Anchor Suma: టాలీవుడ్ యాంకర్ అంటే అందరికీ టక్కున సుమ కనకాల(Suma Kanakala) పేరు గుర్తుకొస్తుంది. కెరీర్ మొదట్లో సినిమాలలో నటించే సుమ వరుస బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉండేవారు. ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాలను కూడా పూర్తిగా పక్కన పెట్టేసారు. కేవలం సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఒక సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం నుంచి మొదలుకొని ఆ సినిమా సక్సెస్ ఈవెంట్ వరకు కూడా సుమ యాంకర్ గా వ్యవహరిస్తూ సినిమాకు కావలసినంత బజ్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అయితే ఈమె ఒక గంటపాటు ఒక కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తే లక్షల్లోనే రెమ్యూనరేషన్(Remuneration) తీసుకుంటూ ఉంటారు.
శివ కార్తికేయన్..
ఇలా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె భారీ స్థాయిలోనే ఆస్తులు సంపాదించారని తెలుస్తుంది. అయితే తాజాగా సుమ ఇంటికి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. సుమ ఇంటి విలువే దాదాపు 500 కోట్ల రూపాయలు చేస్తుంది అంటూ తాజాగా నటుడు శివ కార్తికేయన్(Siva Karthikeyan) సుమకు సంబంధించిన ఈ విషయాన్ని బయట పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. శివ కార్తికేయన్ హీరోగా నటించిన మదరాశి (Madarasi)సినిమా సెప్టెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు.
ఇంటి విలువ రూ.500 కోట్లు?
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు శివ కార్తికేయన్ సుమ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ.. సర్ మీరు మాత్రమే కాదు మేము కూడా రీల్స్ లో కాస్త పాపులర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాము అంటూ సుమ మాట్లాడటంతో వెంటనే శివ కార్తికేయన్ సుమ గారు మీరు పాపులరో పాపులర్ .. ఇక మీ గురించి నేను ఇంకోటి కూడా చెప్పాలి అదే 500 కోట్ల రూపాయల ఇంటి గురించి అంటూ శివ కార్తికేయన్ మాట్లాడటంతో వెంటనే సుమ అయ్యో వద్దు సార్ అంటూ మాట్లాడటమే కాకుండా ఈయన మా ఫేక్ న్యూస్ గురించి మాట్లాడుతున్నారు అది నిజమని మీరెవరు నమ్మొద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు.
బిజీ యాంకర్ గా సుమ కనకాల…
ఏది ఏమైనా సుమ ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ భారీ స్థాయిలో పాపులర్ సొంతం చేసుకోవడమే కాకుండా భారీగా ఆస్తులు కూడా సంపాదించారని చెప్పాలి. నిజానికి సుమ తెలుగు అమ్మాయి కాకపోయినా ఎంతో స్పష్టంగా తెలుగు మాట్లాడుతూ.. ఎంత పెద్ద కార్యక్రమాన్ని అయిన ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాండిల్ చేయగలిగే సత్తా ఉంది. అందుకే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి వేడుక జరిగిన ఆ వేడుకలో సుమ ఉండి తీరాల్సిందేనని దర్శక నిర్మాతలు కూడా భావిస్తూ ఉంటారు. ఇక కొంతమంది దర్శక నిర్మాతలు సుమ డేట్స్ తెలుసుకొని మరి తమ సినిమా ఈవెంట్లను పెట్టుకుంటారు అంటే ఈమె క్రేజ్ ఎలా ఉందో స్పష్టమవుతుంది.
Also Read: Teja Sajja: కల్కి 2 లో ఆ పాత్రలో చాన్స్ కొట్టేసిన తేజ సజ్జ… ఇక తిరుగుండదుగా?