BigTV English

OTT Movie : ఆ పని జరగడం కోసం దేవుడే దిగి వస్తే… విజయ్ సేతుపతి క్రేజీ మూవీ

OTT Movie : ఆ పని జరగడం కోసం దేవుడే దిగి వస్తే… విజయ్ సేతుపతి క్రేజీ మూవీ

OTT Movie : సినిమాలను ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు. అయితే కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ తో పాటు, మంచి మెసేజ్ కూడా ఇస్తుంటాయి. కొంతమంది మనుషులు వాటిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. అయితే ఇటువంటి సినిమాలను చూస్తున్నంత సేపు ఫీల్ అవుతూ, ఆ తర్వాత మర్చిపోయే మనుషుల వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. కొంతలో కొంతైనా పాటించే వ్యక్తులు వల్ల సమాజానికి కొంత ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా మంచి మెసేజ్ తో వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


సోనీ లివ్ (Sony LIV) లో

ఈ తమిళ్ మూవీ పేరు ‘కడైసి విశ్వాసాయి‘ (Kadasai Vivasai). 2022లో వచ్చిన ఈ మూవీకి M. మణికందన్ రచించి దర్శకత్వం వహించారు.  ఇందులో నల్లంది అనే 85 ఏళ్ల రైతు ప్రధాన పాత్రలో నటించారు.  విజయ్ సేతుపతి, యోగి బాబు సహాయక పాత్రల్లో నటించారు.  కడైసి విశ్వాసాయి విస్తృతమైన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇది 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో, ఉత్తమ తమిళ మూవీగా అవార్డును  గెలుచుకుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ సోనీ లీవ్ (Sony LIV) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

మాయండి అనే ఒక పెద్దాయన ఒక మారుమూల పల్లెటూరులో, వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. ఆ ఊరిలో వ్యవసాయం ఇతనొక్కడే చేస్తూ ఉంటాడు. మిగతావాళ్లు ఉద్యోగాల పేరుతోనూ, వ్యాపారాల పేరుతోనూ కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు. అయితే ఒకరోజు ఆ గ్రామంలో పెద్ద పిడుగు పడుతుంది. శాంతి పూజ చేయాలని ఆ ఊరు పెద్దలు అనుకుంటారు. ఈ క్రమంలో పండించిన ధాన్యాన్ని దేవునికి నైవేద్యం పెట్టాలనుకుంటారు. మాయండి తప్ప మరెవరు వ్యవసాయం చేయకపోవడంతో, అతని సాయం అడుగుతారు. అందుకు అతను ఒప్పుకొని, వరి పండించడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఆ భూమిని కొంటామని ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు అతని దగ్గరికి వస్తారు. అందుకు అతను ఒప్పుకోకపోవడంతో, ఎలాగైనా ఆ పొలంని సొంతం చేసుకోవాలనుకుంటారు. ఆ మరుసటి రోజు నెమలి అతని పొలంలో చనిపోయి ఉంటుంది. దానిని ఆ పెద్దాయన గుంత తీసి పూడ్చి పెడతాడు. ఇంతలో రామయ్య అనే వ్యక్తి తన ప్రియురాలు చనిపోవడంతో, భిక్షాటన చేస్తూ జీవితాన్ని గడుపుతుంటాడు.

రామయ్య ఆ పెద్దాయన ఇంటి దగ్గరికి వచ్చి, అతడు ఇచ్చే ఆతిధ్యాన్ని స్వీకరిస్తాడు. అయితే తన ప్రియురాలికి కూడా వడ్డించమని చెప్తాడు. చనిపోయిన ప్రియురాలు పక్కనే ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటాడు రామయ్య. అందుకు మాయండి మరోమారు ఆలోచించకుండా మరొక ప్లేటు పెడతాడు. నెమలి చనిపోయిందని బాధతో ఆరోజు పెద్దాయన భోజనం తినడం మానేస్తాడు. ఇది చూసిన రామయ్య అంతా సుబ్రహ్మణ్యస్వామి చూసుకుంటాడు అంటూ రామయ్యకు చెప్పి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు నెమలి చనిపోయిందని పోలీసులు రామయ్యని అరెస్ట్ చేస్తారు. అతన్ని  చూసిన జడ్జి మాయండి ఈ నేరం చేయలేదని గ్రహిస్తుంది. అయితే రిపోర్ట్ రెడీ అయ్యేంతవరకు రిమాండ్ లో ఉంచుతుంది. చివరికి మాయండి జైలు నుంచి విడుదలవుతాడా? పంట చేతికి వచ్చి దేవుడికి నైవేద్యంగా పెడతాడా? రామయ్య రూపంలో వచ్చింది ఎవరు? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడాల్సిందే.

Related News

Tollywood: ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ మూవీ!

OTT Movie : వరుస మర్డర్స్ తో పోలీసులకు చెమటలు పట్టించే కిల్లర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : స్టూడెంట్ తో టీచర్ పాడు పని… ఒక్కో సీన్ కు మెంటలెక్కాల్సిందే భయ్యా

OTT Movie : అబ్బాయిలను వశపరుచుకుని కోరిక తీర్చుకునే ఆడ దెయ్యం.. అమ్మాయిలనూ వదలకుండా…

OTT Movie : అర్ధరాత్రి ఆ పని చేసే జంట… నెక్స్ట్ ట్విస్టుకు గూస్ బంప్స్… ఓటీటీని వణికిస్తున్న హర్రర్ మూవీ

OTT Movie : నిద్రపోతే రూపం మారే విడ్డూరం… అలాంటి వాడితో అమ్మాయి ప్రేమ… ఈ కొరియన్ మూవీ క్లైమాక్స్ డోంట్ మిస్

OTT Movie : చెత్త కుండీలో శవం… శవం ఒకే అమ్మాయిది, ట్విస్టులు మాత్రం బోలెడు… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఒంటరిగా ఉండే అమ్మాయి ఇంటికి రోజూ వచ్చే స్ట్రేంజర్… అర్ధరాత్రి అదే పని… వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్

Big Stories

×