Journalist Revathi: ఈ రోజు ఉదయం మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వీ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉదయం సుమారు 4 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీసులతో వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రేవతిని, తన్వి యాదవ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
అరెస్టుకు కారణం ఇదే..
ఇవాళ ఉదయం జర్నలిస్ట్ రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్‌టాప్ సైతం పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. రేవతికి సంబంధించిన పల్స్ యూట్యూబ్ ఛానెల్ ఆఫీస్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు. ముఖ్యమంత్రి అని గౌరవం లేకుండా హద్దులు దాటిపోయి రైతులతో నోటికి వచ్చినట్టు బూతులు తిట్టించడం, అలాగే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిని రైతుల చేత పదే పదే తిట్టిస్తుండడంతో జర్నలిస్ట్ రేవతిని, తన్వీ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
జర్నలిస్ట్ రేవతి ‘పల్స్ న్యూస్ బ్రేక్’ ఛానల్ కు మరో ప్రముఖ పార్టీ ఫండింగ్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. అదే పార్టీ రేవతి యూట్యూబ్ కు ఫండింగ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నట్టు సమాచారం. ఎందుకంటే ఇపుడు రేవతి అరెస్టుకు కారణమైన వీడియోను ఎంతమంది చూశారో తెలీదు. ఆ వీడియోలో మహబూబాబాద్ రైతుతో మాట్లాడుతూ.. రేవంత్ ను వ్యక్తిగతంగాను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదేపదే బండబూతులు తిట్టించింది. ఒక రైతుతో సీఎంను, ప్రభుత్వాన్ని అదేపనిగా బూతులు తిట్టించటం వారు టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రేవతిని, తన్వి యాదవ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: CM Revanth Reddy: 55 రోజుల్లోనే ఉద్యోగాలు ఇచ్చాం.. ఇది కదా మేమంటే: సీఎం రేవంత్ రెడ్డి
ALSO READ: RWF: టెన్త్ అర్హతతో 192 ఉద్యోగాలు.. ఏడాది పాటు స్టైఫండ్.. ఇప్పుడే దరఖాస్తు చేయండి..