TGSRTC Punya Kshetra Yatra: చాలా మందికి ఇష్టమైన దేవాలయాలను సందర్శించుకోవాలని ఉన్నా, సరైన సౌకర్యాలు లేక, ఎక్కువ ఖర్చు అవుతుందనే కారణాలతో వెళ్లలేకపోతారు. అలాంటి వారి కోసం తెలంగాణ ఆర్టీసీ మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. తక్కువ ఛార్జీతో ‘పుణ్యక్షేత్ర దర్శిని’ పేరుతో పలు ప్యాకేజీలను అందిస్తుంది. దేవరకొండ బస్ డిపో 11 ప్రత్యేక టూర్ ప్లాన్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఈ బస్ డిపో అందిస్తున్న ప్యాకేజీలు ఏవి? వాటి ఛార్జీ ఎంత అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ తిరుపతి: ఈ యాత్రలో తిరుపతి, అరుణాచలం, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, కంచి పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తుంది. మొత్తం 4 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ఒక్కో వ్యక్తి రూ. 5,400 చొప్పున ఛార్జీ వసూలు చేస్తారు.
⦿ అరుణాచలం: ఈ యాత్రలోనాలుగు పుణ్యక్షేత్రాల దర్శనం ఉంటుంది. అరుణాచలం, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, కంచికి తీసుకెళ్తారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ యాత్రకు గాను ఒక్కో వ్యక్తికి రూ. 4,000 వసూలు చేస్తారు.
⦿ ధర్మపురి: ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల పరిధిలోని ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, కొమరవెల్లి ఆలయాలకు తీసుకెళ్లతారు. ఒకరోజు మాత్రమే ఉండే ఈ యాత్రకు, ఒక్కో వ్యక్తి నుంచి రూ. 1,500 వసూలు చేస్తారు.
⦿ భద్రాచలం: ఇక భద్రాచలం, మల్లూరు, మేడారం, లక్నవరం, రామప్ప క్షేత్రాల దర్శానికి సంబంధించి ఒక్కరోజు యాత్రను తీసుకెళ్తున్నారు. దీనికి గాను.. ఒక్కో వ్యక్తికి రూ. 1,700 వసూలు చేస్తున్నారు.
⦿ మహానంది: మహానంది, ఓంకారం, అహోబిలం, యాగంటి, నందనవరాన్ని ఒకే రోజులో చూపించుకుని తీసుకొస్తున్నారు. ఈ యాత్రకు దేవరకొండ నుంచి 1,600, హాలియా నుంచి రూ. 1,900 ఛార్జీ తీసుకుంటున్నారు.
⦿ పంచారామాలు: అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకు ఒకే రోజులో తీసుకెళ్లనున్నారు. ఇందుకు గాను ఒక్కో వ్యక్తి నుంచి రూ. 2,000 ఛార్జీ తీసుకుంటున్నారు.
⦿ ద్వారకా తిరుమల: ద్వారకాతిరుమల, సింహాచలం, ఆర్కే బీచ్, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, పెనుకొండ ప్యాకేజీ రెండు రోజుల పాటు కొనసాగుతుంది. దీనికి కోసం రూ.2,600 ఛార్జీ వసూలు చేస్తున్నారు.
⦿ ఆలంపూర్: ఆలంపూర్, బీచ్ పల్లి, శ్రీరంగాపూర్, జటప్రోలు, సోమశిల, కొల్లాపూర్, సింగోటం ప్రాంతాలను ఒకే రోజులో తిప్పి చూపించుకుని వస్తారు. ఇందుకోసం ఒక్కో వ్యక్తికి దేవరకొండ నుంచి రూ. 1,000, హాలియా నుంచి రూ. 1,300 వసూలు చేస్తున్నారు.
⦿ విజయవాడ: విజయవాడ, పెద్దపులిపాక, ఉండవల్లి, మంగళగిరి, అమరావతి, పెద్దకూరపాడుకు ఒకే రోజులో తీసుకెళ్లనున్నారు. ఈ యాత్రకు గాను ఒక్కో వ్యక్తి నుంచి రూ. 1,500 వసూలు చేస్తున్నారు.
⦿ మక్తల్: మక్తల్, కురుముర్తి, మన్నెంకొండ, గంగాపూర్, ఉర్కొండపేటకు ఒకే రోజులు తీసుకెళ్లనున్నారు. ఇందుకోసం ఒక్కో వ్యక్తికి దేవరకొండ నుంచి రూ. 1,000, హాలియా నుంచి 1,300 తీసుకుంటున్నారు.
⦿కొల్లాపూర్: ఇక కొల్లాపూర్, మహాభలేశ్వరం, తుల్జాపూర్, పండరిపూర్ ప్యాకేజీ రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఇందుకోసం ఒక్కో వ్యక్తికి దేవరకొండ నుంచి రూ. 3,500, హాలియా నుంచి రూ. 3,800 ఛార్జ్ వసూళు చేస్తున్నారు.
ఈ యాత్రలు మాత్రమే కాకుండా 35 మంది ఉంటే ఏ యాత్రకైనా తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ప్యాకేజీ డిజైన్ చేయనున్నట్లు దేవరకొండ డిపో అధికారులు వెల్లడించారు. బుకింగ్ కోసం బస్టాండ్ లోని కౌంటర్ ను సంప్రదించాలని సూచించారు.
Read Also: పండుగ సీజన్ కోసం 150 ప్రత్యేక రైళ్లు, తెలుగు ప్రయాణీకులకు క్రేజీన్యూస్!