E-Paper
Advertisement

ఒక్క రోజు ఇంటి పనులకే చుక్కలు… తల్లి కోసం పిల్లలకు డాడీ డెడ్లీ చాలెంజ్‌… తెలుగు ఫ్యామిలీ డ్రామా

ఒక్క రోజు ఇంటి పనులకే చుక్కలు… తల్లి కోసం పిల్లలకు డాడీ డెడ్లీ చాలెంజ్‌… తెలుగు ఫ్యామిలీ డ్రామా
Advertisement

Telugu Family Drama: మన ఇంట్లో అమ్మ అయినా, భార్య అయినా ఉదయం నిద్రలేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో పనులు చేస్తుంటారు. వంట చేయడం, పిల్లలను చూసుకోవడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం.. ఇలా కుటుంబం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. కానీ ఆ కష్టం మాత్రం చాలామందికి కనిపించదు. పైగా రోజంతా ఇంట్లోనే ఉంటారు కదా.. ఏం పని చేస్తారని తేలిగ్గా మాట్లాడుతుంటారు. సరిగ్గా ఇలాంటి ఆలోచనా ధోరణికి అద్దం పట్టే కథతో ఒక తెలుగు ఫ్యామిలీ డ్రామా రూపొందింది. ఇందులో తల్లి కోసం పిల్లలకు డాడీ డెడ్లీ చాలెంజ్‌ కూడా విసురుతాడు. దీంతో ఒక్కరోజు ఇంటి పనులు చేయడానికి పిల్లలు ఎలాంటి తిప్పలు పడ్డారో చూస్తే నవ్వు ఆగదు. అంతేకాదు ఇంటిల్లిపాదీ కలిసి చూడదగిన ఒక మంచి సందేశాత్మక కథ ఇది.

కథలోకి వెళ్తే…

సీతారామ్ (హర్షవర్ధన్), సుగుణ (మీనా వాసు) దంపతులకు కిరణ్ (ఉజ్వల్), స్వప్న (హరిణి రెడ్డి) అనే ఇద్దరు పిల్లలు ఉంటారు. సీతారామ్‌కు ఆదివారం వచ్చిందంటే చాలు.. తనకు నచ్చినట్లుగా విశ్రాంతి తీసుకుంటూ సరదాగా గడపడం అలవాటు. కానీ సుగుణకు మాత్రం ఆదివారం కూడా సెలవు ఉండదు. మిగతా రోజుల్లోలాగే ఇంటి పనులన్నీ చూసుకోవాల్సి వస్తుంది. పిల్లలకు కావాల్సినవి సమయానికి అందించడం నుంచి వంట చేయడం, ఇల్లు సర్దడం వరకు ఆమెకు ఎప్పుడూ పని ఉంటూనే ఉంటుంది.

Advertisement

అయితే తల్లి పడుతున్న కష్టాన్ని పిల్లలు ఏమాత్రం గుర్తించరు. తమకు కావాల్సినవి వెంటనే చేయాలని అడుగుతుంటారు. పైగా ఇంట్లో ఉండి చేసే పనులేముంటాయని తల్లిని తేలిగ్గా తీసుకుంటారు. ఒకరోజు పిల్లల ప్రవర్తన చూసి సీతారామ్‌కు కోపం వస్తుంది. రోజంతా కుటుంబం కోసం కష్టపడే తల్లి శ్రమను గుర్తించకుండా మాట్లాడటం తప్పని వారికి అర్థమయ్యేలా చెప్పాలని నిర్ణయించుకుంటాడు.

అయితే తండ్రి మాటలకు పిల్లలు కూడా పంతానికి పోతారు. వచ్చే ఆదివారం ఇంటి పనులన్నీ తామే చేసుకుంటామని సవాలు విసురుతారు. మొదట్లో చాలా ఉత్సాహంగా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన పిల్లలకు అసలు కష్టాలు ఆ రోజు మొదలవుతాయి. వంట చేయడం, ఇంటిని శుభ్రం చేయడం, రోజువారీ పనులను సమయానికి పూర్తి చేయడం.. ఇలా ఒక్కో పని దగ్గర వారికి కొత్త సమస్యలు ఎదురవుతాయి. చిన్న చిన్న పనులకే అలసిపోయి, ఒకదాని తర్వాత మరొకటి తప్పులు చేస్తుంటారు.

Advertisement

ఇంతకాలం అమ్మ సులభంగా చేసేస్తుందని అనుకున్న పనుల వెనుక ఎంత శ్రమ ఉంటుందో వారికి అర్థమవుతుందా? ఒక్కరోజు ఇంటిని చూసుకోవడానికే ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు, ప్రతిరోజూ తల్లి ఎంత కష్టపడుతుందో తెలుసుకుంటారా? తమ తప్పును గుర్తించి అమ్మకు అండగా నిలబడతారా? అనే అంశాలను దర్శకుడు వినోదాత్మకంగా, భావోద్వేగాలతో చూపించారు. ప్రతి ఇంట్లో కనిపించే సంఘటనలతోనే కథగా మలచడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ.

ETV Winలో స్ట్రీమింగ్

‘Challenge’ అనే పేరుతో వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ ఈటీవీ విన్‌ (ETV Win) అందిస్తున్న ‘కథా సుధ’ వీక్లీ స్టోరీస్‌లో భాగంగా నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సీతారామ్ పాత్రలో హర్షవర్ధన్, సుగుణగా మీనా వాసు నటించారు. పిల్లలుగా ఉజ్వల్, హరిణి రెడ్డి కనిపిస్తారు. సతీష్ వేగేశ్న కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. కె. రాఘవేంద్రరావు సమర్పణలో ఈ చిత్రాన్ని సతీష్ వేగేశ్న నిర్మించారు.

Read Also: భర్త ఉండగానే మరొకరితో… కెమెరా ముందే బట్టబయలైన నిజాలు… క్రేజీ కొరియన్ రిలేషన్‌షిప్ డ్రామా

Tags

Related News

చచ్చినా వదలని ప్రేమ మత్తు… కుక్క సాయంతో ప్రేయసికి చేరువగా… ది బాప్ ఆఫ్ ఎమోషనల్ రైడ్

అప్పుడే ఓటీటీలోకి రాబోతున్న జెన్ జీ మెచ్చిన మూవీ.. ఏది? ఎక్కడంటే?

ఆడుకుంటుంటే చేతికి చిక్కిన 5 కోట్ల అదృష్టం… రాత్రికి రాత్రే మారిపోయిన తలరాత… పక్కా ఫ్యామిలీ డ్రామా

కాళ్ళకి చెప్పులు లేవు… కానీ కళ్ళలో వరల్డ్ కప్ కల… ఏడుగురు కుర్రాళ్ల అన్స్టాపబుల్ గూస్బంప్స్ స్టోరీ

కళ్ళు తెరిచి చూస్తే నిజమైన గేమ్‌లో… కానీ రియల్ లైఫ్‌లో నరకం… డార్క్ యాక్షన్ సిరీస్

పవిత్రమైన చెట్టును నరికిన మూడ్రోజులకే ఇంటి పెద్ద మృతి… 16 రోజుల్లో ఐదుగురి చావులు… నవ్విస్తూ భయపెట్టే మలయాళ థ్రిల్లర్

చీకటి పడితే ఆ అడవిలోకి పోవద్దు… వనదేవత విలయతాండవం… ఒళ్లు గగుర్పొడిచే హారర్

Big Stories

Advertisement
×