OTT Movie : టైం ట్రావెల్ సినిమాలు చాలానే వచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఈ సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరించారు. హాలీవుడ్ నుంచి వచ్చిన టైం ట్రావెల్ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కామెడీ కంటెంట్ తో నవ్విస్తూ సరదాగా సాగిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ టైం ట్రావెల్ మూవీ పేరు ‘కేస్ డిపార్ట్’ (Case Depart). ఇద్దరు అన్నదమ్ములు టైం ట్రావెల్ చేసి 17వ శతాబ్దానికి వస్తారు. వస్తే వచ్చారు కానీ వీళ్లు బ్రిటిష్ వాళ్ల చేతిలో బందీలు అవుతారు. 2011లో విడుదలైన ఈ ఫ్రెంచ్ కామెడీ మూవీకి, లియోనెల్ స్టెక్టీ, ఫాబ్రిస్ ఎబౌ, థామస్ ఎన్’గిజోల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఇద్దరు అన్నదమ్ములు పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. అన్న ఒక మంచి కంపెనీలో సెటిల్ అయి ఉంటాడు. తమ్ముడు మాత్రం జాబ్ లేక నల్లగా ఉండటంతో, జాతి వివక్షను ఎదుర్కొంటూ ఉంటాడు. ఒకరోజు తండ్రికి అనారోగ్యం కారణంగా, చావు బతుకుల మధ్య ఉంటాడు. అతని దగ్గరికి వెళ్లడానికి వీళ్లకు మనసు ఒప్పదు. ఎందుకంటే అతని తండ్రికి చాలామంది భార్యలు ఉంటారు. ఆ కారణం చేతనే అక్కడికి వెళ్లడానికి సందేహిస్తూ ఉంటారు. వీళ్ళ భార్యలు సర్ది చెప్పి తండ్రి దగ్గరకి పంపుతారు. అక్కడికి వెళ్ళాక తండ్రి వీళ్లకు వారసత్వంగా తన దగ్గర ఉన్న ఆస్తులు ఇస్తానంటూ ఒక పేపర్ ఇస్తాడు. నిజానికి ఆ పేపర్ ఒక బ్రిటిష్ అగ్రిమెంట్. 17వ శతాబ్దంలో బానిసలను విముక్తి చేసే అగ్రిమెంట్ పేపర్ కావడంతో, అన్నదమ్ములు ఆ పేపర్ ఎందుకు పనికిరాదని చించి పారేస్తారు. అది చూసిన తండ్రి భార్యల్లో ఒకరు వీళ్లకు బుద్ధి చెప్పాలనుకుంటుంది. దాని విలువ తెలియాలని, టైం ట్రావెల్ ద్వారా అన్నదమ్ములను 17వ శతాబ్దానికి పంపుతుంది.
వాళ్లు ఎక్కడికి వచ్చారు, ఎలా వచ్చారు అర్థం కాక ఉంటారు. అక్కడికి కొంతమంది వచ్చి వాళ్లను బందీలు చేస్తారు. తమ్మున్ని బయట వ్యవసాయం చేసే పనిలో పెడతారు. అన్నను వంట చేసే పనిలో పెడతారు. కొద్దిరోజులు ఆ హింస భరించలేక పారిపోవాలని ప్రయత్నిస్తారు. ఎవరైతే వీళ్ళని టైమ్ ట్రావెల్ చేసి పంపించారో, ఆమె అక్కడికి వచ్చి తప్పించుకొనే మార్గం చెప్తుంది. అందులో తమ పూర్వీకులు ఉన్నారని, వాళ్ల ప్రేమను కలిపితే ఇక్కడి నుంచి బయటపడతారని చెప్పి వెళ్ళిపోతుంది. అలా వాళ్ళిద్దరూ మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. చివరికి ఈ అన్నదమ్ములు మళ్లీ టైం ట్రావెల్ ద్వారా బయటికి వస్తారా? బ్రిటిష్ వాళ్ళ చేతిలోనే బంధీలవుతారా? వీళ్ళ తండ్రి బానిస విడుదల అగ్రిమెంట్ పత్రం ఎందుకు ఇచ్చినట్టు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడాల్సిందే.