Jr NTR : టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న సినిమా వార్ 2. అయన్ ముఖర్జీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ హీరో టాలీవుడ్ హీరో కలిసి ఈ సినిమా చేయడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెట్టుకున్నారు అభిమానులు. నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ లో ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా మన ముందుకు రానుంది. ఈ సినిమాను ఎస్ రాజ్ ఫిలిమ్స్ ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. స్పై యాక్షన్ మూవీగా రానుంది. వార్ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. నిజానికి ఈ సినిమా దేవరా సినిమా కన్నా ముందే రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానుల అంచనాకి రీచ్ అయ్యే విధంగా సినిమా రూపొందించాలని మేకర్స్ భావించారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్న టైం లో,తాజాగా ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది.
యంగ్ టైగర్ న్యూ లుక్ ..
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ వార్ సినిమాతో ఎంత సక్సెస్ అందుకున్నాడో చూసాము. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వార్ 2 సినిమాని రూపొందిస్తున్నారు.టాలీవుడ్ లో ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం.సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఆయన సిక్స్ ప్యాక్ తో, షట్ లేకుండా, రెండు మూడు గంటలు ఒక షార్ట్ లో కనిపించనున్నట్టు టాక్. అదే నిజమైతే అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ ని షర్ట్ లేకుండా మనం ఈ సినిమాలో చూడొచ్చు. షర్ట్ లేకుండా విలనిజం అంటే ఇక మాస్ జాతరే అంటున్నారు నందమూరి ఫాన్స్. ఎన్టీఆర్ మొదటిసారి అరవింద సమేత సినిమాలో షర్ట్ లేకుండా ఫైటింగ్ సీన్స్ లో నటించి మెప్పించారు. ఇప్పుడు మరలా ఈ సినిమాలో మనం ఎన్టీఆర్ ని సిక్స్ ప్యాక్ తో చూడబోతున్నాం అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రిలీజ్ అప్పుడే ..
RRRతర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇద్దరు బడా హీరోలు, కలిసి చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇద్దరు మాస్ హీరోలను ఒకే స్క్రీన్ పై చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అని, అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరుతో కలిపి పాటని రూపొందిస్తున్నారు. హృతిక్ రోషన్ సూపర్ డాన్సర్ అలానే టాలీవుడ్ లో ఎన్టీఆర్ సూపర్ డాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తారు అలాంటిది ఇద్దరూ ఒకే స్క్రీన్ పై డాన్స్ వేస్తే అది ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రీతం ఈ సినిమాకు సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా రానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాన్ని క్రియేట్ చేస్తుందో చూడాలి.
Kalyan Ram: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జాతరే.. తమ్ముడు వస్తున్నాడు