Heroine : చాలామంది హీరోయిన్లు మెగా హీరోలని ఇష్టపడుతూ ఉంటారు. వాళ్లతో సినిమా చేయాలని ఆశ పడతారు. మరి కొంతమంది వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లైతే మెగా హీరోలంటే మాకు చాలా ఇష్టం అన్నట్టు పబ్లిక్ గానే చెప్పేస్తున్నారు. మెగా హీరోలా క్రేజ్ అలాంటిది మరి. హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా మెగాస్టార్ హీరోలు అంటే పడి చచ్చిపోతున్నారు. తాజాగా ఆ కోవలోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది. ఆమెకి పవన్ కళ్యాణ్ అలాగే అల్లు అర్జున్ అంటే పిచ్చి అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసిద్ది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరని ఆలోచిస్తున్నారు కదా.. ఆమె తమిళ్లో వరుస సినిమాలు చేస్తుంది తెలుగులో ఒకప్పుడు ఓ సినిమాలో మెరిసింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు దివ్యభారతి. మెగా హీరోలంటే ఇష్టం అని లైవ్ లోనే చెప్పేసింది.. సినిమా ప్రమోషన్లో పాల్గొన్న ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం.. అలాగే, ‘పుష్ప’రాజ్ అల్లు అర్జున్ కూడా ఇష్టమే అన్నారు హీరోయిన్ దివ్య భారతి.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలను మెగా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
దివ్యభారతి మహారాజ సినిమాలో కాసేపే కనిపించింది కానీ మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది. ఆ సినిమా తెలుగులో కూడా బాగా ఆడింది. తమిళంలో ఎంత మంచి పేరు వచ్చిందో… తెలుగులోనూ అంతే మంచి పేరు వచ్చింది. ఆ సినిమాతో కంపేర్ చేస్తే ఇది చాలా డిఫరెంట్ మూవీ. ఇండియాస్ ఫస్ట్ సీ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా. అందులోనూ జీవీ ప్రకాష్ కుమార్ నిర్మాతగా చేస్తున్న తొలి సినిమా.. ఈ మూవీలో ఛాన్స్ రావడం పై ఆమె హ్యాపిగా ఫీల్ అవుతున్నారు.
Also Read :ఇష్టం లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజా.. ఫస్ట్ మూవీ అవకాశం ఇచ్చింది అతనే..?
జీవి, దివ్య భారతి కాంబినేషన్లో మొదటగా బ్యాచిలర్స్ అనే మూవీ వచ్చింది. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు ఈ కాంబోలో కింగ్ స్టన్ మూవీ రాబోతుంది. ఇందులో ఒక పల్లెటూరి అమ్మాయి రోల్ చేశారు. చేపలు పట్టడం ఆ ఊరి ప్రజల జీవనాధారం. సముద్ర తీరంలోని ఆ ఊరంతా మత్యకారులు ఉంటారు. వాళ్ళు సముద్రంలో చేపలు పట్టడానికి ఎందుకు వెళ్లడం మానేశారు? వాళ్ళకు ఉన్న శాపం ఏమిటి? దాన్ని హీరో హీరోయిన్లు ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.. ఈ మూవీలో న్యాచురల్ లుక్ లో ఈమె కనిపిస్తుంది.యాక్షన్ సీన్స్ చేయడం ఎంత కష్టం అనేది తెలిసింది. ఇటువంటి ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ మరొకటి నాకు వస్తుందో లేదో తెలియదు. ఆల్రెడీ సినిమా చూశా. హ్యాపీగా ఉన్నాను. ఆడియన్స్ ఎప్పుడు సినిమా చూస్తారా? అని ఎగ్జైటెడ్ గా ఉన్నానని ధీమగా ఉంది. ఇక కింగ్ స్టన్ మూవీ థిఇవాళ యేటర్లలోకి వచ్చేసింది. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ప్రస్తుతం తమిళ్ళో మాత్రమే కాదు తెలుగులో కూడా సినిమాలు చేస్తుంది. త్వరలోనే ఆ మూవీలను అనౌన్స్ చెయ్యనుంది.