BigTV English

OTT Movie : ఇది అమ్మాయి కాదురా మావా ఆడ పిశాచి… అది తెలియక చొంగ కార్చి అడ్డంగా బుక్కయ్యే అమాయకుడు

OTT Movie : ఇది అమ్మాయి కాదురా మావా ఆడ పిశాచి… అది తెలియక చొంగ కార్చి అడ్డంగా బుక్కయ్యే అమాయకుడు

OTT Movie : రోజుకో హర్రర్ మూవీ చూడందే నిద్ర పట్టని హర్రర్ మూవీ లవర్స్ ఈరోజుల్లో ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా ఓటిటిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ అలవాటు అడిక్షన్ గా మారిపోయింది. అలా తమ సబ్స్క్రైబర్లను ఎంటర్టైన్ చేయడానికి ఓటీటీ లు కూడా హర్రర్ జనరల్ లో కొత్త కొత్త సినిమాలను ఓటిటిలోకి తీసుకొస్తున్నాయి. అలాంటి అదిరిపోయే ఓ హర్రర్ మూవీని ఈరోజు మన మూవీ సజెషన్లో చెప్పుకోబోతున్నాం. అయితే ఈ హర్రర్ మూవీ కాస్త హద్దులు దాటి ఉంటుంది. కాబట్టి ఈ మూవీని సింగిల్ గా ఉన్నప్పుడు చూస్తేనే మంచిది. మరి ఈ మూవీ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో

ఈ హర్రర్ మూవీ పేరు ‘జెనీఫర్స్ బాడీ’ (Jennifer’s Body). ఇందులో మనుషుల్ని చంపి, ఫ్రిజ్లో పెట్టుకొని తినే ఆడదయ్యం ఒకటి ఉంటుంది. ఈ సినిమా ఇద్దరూ ఫ్రెండ్స్ అయిన టీనేజర్స్ చుట్టూ తిరుగుతుంది. అయితే ఓ అబ్బాయి తనను ఆకలిగా చూసే అమ్మాయిని, మోసం చేద్దామని పెద్ద ప్లాన్ వేస్తాడు. కానీ తీరా టైం వచ్చాక అది అమ్మాయి కాదు ఆడ దయ్యం అని తెలుసుకొని బలైపోతాడు. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళ్తే…

జెనీఫర్, నీడి అనే ఇద్దరు టీనేజ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరమ్మాయిలు హైస్కూల్లో చదువుతూ ఉంటారు. అయితే జెనీఫర్ అబ్బాయిలతో అంత క్లోజ్ గా మెదగలేక పోతుంది. కానీ సడన్ గా ఆ అమ్మాయి అబ్బాయిలను ఆకలితో చూడడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఒక ఆత్మ జెనీఫర్ ని ఆవహిస్తుంది. దీంతో ఈ అమ్మాయి పూర్తిగా మారిపోతుంది. హాట్ గా తయారు అవ్వడమే కాకుండా, చూడగానే అబ్బాయిలని ఆకర్షిస్తుంది. ఇక మనుషుల మాంసం ఇష్టపడే ఆ దయ్యం, టైం చూసుకుని ఒక్కొక్కడిని చాటుకు తీసుకెళుతుంది. అమ్మాయి కదా అని చొంగ కార్చుకుంటూ మాటకు వెళ్ళిన అబ్బాయిలు ఆ తర్వాత కనిపించకుండా పోతారు. విచిత్రం ఏంటంటే ఈ రాక్షసి అబ్బాయిలందరినీ చంపేసి, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మరీ తింటుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఓ అబ్బాయి ఈ అమ్మాయి వలలో పడతాడు.

అయితే జెనీఫర్ని ప్రేమ పేరుతో తనతో పాటు తీసుకెళ్లి ఏకాంతంగా గడపాలని ప్రయత్నిస్తాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళాక ఇది అమ్మాయి కాదు ఆడ దెయ్యం అని తెలుస్తుంది. ఇక ఆ అబ్బాయి పని కూడా పూర్తి చేస్తుంది. మరోవైపు నీడి ఇదంతా గమనిస్తూ ఉంటుంది. మొత్తానికి జరిగిన విషయం తెలుసుకొని ఈ మారణ హోమాన్ని ఎలాగైనా సరే అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది నీడి. మరి చివరికి నీడి, జెన్నీఫర్ కి పట్టిన దయ్యాన్ని ఎలా వదిలించింది? ఆ దయ్యం ఎందుకు అబ్బాయిలనే టార్గెట్ చేస్తోంది? అనే విషయాలను తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఇక సినిమాలో సింగిల్ గా చూడాల్సిన ఘాటు సీన్లు కూడా గట్టిగానే ఉంటాయి.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×