E-Paper
Advertisement

సుధీర్ కి వర్షిణి స్ట్రాంగ్ కౌంటర్.. అండగా త్రిగుణ్!

సుధీర్ కి వర్షిణి స్ట్రాంగ్ కౌంటర్.. అండగా త్రిగుణ్!
Advertisement

Bigg Boss 10: దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో దీపావళి సెలబ్రేషన్స్ చాలా సంబరంగా సాగాయి. నిన్నటి ఎపిసోడ్లో కంటెస్టెంట్లకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన నాగార్జున.. నేటి ఎపిసోడ్లో సంబరాలు అంబరాన్ని అంటాయి.. ఇకపోతే తాజాగా 63వ రోజుకు సంబంధించి విడుదల చేసిన మొదటి ప్రోమోలో హౌస్ మేట్స్ అందరూ సరదాగా ఆటలు, పాటలతో సందడి చేశారు. తాజాగా విడుదల చేసిన రెండవ ప్రోమోలో కంటెస్టెంట్స్ ఒకరి మోసాన్ని మరొకరు బయటపెట్టి హాట్ టాపిక్ గా మారారు.

నీతూ మాస్టర్ లో పసలేదన్న వంశీ..

హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ.. ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు బిబి సినిమా. ఇక్కడ కొన్ని పోస్టర్స్ ఉన్నాయి.. ప్రతి దాని మీద ఒక టైటిల్ ఉంది. ఆ టైటిల్ హౌస్ మేట్స్ లో ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నారో చెప్పి ఎందుకో కూడా కారణం చెప్పాలి అంటూ నాగార్జున తెలిపారు. వంశీ నీతూ మాస్టర్ కి “ఫస్ట్ వీక్ ఫైర్.. నెక్స్ట్ వీక్ ఎక్స్పైర్” అనే టైటిల్ ఇచ్చారు. ఆమె హౌస్ లోకి వచ్చిన రోజు అమ్మో అనిపించింది. పైగా మొదటి వారంలో ఆమె ఫైర్ మీద ఉండి ఆటలో కూడా సత్తా చాటారు. కానీ నెక్స్ట్ వీక్ నుంచి కనిపించలేదు అంటూ కామెంట్ చేశారు.

త్రిగుణ్ కి అలాంటి ట్యాగ్..

Advertisement

ఆ తర్వాత ముఖేష్.. త్రిగుణ్ కి “వాల్యూమ్ ఫుల్.. వ్యాలీడ్ పాయింట్ నిల్లు”అనే ట్యాగ్ ఇస్తూ.. తన కారణాన్ని తెలిపారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అందరి దగ్గర గొడవ చేస్తుంటాడు. వాల్యూమ్ రైజ్ చేసి మాట్లాడుతాడు. నా దగ్గరకు వచ్చాక ఏ పాయింట్స్ లో కూడా వ్యాలీడ్ గా మాట్లాడడు. నా అభిప్రాయం ప్రకారం నా విషయంలో వ్యాలీడ్ పాయింట్ నిల్లు అంటూ తెలిపారు.

వర్షిణితో పాటూ నన్ను కలిపి కాటేశాడు – ముఖేష్

ఆ తర్వాత సుధీర్ వర్షిణికి “ప్రజెంట్స్ ఉంది.. పర్పస్ లేదు” అంటూ ట్యాగ్ ఇచ్చాడు. ప్రజెంట్స్ ఎక్కువ ఉంటుంది సార్ కానీ కొన్నిసార్లు నాకు పర్పస్ అనిపించలేదు అన్నాడు. హోస్ట్ నాగార్జున వర్షిని ఎందుకు నువ్వు మాట్లాడడం లేదు అని ప్రశ్నించగా.. ఫ్యామిలీ నుంచి వెళ్లిపోయారు కదా సార్.. మా మీద ఏదో ఒక సేఫ్ అనుకొని వేశాడు సార్. అతను ఏంటో నాకు తెలుసు.. మీరు నాకు ఫస్ట్ వారంలో చెప్పారు కదా.. ఏదో ఒక సందర్భంలో నిన్ను కూడా కాటేస్తాడు అని వర్షిణి చెబుతుండగానే ముఖేష్ మాట్లాడుతూ నన్ను కూడా కలిపి కాటేశాడు అంటూ కామెంట్ చేశారు.

Advertisement

also read: విమర్శకులకు నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్.. నిరూపిస్తే రూ.కోటి ఇస్తానంటూ!

ముఖేష్ మోసగాడా?

తర్వాత త్రిగుణ్.. ముఖేష్ కి “స్నేహం నా పేరు..మోసం నా ఊరు ” అనే టైటిల్ ఇచ్చాడు. ఉన్నంతవరకు సుధీర్ తో బాగా స్నేహంగా ఉన్నాడు. అవసరమైపోయాక ఎలా తిప్పాలి? ఏంటి? అనే ఆట ఆడుతాడు సార్ అంటూ కామెంట్ చేశారు. నిజానికి వాల్యూమ్ ఫుల్.. వ్యాలీడ్ పాయింట్ నిల్లు ఇది కూడా ఇద్దామనుకున్నాను. కుదిరితే రెండు పెట్టేవాడిని అని చెప్పగానే ముఖేష్ మాట్లాడుతూ అందులో నువ్వే తోపు అంటూ కౌంటర్ ఇచ్చాడు. మొత్తానికైతే ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు.

Related News

దీపావళి స్పెషల్.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఊహించని సర్ప్రైజ్!

ఫస్ట్ టైమ్ నాగ్ చేత తిట్లు తిన్న నరేష్.. కన్నీళ్ల వెనుక అసలేం జరిగిందంటే?

Karthika Deepam 2 Serial Today Episode November 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఇంట్లో వాళ్లతో చాలెంజ్ చేసిన జ్యోత్స్న 

Podarillu Today Episode : ముద్దులతో రెచ్చిపోయిన జంటలు.. పాపం చక్రీ.. మహాకు ముద్దుపెడతాడా..?

Brahmamudi Serial Today Episode November 8th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  ఇంట్లో మార్పులకు రాజు  శ్రీకారం – అయోమయంలో రేఖ

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న రమ్య .. పల్లవికి మరో షాక్.. రమ్యను కొట్టిన పల్లవి..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి అడ్డంగా ఇరుక్కుంటుందా..? అడ్డంగా బుక్కయిన అరుణ్.. హైలెట్ సీన్ ఇదే..

Big Stories

Advertisement
×