Comedian Satya : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో శ్రీ విష్ణు ఒకడు. ముందుగా చిన్న చిన్న సినిమాల్లో కొన్ని పాత్రలు వేసిన శ్రీ విష్ణు ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ సక్సెస్ గా నిలిచింది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో పాత్ర కూడా మంచి పేరును తీసుకొచ్చింది. నటుడుగా కొన్ని సినిమాల్లో గుర్తింపు సాధించుకున్న శ్రీ విష్ణు ఆ తర్వాత హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన మెంటల్ మదిలో సినిమా డీసెంట్ హిట్గా నిలిచి మంచి పేరును తీసుకొచ్చింది. ఆ తర్వాత వేణు దర్శకత్వంలో వచ్చిన నీది నాది ఒకే కథ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఇక్కడితోనే హీరోగా ఇండస్ట్రీలో నిలబడిపోయాడు శ్రీ విష్ణు.
వరుస డిజాస్టర్లు
శ్రీ విష్ణు కి రెండు సినిమాలు సక్సెస్ వచ్చిన తర్వాత వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఆ తరుణంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని ఎడాపెడా సినిమాలు చేసేసాడు. ఒక టైం వచ్చేసరికి శ్రీ విష్ణు సినిమాలు బోరు కొట్టే స్థాయికి వెళ్లిపోయాయి. ఆ తరువాత సామజవరగమన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమా దాదాపు 50 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత శ్రీ విష్ణు సినిమాలు కూడా ఒక మార్కెట్ ఏర్పాటయింది.
శ్రీ విష్ణు బాటలో సత్య
ఇక శ్రీ విష్ణు విషయానికొస్తే రీసెంట్ టైంలో తాను చేసిన సినిమాల్లోని బూతులు వెతికే పనిలో పడ్డారు సోషల్ మీడియాలో కొంతమంది. అయితే సెన్సార్ బోర్డుకి దొరక్కుండా చాలా చాకచక్యంగా బూతులు మాట్లాడుతాడు శ్రీ విష్ణు. ఇప్పటికీ శ్రీ విష్ణు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇప్పుడు ఇదే తరహాలో కమెడియన్ సత్య కూడా మాట్లాడటం మొదలుపెట్టాడు.
కమెడియన్ సత్య టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చాలామందిని అద్భుతంగా ఇమిటేట్ చేయగలడు. రంగబలి సినిమా టైంలో సత్యా టాలెంట్ ఏంటో చాలామందికి తెలిసి వచ్చింది. ఇక ప్రస్తుతం మాస్ మూవీ మేకర్స్ నిర్మించిన త్రీ రోజెస్ సీజన్ 2 లో సత్య కామెడీ టైమింగ్ మరోసారి బయటపడింది. ఈ సినిమాలో సత్య బెట్టింగ్ ఆడుతూ ఉంటాడు. దీనితో కామెడీ క్రియేట్ చేశాడు దర్శకుడు. అయితే బెట్టింగ్లో ఓడిపోయి ఇరిటేట్ అయిన సత్య ప్రేక్షకులు పట్టుకోలేకుండా బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇది చూసిన చాలామంది శ్రీవిష్ణు లానే ట్రై చేస్తున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : జనసేన వాళ్లు ఉన్న విడిచి పెట్టాం… తిక్క లేచింది, అందరి లెక్కలు తేల్చే పనిలో పడ్డాడు