BigTV English

June Movies in OTT : జూన్ లో ఓటీటీలోకి రాబోతున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే.. ఆ రెండు స్పెషల్..

June Movies in OTT : జూన్ లో ఓటీటీలోకి రాబోతున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే.. ఆ రెండు స్పెషల్..

June Movies in OTT : ఓటీటీల్లోకి కొత్త సినిమాలు నెల లోపే విడుదల అవుతుంటాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అయితే మాత్రం కొన్నిసార్లు రెండు నెలలు కూడా పడతాయి. క్రైమ్ థ్రిల్లర్ కథలతో స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి.. కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ మంచి వ్యూస్ ను రాబడుతుంటాయి. కొత్త సినిమాలే కాదు పాత సినిమాలు కూడా ఇక్కడ రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. జూన్ నెలలో బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న అన్ని సినిమాలు కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూసేద్దాం..


రెట్రో…

తమిళ స్టార్ హీరో సూర్య, కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ చిత్రం రెట్రో… పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. మే 1వ తేదీన థియేటర్లలో రిలీజైంది.. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దుమ్మరేపింది. ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందని మూవీ టీమ్ వెల్లడించింది. రూ.70కోట్లలోపు బడ్జెట్‍తోనే రూపొందిన ఈ యాక్షన్ మూవీ సూపర్ హిట్ కొట్టింది. అయితే ఈ మూవీకి తెలుగులో మంచి రెస్పాన్స్ రాలేదు.. కేవలం మిక్సీ్డ్ టాక్ వచ్చింది.. ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ జూన్‍లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. తొలి వారమే స్ట్రీమింగ్‍కు రానుందని. ప్రస్తుతం సూర్య రెండు ప్రాజెక్టులతోరాబోతున్నాడు.


సింగిల్ మూవీ.. 

టాలీవుడ్ స్టార్ హీరో శ్రీ విష్ణు లేటెస్ట్ గా నటించిన చిత్రం సింగిల్.. ఈ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి చోటుని పాజిటివ్ టాక్ ని అందుకోడంతో పాటుగా బాక్సాఫీస్ ని షేర్ చేసే కలెక్షన్స్ ని కొల్లగొట్టింది.. సుమారు రూ.10కోట్ల బడ్జెట్‍ ఈ చిత్రం తెరకెక్కింది. సుమారు రూ.26కోట్ల కలెక్షన్లతో దుమ్మురేపింది. ఈ మూవీలో శ్రీవిష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు.. కార్తిక్ రాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. సింగిల్ సినిమా జూన్‍లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అలప్పుజ జింఖానా.. 

మలయాళ ఇండస్ట్రీ నుంచి చెప్తున్నా సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అలాంటి సినిమాలలో అలప్పుజ జింఖానా కూడా ఒక్కటి. ఇది టైటిల్ తగ్గట్లే సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.. ఏప్రిల్ 10 న రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రూ.50కోట్లకు పైగా వసూళ్లతో సూపర్ హిట్ సాధించింది. ఈ మూవీకి ఖాలిద్ రహమాన్ దర్శకత్వం వహించారు.. ఈ మూవీ కూడా జూన్ లో ఓటీటీలోకి రాబోతుంది..

టూరిస్ట్ ఫ్యామిలీ.. 

తమిళ్ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అవుతున్న సినిమాలు సస్పెన్స్ థ్రిల్లర్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రంలో శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషించారు. మే 1న థియేటర్లలో విడుదలైంది. రూ.16 కోట్లతో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యి దాదాపుగా రూ. 75 కోట్లకు పైగా వసూల్ చేసింది. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా జూన్ తొలి వారంలో టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది..

ఇక వీటితో పాటు బోలెడు సినిమాలు జూన్ నెలలో స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. మరి ఏ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి..

Tags

Related News

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

OTT Movie : జాబ్ ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ట్రాప్… అలాంటి అమ్మాయిలే ఈ ముఠా టార్గెట్… క్రేజీ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఇంటర్వ్యూకు వచ్చిన 8 మంది ఒకే గదిలో… అమ్మాయి బట్టలు విప్పుతూ… సింగిల్ గా చూడాల్సిన మూవీ మావా

OTT Movie : అమ్మాయిని కిడ్నాప్ చేసి 7 రోజులు అదే పాడు పని… వీళ్ళు మనుషులా మానవ మృగాలా ? ఈ మూవీ పెద్దలకు మాత్రమే

Big Stories

×