BigTV English

Gaddar Awards : గద్దర్ అవార్డులు వచ్చేస్తున్నాయి… జ్యూరీ ఏర్పాటు… మెంబెర్స్ ఎవరెవరంటే?

Gaddar Awards : గద్దర్ అవార్డులు వచ్చేస్తున్నాయి… జ్యూరీ ఏర్పాటు… మెంబెర్స్ ఎవరెవరంటే?

Gaddar Awards : గద్దర్ ఫిలిం అవార్డ్స్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విధివిధానాలను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. నంది అవార్డుల ప్రకటన ఎక్కడైతే ఆగిపోయిందో, అక్కడి నుంచి అన్ని కేటగిరీలో కు ఉత్తమ చిత్రానికి మాత్రమే అవార్డును ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా తాజాగా జ్యూరీ మెంబర్స్ ను కూడా కన్ఫామ్ చేశారు. ఈ మేరకు తాజాగా సమాచార భవన్ లో తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు.


సింహా అవార్డుల డబ్బులు వెనక్కి 

దిల్ రాజు మాట్లాడుతూ “గద్దర్ అవార్డ్స్ కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ గైడ్ లైన్స్ ని ప్రిపేర్ చేసింది. 2014లో తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరం బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఇవ్వనున్నాము. నంది అవార్డ్స్ కు ఏ గైడ్ లైన్స్ ఉన్నాయో అలాగే చిన్న చిన్న మార్పులతో గద్దర్ అవార్డ్స్ కూడా అలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఏప్రిల్ లో అవార్డ్స్ ఫంక్షన్ ఘనంగా జరుపుదాం. గతంలో 2014 సింహా అవార్డులు అనుకున్నప్పుడు… అప్లికేషన్ ఇచ్చినపుడు ఎమౌంట్ పే చేశారు. వారికి ఎఫ్డిసి నుంచి తిరిగి చెల్లింపులు అవుతాయి. వన్ వీక్ లో అవార్డులను జ్యూరీ పైనల్ చెస్తుంది. గద్దర్ అవార్డ్ నమూనా కూడా సిద్దం అవుతుంది. అధ్బుతమైన ఈవెంట్ జరగబోతుంది. అవార్డులు ఎవరైనా ఇవ్వొచ్చు. ఫిలిం ఛాంబర్ కూడా ఇస్తుంది. మనం ఏపని చేసినా 51 శాతం పాజిటివ్‌ గా ఉండే చాలు.‌ నెగిటివ్ ప్రచారాలు అనవసరం” అంటూ చెప్పుకొచ్చారు.


ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వివిధ కేటగిరీలో అవార్డులను ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. 2024లో పలు కేటగిరీలో ఉత్తమ చిత్రం అవార్డులను అలాగే బెస్ట్ నటీనట్లు సాంకేతిక నిపుణులకు కూడా అవార్డులను అందజేస్తారు. కమిటీ సిఫార్సు చేసిన టిఎల్ కాంతారావు, పైడి జైరాజ్ స్మారక అవార్డులను, గతంలో ఉన్నట్టుగానే ఉత్తమ సినీ గ్రంథం, ఉత్తమ సినీ పాత్రికేయుడు అవార్డులను కూడా అందజేయబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రక్రియను ఎఫ్డిసి అధికారులు వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఉర్దూ భాష సినిమాలకు స్పెషల్ గా అవార్డులు ఇవ్వబోతున్నారు.

‘గద్దర్ అవార్డ్స్’ జ్యూరీ మెంబర్స్

గద్దర్ అవార్డ్స్ జూరీ మెంబర్స్ లిస్టులో దాదాపు 17 మంది ఉన్నారు. అందులో బి నర్సింగ్ రావు చైర్మన్, దిల్ రాజు వైస్ చైర్మన్ గా ఉన్నారు. రాఘవేంద్రరావు, అందె ఎల్లన్న, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, శ్రీమతి గుమ్మడి వెన్నెల, తనికెళ్ల భరణి, సురేష్ బాబు, చంద్రబోస్, నారాయణ మూర్తి, వందేమాతరం శ్రీనివాస్, అల్లని శ్రీధర్, సన యాదిరెడ్డి, హరిష్ శంకర్, బలగం వేణు అడ్వైజరీ మెంబర్స్ గా ఉన్నారు.

‘గద్దర్’ అవార్డ్స్ ఇచ్చే క్యాటగిరీలు

ఫీచర్ ఫిలిం తెలుగు (ఉర్దూ, భాషలు)

బెస్ట్ ఫీచర్ ఫిలిం

సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం

థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం

బెస్ట్ ఫీచర్ ఫిలిం ఉర్దూ

ఫీచర్ ఫిల్మ్స్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్

 

బెస్ట్ చిల్డ్రన్ ఫిలిమ్

 

ఎన్విరాన్మెంట్ / హెరిటేజ్ / హిస్టరీ సినిమాలు

బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, కమ్యూనల్ హర్మనీ, అప్ లిఫ్ట్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాస్

 

బెస్ట్ డెబ్యు ఫీచర్ ఫిల్మ్

బెస్ట్ యానిమేషన్ ఫిలిమ్స్

బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ ఫిలిమ్స్

 

డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్స్

ఫస్ట్ బెస్ట్ ఫిలిం

సెకండ్ బెస్ట్ ఫిలిం

థర్డ్ బెస్ట్ ఫిలిం

డిప్లొమా ఆఫ్ మెరిట్

 

షార్ట్ ఫిల్మ్స్ 

ఫస్ట్ బెస్ట్ ఫిలిం

సెకండ్ బెస్ట్ ఫిలిం

థర్డ్ బెస్ట్ ఫిలిం

డిప్లొమా ఆఫ్ మెరిట్

 

తెలుగు సినిమాపై బెస్ట్ బుక్స్ / ఆర్టికల్స్ 

తెలుగు సినిమాపై బెస్ట్ బుక్

తెలుగు సినిమాపై క్రిటిక్

 

ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఇండివిడ్యువల్ అవార్డ్స్

బెస్ట్ డైరెక్టర్

బెస్ట్ లీడింగ్ యాక్టర్

బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్

బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్

బెస్ట్ మేల్ సింగర్

బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్

బెస్ట్ కమెడియన్

బెస్ట్ స్టోరీ రైటర్

బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్

బెస్ట్ సినిమా ఎడిటర్

బెస్ట్ కొరియోగ్రాఫర్

బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్

బెస్ట్ ఎడిటర్

బెస్ట్ ఆడియోగ్రాఫర్

బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్

బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్

స్పెషల్ జ్యూరీ అవార్డు

 

ఫిలిమ్స్ ఆన్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్

డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం అవార్డు ఫర్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×