Mufasa : The Lion King OTT : మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘ముఫాసా : ది లయన్ కింగ్’ (Mufasa : The Lion King) ఎట్టకేలకు ఓటిటిలోకి రాబోతోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై ఓటిటి ప్లాట్ ఫామ్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చింది. మరి ‘ముఫాసా’ మూవీని ఏ ఓటిటిలో, ఎప్పుడు చూడొచ్చు? అనే వివరాల్లోకి వెళ్తే…
జియో హాట్స్టార్ లో ‘ముఫసా ది లయన్ కింగ్’
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ యానిమేషన్ మూవీ ‘ది లయన్ కింగ్’ ఎంతటి ప్రేక్షక ఆదరణ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అవ్వడంతో పాటు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీనికి సీక్వెల్ గా ‘ముఫాసా ది లయన్ కింగ్’ పేరుతో గత ఏడాది ఓ మూవీ భారీ స్థాయిలో థియేటర్లోకి వచ్చింది. డైరెక్టర్ జర్కిన్స్ ఈ మూవీని తీసిన తీరు చిన్నపిల్లల నుంచి, పెద్దల వరకు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ బ్యానర్ పై అడెలె రోమన్ స్కి, మార్క్ సెరియాక్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. 2024 డిసెంబర్ 20న థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 3200 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డును క్రియేట్ చేసింది.
దీంతో ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ పై రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ముఫాసా : ది లయన్ కింగ్’ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్స్టార్ (Jio Hotstar) తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. గత నెల ఫిబ్రవరి 18 నుంచి ఈ మూవీ ఓటిటిలోకి రాబోతుందని అనౌన్స్ చేశారు. కానీ ఈ మూవీ ఆ రిలీజ్ టైం కి రాకుండా ప్రేక్షకులను నిరాశపరిచింది. తాజాగా జియో హాట్స్టార్ ‘ముఫాసా : ది లయన్ కింగ్’ మూవీని మార్చ్ 26 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ చేసి ప్రకటించారు.
తెలుగులో సూపర్ స్టార్ డబ్బింగ్
‘ముఫాసా : ది లయన్ కింగ్’ మూవీకి ఇండియాలో ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరో డబ్బింగ్ చెప్పారు. తెలుగులో అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో క్యారెక్టర్ కి వాయిస్ ఓవర్ అందించారు. హిందీలో ముఫాసాకు షారుక్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, చిన్నప్పటి పాత్రకి ఆయన కొడుకు అబ్రహం వాయిస్ అందించారు. అలాగే ఈ మూవీలో ఇతర పాత్రలకి బ్రహ్మానందం, అలీ తదితరులు తమ వాయిస్ ను అరువు ఇచ్చారు. దీంతో తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో మూవీని బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు ఆల్మోస్ట్ ఈ మూవీని ఒక పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. మరి ఇప్పుడు ఓటిటిలోకి వచ్చాక ఈ మూవీ మరెన్ని రికార్డులను బద్ధలు కొడుతుందో చూడాలి.
It's time to experience the legend of Mufasa.#Mufasa: The Lion King, coming to #JioHotstar on March 26 in English, Hindi, Tamil and Telugu. #MufasaOnJioHotstar #JioHotstar #InfinitePossibilities pic.twitter.com/IqN5AxEucR
— JioHotstar (@JioHotstar) March 12, 2025