Ranabaali OTT: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం రణబాలి(Ranabaali). దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించింది. ఇటీవల కాలంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)నటించిన సినిమాలు పూర్తిగా ప్రేక్షకులను నిరాశపరిచినప్పటికీ రణబాలి మాత్రం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సింగనమల బొబ్బిలి రణబాలి అనే పాత్రలో కనిపించారు.
ఈ సినిమాలో బ్రిటిష్ వారి పరిపాలనలో భాగంగా సీమ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన ఒక యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించారు. పూర్తిగా మాస్ డైలాగులతో హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా జయమ్మ పాత్రలో రష్మిక మందన్న(Rashmika Mandanna) నటించిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత విజయ్ రష్మిక జంటగా నటించిన మొదటి సినిమా కావటం విశేషం.
ఇకపోతే దసరా పండుగ సందర్భంగా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో విడుదలకు ప్రసారమవుతుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(Net Flix) కైవసం చేసుకున్నారు. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించి నెట్ ఫ్లిక్స్ అధికారికంగా తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ షేర్ చేస్తూ సింగనమల బొబ్బిలి రణబాలి వచ్చేస్తున్నాడు అంటూ ఈ సినిమా నవంబర్ 13వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల కాబోతుందని తెలిపారు.
Singanamala Bobbili Ranabaali osthunnadu 🔥 pic.twitter.com/lNBMTC1aYI
— Netflix India South (@Netflix_INSouth) November 9, 2026
థియేటర్లలో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ప్రసారమవుతూ ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాని థియేటర్లలో మిస్ అయినవారు నవంబర్ 13 నుంచి నెట్ ఫ్లిక్స్ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇకపోతే విజయ్ రష్మిక మందన్న కాంబినేషన్ లో ఇదివరకు గీతగోవిందం ,డియర్ కామ్రేడ్ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. గీత గోవిందం సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ రెండు సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న విజయ్ రష్మిక తిరిగి రణబాలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా వీరి పెళ్లి తర్వాత విడుదల కావడంతో పెళ్లి తర్వాత జంటగా నటించిన మొదటి సినిమాగా రణబాలి మంచి సక్సెస్ అందుకుంది.
Also Read: దీవాలి స్పెషల్.. గుడ్ న్యూస్ చెప్పిన శ్రీముఖి.. పప్పన్నం పెట్టబోతుందా?