Kannappa Movie OTT : ఇటీవల కాలంలో ఒక సినిమా థియేటర్లో విడుదల అయ్యిందంటే థియేటర్లో విడుదలైన నాలుగు వారాల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా ఇటీవల నటించిన చిత్రం కన్నప్ప (Kannappa). శివుడికి పరమ భక్తుడైన కన్నప్ప శివయ్య పై ఎలా తన భక్తిని చాటుకున్నారనే నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తన సొంత నిర్మాణంలోనే తిరకెక్కిన ఈ సినిమా జూన్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. విష్ణు సినీ కెరియర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా కన్నప్ప గుర్తింపు పొందింది.
ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నప్ప..
ఇక ఈ సినిమా థియేటర్లలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్లో చూడటం మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో చూడటానికి ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అభిమానులకు మంచు విష్ణు శుభవార్తను తెలియజేశారు. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి కన్నప్ప సినిమా అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వీడియోలో అందుబాటులోకి రాబోతుందని తెలియజేశారు.థియేటర్‌లో రిలీజ్ అయిన 69 రోజులకు ఓటీటీలోకి రాబోతుందనే విషయాన్ని వెల్లడించడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో విష్ణు తిన్నడి పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
రుద్ర పాత్రలో ప్రభాస్..
ఇక ఈ సినిమాలో మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులందరూ కూడా వివిధ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా భాగమైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శివపార్వతులుగా నటించి సందడి చేశారు. శరత్ కుమార్, మోహన్ లాల్ , ప్రభాస్(Prabhas) వంటి స్టార్ సెలబ్రిటీలు ఈ సినిమాలో భాగమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించి సందడి చేశారు.
Witness the epic, spirit of sacrifice & divinity 🙏#KANNAPPA releases digitally on Sept 4, 2025 only on Prime Video.
Har Har Mahadev 🔱
Har Ghar Mahadev 🔥#KannappaOnPrime #KannappaMovie #HarHarMahadevॐ pic.twitter.com/WVrbZ2AMvn— Vishnu Manchu (@iVishnuManchu) September 1, 2025
ఇలా ప్రభాస్ రుద్ర పాత్రలో దాదాపు అరగంటకు పైగా తెరపై కనిపించి సందడి చేయడంతో ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమాని చూడడం కోసం ఎంతో ఆసక్తి కనపరిచారు. ఇక ప్రభాస్ కారణంగానే ఈ సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టిందని చెప్పాలి. ప్రభాస్ కారణంగానే తన సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయని విష్ణు తెలియజేశారు. నా సినీ కెరియర్ లో కన్నప్ప సినిమా ఎంతో కీలకమైనదని విష్ణు వెల్లడించారు. ఇలా థియేటర్లలో మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారానికి సిద్ధమవుతుంది. మరి ఇక్కడ ఏ విధమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక కన్నప్ప సినిమా తర్వాత విష్ణు తదుపరి ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు కానీ ఈయన మాత్రం రామాయణం సినిమా చేయాలని ఉందంటూ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తన మనసులో మాటను బయటపెట్టారు.
Also Read: Anchor Suma యాంకర్ సుమ ఇంటి విలువ రూ.500 కోట్లా … మామూలుగా సంపాదించలేదుగా?