trinayani serial today Episode: తిలొత్తమ్మను నాలుగు రోజులు జాగత్రగా ఉండండి అంటూ హెచ్చరిస్తుంది నయని. అవును నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్వరినీ నమ్మాడానికి లేదు అంటుంది. తిలొత్తమ్మ.. దీంతో హాసిని కిచెన్‌లోకి వెళ్లి బాధపడుతుంది. నేను అనుకున్నది జరగలేదు.. లేకపోతే ఈ పాటికి తిల్లు ఆంటీకి ఆఖరి స్నానం చేయించే వాళ్లం అనుకుంటుంది. ఇంతలో నయన వచ్చి ఎందుకు అక్కా ఆలా చేశావు అని అడుగుతుంది. ఏం చేశాను టీ బాగాలేదా.. చెల్లి అంటుంది హాసిని. నువ్వు చేసింది బాగాలేదు.. అత్తయ్యా ప్రాణం తీయాలని ఎందుకు ప్రయత్నించావని అడుగుతున్నాను అని అడుగుతుంది నయని. ఇప్పుడు చెప్తే జైళ్లో వేయిస్తారా..? పేపర్ లో వేయిస్తారా..? అంటుంది హాసిని.
ప్రమాదం ఏమీ జరగలేదు కాబట్టి నిన్ను ఏమీ అనరు వదిన అంటూ విక్రాంత్ వస్తాడు. అయినా నువ్వేంటి అమ్మాయి అంత అఘాయిత్యానికి పాల్పడతావా.. అంటుంది రత్నాంభ. నాకు తెలిసిన రీతిలో ప్రయత్నం చేశాను బామ్మా అంటుంది హాసిని.. అదే ఎందుకు చేశావని అడుగుతున్నాము అక్కా అంటుంది నయని.. వదినా నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావో..తెలియక మాట్లాడుతున్నావో తెలియడం లేదు అంటాడు విక్రాంత్. ఇంతలో విశాలాక్షి మీరు తెలుసుకోవాలని చేసింది చిన్నాన్న అంటుంది.
తిలొత్తమ్మ చనిపోతే ఆ నేరం పాప మీద పడకుండా ఉండటానికి అలా చేసింది అని చెప్పగానే.. అక్కా అత్తయ్యతో పాటు మీ ఆయనను కూడా ప్రమాదంలోకి నెట్టానని చూశావు నీకు ఎందుకు అక్కా అంత చిన్నచూపు అంటుంది నయని. అలాంటి మొగుడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.. అంటుంది హాసిని. పెద్దమ్మా నువ్వు నేరుగా ఆ యముణ్ణే తీసుకొచ్చి వాళ్లను తీసుకెళ్లమంటే తీసుకెళ్లడు అంటుంది విశాలాక్షి.. ఎందుకు అని హాసిని అడగ్గానే.. ఎందుకంటే.. అత్తయ్యా ప్రాణాలు ఎవరి చేతిలో పోవాలని రాసి పెట్టి ఉంటే వాళ్ల చేతిలో పోతాయి. అని నయని చెప్తుంది.
తర్వాత తిలొత్తమ్మ బాధగా సుమనను పిలిచి సుమన నాలుగు రోజుల్లో నేను పోతే నా కొడుకును జాగ్రత్తగా చూసుకుంటావా.. అని అడుగుతుంది. దీంతో బావగారిని నేను చూసుకుంటే బాగుండదేమో అంటుంది సుమన. దీంతో దురందర కోపంగా విక్రాంత్‌ను జాగ్రత్తగా చూసుకోండని చెప్తుంది. దీంతో వల్లభ మమ్మీ వాడి మీదేనా నీకు లవ్వు ఇన్నాళ్లు నేను నీ పక్కనే ఉన్నాను నా గురించి చెప్పవా అంటాడు. దీంతో నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉంటావు కదా వల్లభ.. ఈ నాలుగు రోజుల్లో తర్వాత కూడా నువ్వు నాతో ఉంటావు కదా అనుకున్నాను అంటుంది తిలొత్తమ్మ. దీంతో దురందర.. కోపంగా విశాలాక్షి నాలుగు రోజులు ప్రాణాలు పోతాయి. లేదంటే.. నీకు గండం గడిచినట్టేగా అంటుంది.
అవును అత్తయ్యా ఈ నాలుగు రోజులు మీకు ఏమీ కాకాపోతే మీకు వందేళ్లు వచ్చే వరకు మిమ్మల్ని ఆ యముడు కూడా ఏమీ చేయలేడని అంటుంది. అవును అత్తయ్యా మీరు సంపాదించిన ఆస్తి నాకే రాసిస్తారా..? అని సుమన అడగ్గానే దురందర వెటకారంగా చూశావా వదిన మనుషులు ఎంత మారిపోయారు అంటుంది. దీంతో నువ్వు నా ఆస్తిని కొట్టేసినందుకే నేను చచ్చి మళ్లీ నీ కడుపున పుట్టబోతున్నాను కదా దురందర ఇది కూడా అంతే అంటుంది తిలొత్తమ్మ. ఇంతలో వల్లభ మమ్మీ నేను కూడా చనిపోతే ఎవరి కడుపున పుడతాను అంటుంది. దీంతో సుమన.. ఇంకో అయిదు కోట్లు పోయినా సరే నేను మళ్లీ నెల తప్పి మిమ్మల్నే కంటాను.
కాకపోతే మీ ఆస్తి మొత్తం నాకు రాసిస్తే అంటూ వెళ్లిపోతుంది. తర్వాత తిలొత్తమ్మ వచ్చి గాయత్రి పాపను తిడుతుంటే.. రత్నాంభ ఎందుకమ్మా అలా తిడుతున్నావు అంటుంది. వీళ్ల అమ్మకన్నా దయ ఉంటుందేమో కానీ ఈ పిల్లకు అవేమీ లేదు అంటాడు వల్లభ. ఇంతలో నయని వచ్చి వల్లభను తిడుతుంది. ఏంటా కసురుకోవడం అంటూ హెచ్చరిస్తుంది. ఇంతలో పక్కకు వెళ్లిన గాయత్రి పాప కరెంట్ వైర్లు తీసుకుని వస్తుంది. అది చూసిన అందరూ షాక్ అవుతారు. గాయత్రి పాప కరెంట్ వైర్లతో తిలొత్తమ్మ వైపు వెళ్తుంటే.. తిలొత్తమ్మ భయపడుతుంది. నయని ఆపడానికి వెళ్తుంటే.. వద్దని ఆ వైర్లు తాకితే మాడి మసై పోతామని విక్రాంత్ ఆపుతాడు. గాయత్రి పాప వైర్తు తిలొత్తమ్మ మీద వేయగానే కరెంట్ పోతుంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. నయని గాయత్రి పాపను ఎత్తుకుని పైకి వెళ్తుంది. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?