BigTV English

Janowar Movie : పుట్టినరోజు ఆఖరి రోజుగా మారితే… తల్లి కూతుర్లను దారుణంగా …

Janowar Movie : పుట్టినరోజు ఆఖరి రోజుగా మారితే… తల్లి కూతుర్లను దారుణంగా …

Janowar Movie : కొంతమంది అపరిచితుల వల్ల కుటుంబాలే నాశనం అవుతూ ఉంటాయి. అమాయకుల జీవితాలతో ఆడుకునే ఇటువంటి నేరస్తులను ఏం చేసినా తప్పులేదు. ఒక దొంగల ముఠా, ఓ కుటుంబం పై జరిపిన అఘాయిత్యంతో ఒక మూవీ స్టోరీ తెరకెక్కింది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ఫ్లెక్స్ (Plex) లో

2021లో విడుదలైన ఈ  బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘జానోవర్’ (Janowar). దీనికి రైహాన్ రఫీ దర్శకత్వం వహించారు. 23 ఏప్రిల్ 2020న గాజీపూర్‌లో జరిగిన దోపిడీ, సామూహిక అత్యాచారం, హత్యల నిజమైన కథ ఆధారంగా ఈ మూవీ రూపొందించబడింది. తస్కీన్ రెహమాన్ , రషెద్ మామున్ అపు, ఎలినా షమ్మీ, జంషెడ్ షమీమ్, ఫర్హాద్ లిమోన్, మున్మున్ అహ్మద్ ఈ మూవీలో నటించారు. ఆగస్టు 2020 లో ఢాకాలో పక్షం రోజుల పాటు చిత్రీకరణ జరిగింది. జనోవర్ 14 జనవరి 2021 న సినిమాటిక్‌లో విడుదలైంది. మార్చి 2021 లో అత్యధికంగా వీక్షించబడిన మూవీగా జానోవర్ నిలిచింది . ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఫ్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే

ఒక ఇంటి దగ్గరికి పోలీస్ వ్యాన్ వచ్చి ఆగుతుంది. లోపల ఆ పరిస్థితిలో ఉన్న ఆడవాళ్ళని చూసి ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు. హాల్లో ఒకరు, బెడ్రూంలో మరొకరు, కిచెన్ లో ఇంకొకరు చాలా భయపడుతూ ఉంటారు. పోలీసులను చూడగానే దగ్గరికి రావద్దు అంటూ ఏడుస్తుంటారు. వాస్తవానికి ఆరోజు ఆ ఇంట్లో ఆవరిన్ అనే చిన్న పిల్ల పుట్టినరోజు ఉంటుంది. అమ్మాయి లేచి ఇంట్లో వాళ్ళు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో ఆ ఇంట్లోకి ఐదుగురు అగంతకులు దొంగతనానికి చొరబడతారు. ఆ ఇంట్లో ఆవరిన్ కి నూరి అనే అక్కతో పాటు ఫాతిమా అనే తల్లి ఉంటుంది. ఆవరిన్ గొంతు మీద కత్తి పెట్టి దొంగలు బెదిరిస్తారు. ఫాతిమా భయపడి తమ దగ్గర ఉన్న డబ్బుతో పాటు నగలు కూడా ఇచ్చేస్తుంది. ఇవి సరిపోవు అంటూ ఇంకా కావాలని బెదిరిస్తారు దొంగలు. వాళ్ల దగ్గర ఇక లేవని తెలుసుకొని, తినడానికి ఏమైనా చేయాలని చెప్తారు.

ఆ తర్వాత వీళ్ళకు ఒక దురాలోచన పుడుతుంది. కొత్త బట్టలు వేసుకుని డాన్స్ చేయాలని చెప్తారు. వాళ్లు భయపడి అలాగే డాన్స్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ ఐదుగురు కలిసి దారుణంగా వాళ్లపై అఘాయిత్యం చేస్తారు. నిజానికి పోలీసులు వచ్చేలోపే వీళ్ళు చనిపోయి ఉంటారు. వాళ్లు బతికుంటే గుర్తుపట్టి పోలీసులకు చెప్తారని ఆ దొంగలు చంపేస్తారు. ఆ నేరస్తుల్లో ఒక తండ్రి, కొడుకులు కూడా ఉంటారు. అక్కడ ఇదంతా అలా జరిగినట్టుగా ఇన్స్పెక్టర్ ఊహించుకుంటూ ఉంటాడు. ఈ క్రైమ్ జరిగిన ఆరు నెలల లోపే నిందితులను పోలీసులు పట్టుకుంటారు. ఇటువంటి నేరస్తులను అప్పటికప్పుడే ఉరి తీసే రోజులు రావాలి. ఈ మూవీని చూడాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ ఫ్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×