BigTV English
Advertisement

OTT Movie : సముద్రం ఎడారిగా మారి, భూమిని సునామీ ముంచేస్తే… ట్విస్ట్ లతో అదరగొట్టే సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : సముద్రం ఎడారిగా మారి, భూమిని సునామీ ముంచేస్తే… ట్విస్ట్ లతో అదరగొట్టే సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : థియేటర్లలో వస్తున్న సినిమాలు కొద్దిరోజుల్లోనే ఓటిలోకి వచ్చేస్తున్నాయి. ఓటిటిలో ఇప్పుడు సినిమాలు చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు మూవీ లవర్స్ . అయితే వీటిలో సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ సినిమాలు ప్రేక్షకుల్ని ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. వీటిలో వచ్చే అడ్వెంచర్ సన్నివేశాలను బాగా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు.  ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక ప్రకృతి విపత్తు నుంచి మొదలవుతుంది. సముద్రం ఒక్కసారిగా మాయమైపోతుంది. ఆ తర్వాత ఒక కుటుంబం ఎలా ఈ పరిస్థితిని హ్యాండిల్ చేసిందనేదే ఈ స్టోరీ. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ ఫ్రెంచ్ యాక్షన్-అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ మూవీ పేరు ‘సర్వైవ్’ (Survive). 2024 లో వచ్చిన ఈ మూవీకి ఫెడెరిక్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సముద్రంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకునే, ఒక ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

జూలియా, ఆమె భర్త తమ కొడుకు పుట్టినరోజును సముద్రం మధ్యలో తమ బోటులో జరుపుకోవాలి అనుకుంటారు. ఎందుకంటే ఆకోరికను కొడుకే తండ్రిని పుట్టిన రోజు కానుకగా అడుగుతాడు. ఆ తరువాత ఈ ఈ ఫ్యామిలీ కొడుకు పుట్టినరోజును సముద్రం మధ్యలో జరుపుకుంటారు. అయితే, అకస్మాత్తుగా ఒక భయంకరమైన తుఫాను వచ్చి వారి బోటును దెబ్బతీస్తుంది. తుఫాను తర్వాత వారు మేల్కొని చూస్తే, సముద్రం అంతా నీళ్ళు లేకుండా, ఎడారిలా మారిపోయి ఉంటుంది. భూమి ధ్రువాలు తారుమారై, నీరు భూమికి మరో వైపుకు వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. ఈ పరిస్తిని చూసి ఈ ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ లోకి వెళ్తుంది. ఈ ప్రమాదకరమైన పరిస్థితిలో, ఈ ఫ్యామిలీ సజీవంగా ఉండటానికి పోరాడాల్సి వస్తుంది. కనుచూపు మేరలో కంటికి ఎవరూ కనిపిచకుండా పోతారు. సముద్రం లోతుల నుండి బయటకు వచ్చిన ఆకలితో ఉన్న జీవులు, వీళ్ళను వేటాడటం ప్రారంభిస్తాయి.

వారు ఈ ప్రమాదకరమైన జీవులతో పోరాడుతూ, నీరు ఉన్న సురక్షితమైన ప్రదేశానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో అక్కడికి ఒక సైకో వ్యక్తి వల్ల ఈ కుటుంభం కష్టాలు ఎదుర్కుంటుంది. వాడు చేసిన దాడిలో జూలియా భర్త చనిపోతాడు. జూలియా అతన్ని ఎదుర్కొని పిల్లల్ని కాపాడుకుంటుంది. ఆ తరువాత జూలియా కొన్ని జంతువులతో కూడా పోరాడాల్సి వస్తుంది. అక్కడ బ్రతకడానికి, ఒక రకమైన యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది. చివరికి జూలియా తనపిల్లలతో సురక్షితమైన ప్రాంతానికి చేరుకుంటుందా ? భూమి మీద బతకడానికి పరిస్తితి ఎలా ఉంటుంది ? ఈ విషయాలను ఈ ఫ్రెంచ్ యాక్షన్-అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : నలుగురి చేతిలో నలిగిపోయే అమ్మాయి… మైండ్ బ్లాక్ అయ్యే బో*ల్డ్ సీన్స్ … మోస్ట్ కాంట్రవర్షియల్ రివేంజ్ థ్రిల్లర్

Related News

Chiranjeeva OTT : ఓటీటీలోకి వచ్చేసిన రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

OTT Movie : ఎక్స్ కంటే డేంజర్ గా ఉండే 5 థ్రిల్లర్ సిరీస్ లు… యాక్షన్ మాత్రమే కాదు మజా ఇచ్చే అడ్వెంచర్ కూడా

Big Stories

×