక్కడ నోయెల్ నిజమైన డెవిన్‌ను చంపి, మరో విశ్వం నుండి మరొక డెవిన్‌ను తీసుకొచ్చినట్లు లీనా కనుగొంటుంది. ఈ కొత్త డెవిన్‌కు నిజమైన డెవిన్ కు ఉన్న జ్ఞాపకాలు ఉండవు. లీనాతో అతను గడిపిన సన్నిహిత క్షణాలను కూడా మరచిపోతాడు.
ఇదే సమయంలో, జోష్ మానసికంగా బలహీనంగా మారుతాడు. ఎందుకంటే అతను ఈ విశ్వాల మధ్య జరిగే మార్పులను అర్థం చేసుకోలేడు. అతను నోయెల్‌ను తుపాకీతో బెదిరిస్తాడు. కానీ సంఘటనలు మరింత గందరగోళంగా మారతాయి. చివరి అంకంలో, ఒక ట్విస్ట్ బయటపడుతుంది. లీనా కూడా సమాంతర విశ్వం నుండి వచ్చిన ఆల్ట్-లీనాగా ఉండవచ్చని సూచనలు వస్తాయి. ఇది ఒక గ్యాస్ స్టేషన్ బాత్‌రూమ్‌లోని అద్దం ద్వారా రావడం ద్వారా తెలుస్తుంది. సినిమా ఒక ఓపెన్-ఎండెడ్ నోట్‌తో ముగుస్తుంది. వేరే విశ్వాల వల్ల వచ్చే గందరగోళాలను ప్రేక్షకులకు వదిలివేస్తుంది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మల్టీవర్స్ అభిమానులకు ఒక ఆలోచనాత్మక అనుభవాన్ని అందిస్తుంది.