OTT Movie : హాలీవుడ్ రొమాంటిక్ సినిమాలను యూత్ కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంటారు. వీటిలో కొన్ని సన్నివేశాలను చూస్తే రాత్రి పూట నిద్ర కూడా పట్టదు. అంతలా రెచ్చగొట్టే విధంగా సీన్స్ వాటిలో ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రొమాంటిక్ మూవీలో ఇద్దరమ్మాయిలతో హీరో రొమాన్స్ చేస్తాడు. చివరికి ఆ అమ్మాయిల వలన హీరో ఇబ్బందుల్లో పడతాడు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే….
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ పేరు ‘నాక్ నాక్’ (Knock Knock). 2015 లో రిలీజ్ అయిన ఈ మూవీకి ఎలి రోత్ దర్శకత్వం వహించారు. ఇతను గిల్లెర్మో అమోడో, నికోలస్ లోపెజ్‌లతో కలిసి స్క్రిప్ట్‌ను కూడా రచించాడు. ఇందులో కీను రీవ్స్, లోరెంజా ఇజ్జో, అనాడి అర్మాస్ నటించారు. ఈ మూవీ లయన్స్‌గేట్ ప్రీమియర్ ద్వారా అక్టోబర్ 9, 2015న విడుదలైంది. ‘నాక్ నాక్’ అనేది ‘డెత్ గేమ్’ కు రీమేక్ గ వచ్చింది. దీనికి పీటర్ ఎస్. ట్రేనర్ దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
హీరో తన ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తాడు. అయితే ఆఫీస్ వర్క్ ఉండడంతో ఆ హీరో ఆగిపోవాల్సి వస్తుంది. భార్య, కూతుర్ని వెకేషన్ కి పంపి తను ఇంట్లోనే ఉండిపోతాడు. ఆరోజు బయట కూడా వర్షం పడుతూ ఉంటుంది. హీరో ఇంటి తలుపులను ఎవరో కొడతారు. హీరో డోర్ తెరిచి చూస్తే ఇద్దరమ్మాయిలు కనిపిస్తారు. వాళ్లు వర్షంలో తడుస్తూ అడ్రస్ తప్పిపోయామని, వర్షం కూడా పడుతూ ఉండటంతో తగ్గేంతవరకు ఇక్కడే ఉంటామని చెప్తారు. అమ్మాయిలు కదా అని హీరో ఇంట్లో ఉండటానికి షెల్టర్ ఇస్తాడు. అప్పట్నుంచి హీరోని ఈ అమ్మాయిలు రెచ్చగొడుతూ ఉంటారు. చివరికి హీరో స్నానం చేస్తుంటే అక్కడికి కూడా వెళ్తారు. వీళ్ళిద్దరూ బట్టలు మొత్తం తీసి హీరోతో కలసి స్నానం చేస్తారు. హీరో ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా, హీరో వాళ్లతో రొమాన్స్ చేయాల్సి వస్తుంది. అలా ముగ్గురూ ఆ పనిలో బిజీ అయిపోతారు.
ఆ తర్వాత వీళ్ళ ప్రవర్తన చాలా తేడాగా ఉంటుంది. హీరో వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మని వార్నింగ్ ఇస్తాడు. అయితే ఈ అమ్మాయిలు హీరోని బంధిస్తారు. ఇంతలో పక్కనే ఉండే హీరో ఫ్రెండ్ ఇంటికి వస్తాడు. ఈ అమ్మాయిలు అతన్ని దారుణంగా చంపేస్తారు. ఆ తర్వాత హీరో భార్య వెకేషన్ ముగించుకుని ఇంటికి వస్తుంది. చివరికి ఈ అమ్మాయిలు ఆ ఫ్యామిలీని ఏం చేస్తారు? ఇంతకీ వీళ్ళు ఎందుకు సైకోలా ప్రవర్తిస్తుంటారు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘నాక్ నాక్’ (Knock Knock) అనే ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.