Danish Kaneria On ODI World Cup 2027 : 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ (2027 ODI World Cup tournament) ప్రారంభానికి ఏడాది సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో ఈ టోర్నమెంట్ లో ఆడే ప్రతి జట్టు వన్డేలపై ఫోకస్ చేస్తోంది. ఏడాది పొడుగునా వన్డేలు ఆడేలా సంసిద్ధం అవుతున్నాయి. టీమిండియాతో పాటు పాకిస్తాన్ కూడా ప్రత్యేకంగా వన్డేలపై ఫోకస్ చేశాయి. ఈ నేపథ్యంలో 2027 వన్డే వరల్డ్ కప్ సెమీస్ రేసులో ఉండే జట్లను పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అంచనా వేశాడు. 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ఆస్ట్రేలియా, టీం ఇండియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సెమీ ఫైనల్ చేరుకుంటాయని వెల్లడించాడు. ఈ నాలుగు జట్లకు తప్ప మిగతా టీమ్స్ కు సెమీ ఫైనల్ చేరే దమ్ము, ధైర్యం లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు డానిష్ కనేరియా. దీంతో డానిష్ కనేరియా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ (2027 ODI World Cup tournament) వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో సెమీ ఫైనల్ వెళ్లే జట్లను అంచనా వేసి మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే వరల్డ్ కప్ లో టీమిండియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు మాత్రమే సెమీ ఫైనల్ చేరుతాయని వ్యాఖ్యానించారు. మిగతా జట్లు ఇంటిదారి పట్టడం గ్యారెంటీ అని అంచనా వేశాడు. తమ పాకిస్తాన్ క్రికెట్ జట్టు గ్రూప్ స్టేజ్ లో ఎలిమినేట్ కాకపోతే సెమీస్ స్టేజ్ లోనైనా ఇంటికి వెళ్ళిపోతుందని వ్యాఖ్యానించాడు. అలా జరగకపోతే తాను ఇకపై క్రికెట్ పై అనాలసిస్ చేయబోవునని శపథం చేశాడు.
తన్వీర్ అహ్మద్ చెప్పినట్టుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు సెమీ ఫైనల్ చేరడం కలలో కూడా జరగదని చురకలు అంటించాడు. కానీ టీమిండియా మాత్రం సెమీ ఫైనల్ చేరి టైటిల్ కొడుతుందని అంచనా వేశాడు. 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య కనీసం మూడు మ్యాచ్ లు జరుగుతాయని డానిష్ కనేరియా వెల్లడించాడు. ఈ మూడు మ్యాచ్ లలో కూడా టీం ఇండియా విక్టరీ కొట్టడం గ్యారంటీ అని తెలిపాడు. అండర్ 19 ఆసియా కప్, హాంకాంగ్ సిక్సెస్ లలో టీమిండియా జట్టును ఓడించినంత ఈజీగా సీనియర్లను ఓడించలేరని తెలిపారు. ఇది ఇలా ఉండగా 2027 వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 2వ తేదీన ప్రారంభం కానుంది. నవంబర్ 21వ తేదీ వరకు కొనసాగుతుంది. 2027 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వాండరర్స్ వేదికగా నిర్వహించనున్నారు.